వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మేం ఒంటరికాదు, మాకు పవన్ కళ్యాణ్ దొరికారు: బాబు-జగన్‌లపై తీవ్రవ్యాఖ్యలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై సీపీఎం నేత రామకృష్ణ ఆదివారం తీవ్రంగా మండిపడ్డారు. విజయవాడలోని జింఖానా మైదానంలో నిర్వహించిన నిర్వహించిన సీపీఎం, సీపీఐ, జనసేన పార్టీల శంఖారావం సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

Recommended Video

క్రియాశీల రాజకీయాలకు సిద్ధమవుతున్న పవన్...!

చంద్రబాబు విజయవాడను బకారసురుల చేతిలో పెట్టారని, బకాసుర నగరంగా మారిందన్నారు. మంత్రులు, ఎమ్యెల్యేలకు కలెక్షన్ ఏజెంట్లలా విజయవాడ కార్పొరేటర్లు పని చేస్తున్నారన్నారు. నగరంలో బిల్డింగ్ అనుమతికి రూ.5 లక్షలు వసూలు చేస్తున్నారన్నారు.

పవన్-లక్ష్మీపార్వతి వ్యాఖ్య: జూ.ఎన్టీఆర్ వస్తే, చంద్రబాబుకు అంతుందా!?పవన్-లక్ష్మీపార్వతి వ్యాఖ్య: జూ.ఎన్టీఆర్ వస్తే, చంద్రబాబుకు అంతుందా!?

మాకు పవన్ కళ్యాణ్ పెద్ద అండ

మాకు పవన్ కళ్యాణ్ పెద్ద అండ

జనసేనతో కలిసి ఏఫీలో కొత్త రాజకీయ విధానం తీసుకు వస్తామని మధు చెప్పారు. ప్రజా సమస్యలపై తాము పోరాటం చేస్తుంటే పోలీసులతో అరెస్టు చేయిస్తున్నారని ధ్వజమెత్తారు. కమ్యూనిస్టుల పోరాటానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పెద్ద అండ అని సీపీఎం మధు అన్నారు. కమ్యూనిస్టులు ఒంటరి కాదని, పవన్ అండగా దొరికారని చెప్పారు.

అందుకే జనసేన పార్టీ ఏర్పాటయింది

అందుకే జనసేన పార్టీ ఏర్పాటయింది

రాష్ట్రంలో ప్రజా సమస్యలపై పోరాటానికి బీజం పడిందని సీపీఐ రామకృష్ణ వ్యాఖ్యానించారు. నాలుగేళ్లలో మన ఎంపీలు ఒక్కసారి కూడా ప్రజా సమస్యల పైన పోరాడలేదని మండిపడ్డారు. నవ్యాంధ్రను తెలుగుదేశం పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు దోచుకు తింటున్నారని ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికలలో కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో తెలుగుదేశం అధికారంలోకి రావని జోస్యం చెప్పారు. సామాన్యులు సైతం రాజకీయాల్లోకి రావాలనే జనసేన ఏర్పడిందన్నారు.

ఉమ్మడి పోరాటం ప్రారంభం

ఉమ్మడి పోరాటం ప్రారంభం

సీపీఎం, సీపీఐ, జనసేన పార్టీలు ఉమ్మడి పోరాటం విజయవాడ నుంచి ప్రారంభమైందని రామకృష్ణ అన్నారు. అవినీతి పనులతో టీడీపీ కార్పొరేటర్లు అభివృద్ధి చెందారని, మొన్నటి వరకు బైక్‌లపై తిరిగే కార్పొరేటర్లు, నేడు ఆడి కార్లలో తిరుగుతున్నారన్నారు. చంద్రబాబు అవినీతిపాలనతో ప్రజలు విసిగిపోయారన్నారు. బీజేపీ, టీడీపీలు ఏపీకి తీవ్రఅన్యాయం చేశాయన్నారు. రాజకీయాల్లో మార్పు రావాలంటే చంద్రబాబు, నరేంద్ర మోడీ దిగిపోవాలన్నారు.

జగన్ అలా అనడం విడ్డూరం

జగన్ అలా అనడం విడ్డూరం

అవినీతి కేసుల్లో నిందితుడిగా ఉన్న వైసీపీ అధినేత వైయస్ జగన్ తాను అధికారంలోకి వస్తే అవినీతిలేని ఏపీని చేస్తాననడం విడ్డూరంగా ఉందని రామకృష్ణ అన్నారు. జగన్ ప్రతిపక్ష పార్టీగా విఫలమైందని చెప్పారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లకుండా జీతాలతో జల్సా చేస్తున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో సీసీఐ, సీపీఎం, జనసేనలు కలిసి పోటీ చేస్తాయన్నారు. విజయవాడ నగరంలోని కొండప్రాంతవాసులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. పార్టీలోని అవినీతిపరులను చంద్రబాబు అదుపులో పెట్టలేకపోతున్నారన్నారు.

English summary
Janasena, CPI and CPM form an alliance for next elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X