వెల్లంపల్లి రాష్ట్రానికి అష్ట దరిద్రం , కొడాలి నానీ .. మాటలు జాగ్రత్త : ఏపీ మంత్రులకు జనసేన వార్నింగ్
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై ఏపీ మంత్రులు చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ నేతలు తీవ్రంగా ఫైర్ అవుతున్నారు. పవన్ కళ్యాణ్ సీఎం జగన్మోహన్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలపై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సినిమాల్లో వకీల్ సాబ్ బయట పకీర్ సాబ్ అన్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయాలకు పనికిరాడు అంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. మంత్రి వెల్లంపల్లి వ్యాఖ్యలపై జనసేన నేత పోతుల మహేష్ మండిపడ్డారు.
సినిమాల్లో వకీల్ సాబ్,బయట పకీర్ సాబ్..పవన్ రాజకీయాలకు పనికిరాడన్న మంత్రి వెల్లంపల్లి

వెల్లంపల్లి మైలపడ్డ మంత్రి .. ఆయనే ఈ రాష్ట్రానికి అరిష్టం , దరిద్రం
వెల్లంపల్లి శ్రీనివాస్ మైల పడ్డ మంత్రి అని, దేవాదాయ శాఖ మంత్రిగా ఉండడానికి ఆయన అనర్హులంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. వెల్లంపల్లి దేవాదాయ శాఖ మంత్రిగా ప్రమాణం చేసిన రెండు మూడు నెలలకే ఆయన తల్లి చనిపోయిందని, ఏడాది పాటు మైల ఉంటుందని పోతుల మహేష్ పేర్కొన్నారు. మళ్లీ ఆగస్టులో మంత్రి సొంత బాబాయి కూడా పోయారనిదీంతో మరో ఏడాది ఆయనకు మైలు ఉంటుందన్నారు. మైల పడిన మంత్రిగా విధులు నిర్వహించకూడదని, కానీ ఆయన దేవాదాయ శాఖ మంత్రిగా విధులు నిర్వహించడం వల్లే రాష్ట్రానికి అష్టదరిద్రాలు చుట్టుకున్నాయి అని పేర్కొన్నారు.

మంత్రి కొడాలి నానీకి బూతులు మాట్లాడటం తప్ప ఏమొచ్చు ?
రాష్ట్రంలో అకాల వర్షాలు కురుస్తున్నాయని , పంటలు చేతికొచ్చే సమయానికి వరదలపాలు అవుతున్నాయని, రాష్ట్రంలో ఎక్కడ చూసినా అల్లర్లు, అరాచకం తప్ప అభివృద్ధి కనిపించడం లేదని పోతిన మహేష్ మండిపడ్డారు . ఈ రాష్ట్రానికి అరిష్టం, దరిద్రం ఎవరంటే మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అని జనసేన నేత పోతుల మహేష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఇదే సమయంలో మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలపై జనసేన నేత శివశంకర్ స్పందించారు. మంత్రి కొడాలి నాని తీరు బూతులు మాట్లాడటం తప్ప పరిపాలనా సమస్యలపై అవగాహన లేకుండా ఉందని ఎద్దేవా చేశారు.

నోరు అదుపులో పెట్టుకోవాలని వార్నింగ్
మంత్రులు కొడాలి నాని ,పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్ ల తీరు ఏ మాత్రం బాగా లేదన్నారు. బూతులు మాట్లాడే వారంతా నానీలు అయ్యారని , వారు నోరు దగ్గర పెట్టుకుంటే మంచిదని హెచ్చరించారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి పార్టీ నేత గా మాట్లాడుతున్నారు తప్ప ప్రజలు ముఖ్యమంత్రి గా మాట్లాడటం లేదని విమర్శించారు శివ శంకర్. వకీల్ సాబ్ అంటే అర్ధం తెలుసా కొడాలి నాని అంటూ ప్రశ్నించారు . పవన్ కళ్యాణ్ ప్రజా నాయకుడని, మీరు చెంచా నాయకులు అని మండిపడ్డారు.

వారు ముగ్గురు మంత్రులు తోకలు కత్తిరించిన కోతులు
ఈ ముగ్గురు తోకలు కత్తిరించిన కోతులని శివశంకర్ అభివర్ణించారు. వారి ప్రాచీన యుగంలో పుట్టాల్సిన వాళ్ళని ఈ యుగంలో వారు పుట్టడం ఆంధ్ర రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యం అంటూ మండిపడ్డారు జనసేన నేత శివశంకర్. నిన్న పవన్ కళ్యాణ్ పై వైసీపీ మంత్రులు నిప్పులు చెరిగారు. పవన్ పై మంత్రులు చేసిన తీవ్ర వ్యాఖ్యలకు ఈ రోజు జనసేన నాయకులు రివర్స్ కౌంటర్ ఇచ్చారు .