వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జ‌న‌సేన తొలి లిస్టు ..ఎంపీ అభ్య‌ర్ధుల ప్ర‌క‌ట‌న‌ : ఆశావాహుల్లో ఉత్కంఠ‌: ప‌వ‌న్ తుది క‌స‌ర‌త్తు..!

|
Google Oneindia TeluguNews

ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల కాగానే..జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాన్ వేగంగా అడుగులు వేస్తున్నారు. ఎన్నిక‌ల్లో త‌న పార్టీ నుండి పోటీ చేపే అభ్య‌ర్ధుల‌ను తొలి జాబితాను విడుద‌ల చేసారు. ఈ నెల 14న పార్టీ అవిర్భావ దినోత్స‌వం సంద ర్భంలో రాజ‌మండ్రిలో భారీ స‌భ ఏర్పాటు చేసారు. అదే రోజు పార్టీ అభ్య‌ర్దుల పూర్తి జాబితా విడుద‌ల‌కు ప‌వ‌న్ క‌ళ్యాన్ తుది క‌స‌రత్తు చేస్తున్నారు.

<strong>స‌డ‌న్ ట్విస్ట్ :కొడాలి నాని తో రాధా ఆకస్మిక భేటీ: మ‌న‌సు మారిందా..మ‌ద్ద‌తు కోస‌మా</strong>స‌డ‌న్ ట్విస్ట్ :కొడాలి నాని తో రాధా ఆకస్మిక భేటీ: మ‌న‌సు మారిందా..మ‌ద్ద‌తు కోస‌మా

 ఇద్ద‌రు లోక్‌స‌భ అభ్య‌ర్దులు ప్ర‌క‌ట‌న‌..

ఇద్ద‌రు లోక్‌స‌భ అభ్య‌ర్దులు ప్ర‌క‌ట‌న‌..

జ‌న‌సేన నుండి పోటీ చేసే ఇద్ద‌రు అభ్యర్దుల‌ను ప్ర‌క‌టించారు. అమలాపురం నుంచి ఓఎన్జీసీ విశ్రాంత అధికారి డీఎం ఆర్‌ శేఖర్‌, రాజమహేంద్రవరం లోక్‌సభ స్థానం నుంచి ఆకుల సత్యనారాయణను బరిలో దింపుతున్నట్టు వెల్లడించా రు. డీఎంఆర్‌ శేఖర్‌ తమ పార్టీలో చేరడం వ్యక్తిగతంగా తనకెంతో ఆనందంగా ఉందని పవన్‌ అన్నారు. 2014లో తమ పార్టీ ఆవిర్భావ సభకు కూడా ఆయన తన సన్నిహితులతో కలిసి వచ్చారని, తమ ఇద్దరి భావజాలం కలిసిందని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. అలాగే 2014 ఎన్నికల్లో భాజపా నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది ఇటీవల జనసేనలో చేరిన ఆకుల సత్యనారాయణతోనూ తనకు ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. వీరిద్దరూ ఎంపీలుగా గెలుపొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్టు పవన్‌ ఆకాంక్షించారు.

32 మంది ఎమ్మెల్యేలు..9మంది ఎంపీల లిస్టు సిద్దం..

32 మంది ఎమ్మెల్యేలు..9మంది ఎంపీల లిస్టు సిద్దం..

పార్లమెంట్ మరియు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ జనసేన పార్టీ అధ్యక్షుడు ప‌వ‌న్‌ కళ్యాణ్ అభ్యర్థులను ప్రక టించేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా మొదటి విడతలో 32 మంది శాసన సభ అభ్యర్థులు..9 మంది పార్ల మెంట్ నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటించనున్నారు. ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల కావ‌టంతో ఇక‌, ఆల‌స్యం చే య‌కుండా అభ్య‌ర్దుల ఖ‌రారు పై ప‌వ‌న్ దృష్టి సారించారు. ఇందు కోసం పార్టీలోని ముఖ్య నేత‌ల‌తో స‌మావేశ‌మ‌య్యా రు.

ప‌వ‌న్ క‌ళ్యాన్

ప‌వ‌న్ క‌ళ్యాన్

ఈ నెల 14న పార్టీ ఆవిర్భావ దినోత్స‌వం సంద‌ర్భంగా రాజ‌మండ్రిలో స‌భ ఏర్పాటు చేసారు.ఆ స‌భ‌కు ముందుగానే అభ్య‌ర్ధుల‌ను ప్ర‌క‌టించాల‌ని భావిస్తున్నారు. గ‌త నెల‌లో ద‌ర‌ఖాస్తులు స్వీక‌రించి..స్క్రీనింగ్ క‌మిటీ అభ్య‌ర్ధుల వ‌డ‌పోత చేసి..ప‌వ‌న్ క‌ళ్యాన్ ముందు ప్ర‌తిపాదించింది. ఈ లిస్టు ఆధారంగా ప‌వ‌న్ తుది జాబితా ప్ర‌క‌టించేందుకు సిద్ద‌మ‌వుతు న్నారు. దీంతో..ఇప్పుడు ఆశావాహుల్లో ఉత్కంఠ మొద‌లైంది.

English summary
Janasena Chief announced 1st list for up coming elections. Pawan announced two MP Candidates for Rajahmundry and Amalapuram constituecy's. Pawan Kalyan stared deep discussions on candidates selection.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X