వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మరో ఎన్నికల సమరానికి జనసేన సిద్దం ! సేనాని ఆమోదం కోసం వేయిటింగ్ !

|
Google Oneindia TeluguNews

Recommended Video

మ‌రో ఎన్నిక‌ల స‌మ‌రానికి ప‌వ‌న్ సిద్దం : చ‌ర్చ‌ల్లో జ‌న‌సేనాని || Oneindia Telugu

జ‌న‌సేనాని మ‌రో ఎన్నిక‌ల బ‌రిలో స‌త్తా చాటేందుకు సిద్ద‌మ‌వుతున్నారు. ఏపిలో సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో విస్తృతంగా ప్ర‌చారం చేసి..పోలింగ్ ముగిసిన త‌రువాత జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాన్ మౌనంగా ఉంటున్నారు. అయితే, తాజాగా ప‌వ‌న్ స‌మక్షంలో పార్టీ నేత‌లు మ‌రో ఎన్నిక‌ల అంశాన్ని ప్ర‌స్తావించారు. ఆ ఎన్నిక‌ల్లో పోటీ చేసేందుకు ప‌వ‌న్ సానుకూలంగానే స్పందించారు. అయితే , తుది నిర్ణ‌యం తీసుకోనుంది.

ఏపి ఎన్నిక‌ల త‌రువాత మౌనం..

ఏపి ఎన్నిక‌ల త‌రువాత మౌనం..

ఏపిలో జ‌న‌సేన స‌త్తా చాటేందుకు ప‌వ‌న్ క‌ళ్యాన్ దాదాపు ఏడాది పైగా రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ప‌ర్య‌టించారు. 2018 మార్చి 14న గుంటూరులో జ‌రిగిన పార్టీ అవిర్భావ స‌భ‌లో చంద్ర‌బాబు..లోకేశ్ పైన ఓపెన్‌గా అవినీతి ఆరోప‌ణ‌లు తీవ్ర స్థాయిలో చేసిన వ‌ప‌న్‌..ఇక నాటి నుండి ఒక విధంగా ఎన్నిక‌ల ప్ర‌చారం ప్రారంభించారు. తాను ఎవ‌రికీ మ‌ద్ద‌తుగా ఉండ‌టం లేద‌ని చెబుతూ ఏపిలో వామ‌ప‌క్షాలు..బీఎస్సీతో క‌లిసి పోటీ చేసారు. దాదాపు అన్ని జిల్లాల్లోనూ ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ‌ల్లో పాల్గొన్నారు. స్వ‌యంగా ప‌వ‌న్ భీమ‌వ‌రం..గాజువాక స్థానాల్లో ఎమ్మెల్యే అభ్య‌ర్దిగా బ‌రిలో నిలిచారు. ఆయ‌న సోద‌రుడు నాగ‌బాబు న‌ర్సాపురం ఎంపీ అభ్య‌ర్దిగా పోటీలో ఉండ‌గా..సిబిఐ మాజీ జేడి లక్ష్మీనారాయ‌ణ విశాఖ నుండి జ‌న‌సేన ఎంపి అభ్య‌ర్దిగా గ‌ట్టి పోటీ ఇచ్చారు. ఆయ‌న గెలిచే అవ‌కాశాలు ఉన్నాయ‌ని పార్టీ నేత‌లు చెబుతున్నారు. అయితే, ఎన్నిక‌ల త‌రువాత ప‌వ‌న్ మీడియా ముందుకు రాలేదు. పోలింగ్ స‌ర‌ళిపైనా.. ఇవియంల పైనా జ‌రుగుతున్న రాద్దాంతం పైనా స్పందించ‌లేదు.

తెలంగాణ‌లోనూ ఏడు స్థానాల్లో పోటీ..

తెలంగాణ‌లోనూ ఏడు స్థానాల్లో పోటీ..

జ‌నసేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాన్ ఏపి ప్ర‌చారం పైనే ప్ర‌ధానంగా దృష్టి పెట్టినా..తెలంగాణ‌లోని ఏడు స్థానాల్లోనూ పార్టీ పోటీ చేసింది. బీఎస్పీతో క‌లిసి జ‌న‌సేన తెలంగాణ‌లోని పోటీ చేసిన ఏడు స్థానాల్లో పోలింగ్ స‌ర‌ళి పైన పార్టీ నేత‌ల‌తో ప‌వ‌న్ స‌మీక్షించారు. ఏపి ప్ర‌చారంలో ప‌వ‌న్ తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పైన విమ‌ర్శ‌లు చేసారు. ఏపి రాజ‌కీయాల‌తో కేసీఆర్ ఏం ప‌ని అంటూ ప్ర‌శ్నించారు. ఆయ‌న పోటీ చేయాల‌నుకుంటే నేరుగా పోటీ చేయాల‌ని.. జ‌గ‌న్ కు మ‌ద్ద‌తిస్తున్నారంటూ ఆరోపించారు. జ‌గ‌న్ -కేసీఆర్ మ‌ధ్య ఒప్పందం ఉంద‌ని విమ‌ర్శించారు. అయితే, కేసీఆర్ ప్ర‌తిపాదిస్తున్న ఫెడ‌ర‌ల్ ఫ్రంట్‌లో మాత్రం ప‌వ‌న్ చేరిక పైన ఎటువంటి చ‌ర్చ జ‌ర‌గ‌లేదు. ఇక‌, ఇప్పుడు జ‌న‌సేన తెలంగాణ‌లో మ‌రో ఎన్నిక‌ల పోరులో త‌ల‌ప‌డేందుకు సిద్ద‌ప‌డుతోంది.

స్థానిక సంస్థ‌ల పోరులో జ‌న‌సేన‌..

స్థానిక సంస్థ‌ల పోరులో జ‌న‌సేన‌..

తెలంగాణ‌లో త్వ‌ర‌లో జ‌రిగే స్థానిక సంస్థ‌ల పోరులో పోటీ చేసే అంశం పైనే ఇప్పుడు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆలోచ‌న చేస్తున్నారు. తెలంగాణలో జరగనున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేయాలని జనసేన పార్టీ తెలంగాణ నేతలు అధినేత వ‌ద్ద ప్ర‌తిపాదిస్తున్నారు. పార్టీ తెలంగాణ ఇన్‌చార్జి శంకర్‌గౌడ్‌, మరో నేత మహేందర్‌రెడ్డి పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ ముందు దీని పైన స‌దీర్ఘంగా చ‌ర్చించారు. ప‌రిష‌త్ ఎన్నిక‌లు పార్టీ గుర్తుల‌పై జ‌రుగుతున్నాయ‌ని..ఆ ఎన్నిక‌ల్లో పోటీ చేస్తే మేలు జ‌రుగుతుంద‌ని వారు ప‌వ‌న్‌కు వివ‌రించారు. దీని పైన సానుకూలంగా స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ ముఖ్య నేతల అభిప్రాయాలు, కార్యకర్తల మనోగతం ఎలా ఉందో చర్చించి తనకు చెప్పాలని, ఆ తర్వాత నిర్ణయం తీసుకుందామని స్ప‌ష్టం చేసారు. దీంతో..త్వ‌ర‌లోనే తెలంగాణ స్థానిక సంస్థ‌ల బ‌రిలో పోటీ చేసే అంశం పైన ప‌వ‌న్ నిర్ణ‌యం తీసుకోనున్నారు.

English summary
Janasena Chief pawan Kalyan concentrated on contesting local body elections in Telanagana. Janasena Telangana leaders proposed contesting issue before Pawan Kalyan. Shortly pawan may take decision.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X