వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏది రియల్..ఏది వైరల్: రాపాక సస్పెన్షన్ పైన మరోసారి: నిజం కాదంటూ..జనసేన..!

|
Google Oneindia TeluguNews

జనసేన ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్ పైన మరో లేఖ వైరల్ గా మారింది. పార్టీ నుండి ఎమ్మెల్యే రాపాకను సస్పెండ్ చేస్తూ..జనసేన అధినేత నిర్ణయించారంటూ..ఆయన సంతకంతో ఒక లేఖ ఇప్పడు వైరల్ గా మారింది. జనసేన పార్టీ పేరుతో విడుదల చేసినట్లుగా ఆ లేఖ ఇప్పుడు హల్ చల్ చేస్తోంది. అసెంబ్లీ సమావేశాల్లో ఇంగ్లీష్ మీడియం కి రాపాక మద్దత్తు తెలిపిన తరువాత..ఆయన్ను పార్టీ సస్పెండ్ చేసినట్టు సోషల్ మీడియా లో అప్పుడే ప్రచారం సాగింది. అయితే, గతం లోనే అది ఫేక్ ప్రెస్ నోట్ అని రాపాక తమ తోనే ఉన్నారని జనసేన పార్టీ వర్గాలు స్పష్టం చేసాయి.

అయితే, తాజాగా మరోసారి ఈ నెల 18వ తేదీన రాపాకను పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లుగా మరో లేఖ వైరల్ అవుతోంది. అయితే, పార్టీ వర్గాలు వెల్లడించకుండా వచ్చే వార్తలు జనసైనికులు నమ్మవద్దని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కావాలని సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులని ఆశ్రయిస్తామని జనసేన నేతలు హెచ్చరిస్తున్నారు.

Janasena letter on MLA suspension became viral in social media..party denied

రాపాక సస్పెండ్ అంటూ..

జనసేన ఎమ్మెల్యే రాపాక పైన సస్పెన్షన్ వేటు వేస్తూ..పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నట్లుగా మరో లేఖ వైరల్ గా మారింది. తాజాగా జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ఇంగ్లీషు మీడియం స్కూళ్లకు మద్దతుగా మాట్లాడారు. ఇది పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యవహరించటమే అంటూ పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. అదే సమయంలో ఆయన పైన చర్యలు తీసుకుంటున్నారనే వార్తలు వైరల్ అయ్యాయి.

దీని పైన రాపాక సైతం స్పందించారు. అయితే, ఈ వార్తలను ఉద్దేశ పూర్వకంగా ప్రచారం చేస్తున్నారంటూ జనసేన అధినేత సైతం ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇక, ఇప్పుడు అదే తరహాలో మరో లేఖ వైరల్ అవుతోంది. దీనిని పార్టీ నేతలు ఖండిస్తున్నట్లుగా సమాచారం. కానీ, కింది స్థాయిలో ఉన్న జనసేన అభిమానులు మాత్రం ఏది రియల్..ఏది వైరల్ అనే అంశం మీద స్పష్టత లేక అయోమయానికి గురవుతున్నట్లుగా చర్చ సాగుతోంది.

English summary
Another letter became viral in social media that janasena suspended MLA Rapaka Vara Prasad form party. But, Party leaders denied this letter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X