వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్ కళ్యాణ్ పై బొత్సా వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ .. చిల్లర మాటలు ఆపండి అంటూ రాపాక ఫైర్

|
Google Oneindia TeluguNews

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చి వంద రోజులు గడిచినా రాష్ట్రంలోని పరిస్థితులలో ఏ మాత్రం మార్పు రాలేదు. అటు వైసిపి ప్రభుత్వంపై ప్రతిపక్ష పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇక రాజధాని దొనకొండ కు మారుస్తారు అన్న విషయంలో చెలరేగిన రాజకీయ దుమారం అందరికీ తెలిసిందే. అయితే ఏపీ రాజధాని మార్పు అంశంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజధాని ప్రాంతంలో పర్యటించి, రైతులతో మాట్లాడి రాజధాని మార్పును జనసేన పార్టీ అంగీకరించిందని తేల్చి చెప్పారు. రైతుల పక్షాన ఎలాంటి పోరాటానికైనా జనసేన వెనకాడదని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఇక అప్పటి నుంచి చెలరేగిన రాజకీయ దుమారం చిలికి చిలికి గాలివానగా మారుతోంది. ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసి మాటల తూటాలు పేల్చారు.ఈ నేపథ్యంలో జనసేన నుండి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ బొత్స సత్యనారాయణకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ బినామీ: దొనకొండ మీద ఇలా..మంత్రి బొత్సా వ్యాఖ్యల కలకలం..!!

 పవన్ కళ్యాణ్ చంద్రబాబు బినామీ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసిన బొత్సా

పవన్ కళ్యాణ్ చంద్రబాబు బినామీ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసిన బొత్సా

పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తున్నారు వైసీపీ నేతలు. నిన్నటికి నిన్న వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి చంద్రబాబుకి అజ్ఞాత పార్ట్ నర్ పవన్ కళ్యాణ్ అని, బాబు చేతిలో పవన్ కళ్యాణ్ కీలుబొమ్మ అని రకరకాల వ్యాఖ్యలు చేసారు. ఇక తాజాగా మంత్రి బొత్స సత్యనారాయణ రాజధాని అంశం తో పాటుగా పవన్ కళ్యాణ్ పై విమర్శలు గుప్పించారు. జనసేనాని పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు రాజకీయ బినామీ అని ఆయన వ్యాఖ్యానించారు.

అధికారంలో ఉండి చిల్లరమాటలు మాట్లాడటానికి సిగ్గు పాడాలన్న ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్

అధికారంలో ఉండి చిల్లరమాటలు మాట్లాడటానికి సిగ్గు పాడాలన్న ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్

గతంలో అమరావతి పై బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యల మీద పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. బొత్సను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. ఇక పవన్ మీద అప్పటినుంచి తన వ్యాఖ్యలతో ఎదురుదాడి చేస్తున్నారు బొత్స సత్యనారాయణ. ఇక బొత్స తాజా వ్యాఖ్యలపై స్పందించిన జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ రాజధాని ప్రాంత రైతులకు అన్యాయం జరక్కుండా చూడమని రైతుల తరపున జనసేనాని సూచనలు ఇస్తే చంద్రబాబు రాజకీయ బినామీ అంటూ వ్యాఖ్యలు చేస్తారా అంటూ మండిపడ్డారు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్.అధికారంలో ఉండి ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడటానికి సిగ్గు పడాలి మీరు అంటూ చాలా ఘాటుగా స్పందించారు రాపాక.

సమస్యలను ఎదుర్కోలేక తప్పించుకు తిరిగే మీ నాయకుడు ఎవరి బినామీ అని ప్రశ్నించిన రాపాక

సమస్యలను ఎదుర్కోలేక తప్పించుకు తిరిగే మీ నాయకుడు ఎవరి బినామీ అని ప్రశ్నించిన రాపాక

రాజధాని అంశంలో జరుగుతున్న అవకతవకలపై తొలిసారి ప్రశ్నించి రైతుల తరపున టీడీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రశ్నించింది జనసేన. అది మీరు గుర్తుంచుకోవాలని మంత్రి బొత్సాకు హితవు పలికారు రాపాక . ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చాక కూడా తప్పులు జరుగుతున్నాయి సరిదిద్దుకోండి అని హెచ్చరించింది జనసేన. అలా చెప్తే చంద్రబాబు బినామీ పవన్ కళ్యాణ్ అంటూ విమర్శలు చేస్తారా అని మండిపడ్డారు. టిడిపి అధికారంలో ఉన్నప్పుడు జనసేన పార్టీ టీడీపీని ప్రశ్నించినప్పుడు రోడ్లు పట్టుకుని మీ నాయకుడు తిరిగారు, నేను మిమ్మల్ని హెచ్చరించినప్పుడు మీ నాయకుడు మొహం చాటేశారు. ఇలా సమస్యలను ఎదుర్కోలేక తప్పించుకు తిరిగే మీ నాయకుడు ఎవరి బినామీ అంటూ ప్రశ్నించారు రాపాక వరప్రసాద్.

రాజధానిపై మీ నాయకుడిని స్పష్టత ఇవ్వమని చెప్పండన్న రాపాక వరప్రసాద్

రాజధానిపై మీ నాయకుడిని స్పష్టత ఇవ్వమని చెప్పండన్న రాపాక వరప్రసాద్

బొత్సా గారు మీరు పనికిమాలిన మాటలు మాట్లాడటం ఆపి ముందు రాజధానిపై మీ నాయకుడిని స్పష్టత ఇవ్వమని చెప్పండి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చూపించిన మీ నాయకుల చేతగానితనాన్ని కనీసం అధికారపక్షంలో కూర్చున్నాక అయినా మార్చుకోమని సూచించండంటూ ఎద్దేవా చేసారు. అసెంబ్లీ వేదికగా వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని దేవుడుతో సమానంగా పొగిడిన రాపాక వరప్రసాద్ ఇప్పుడు జనసేన పవన్ కళ్యాణ్ పై వైసిపి నేతలు చేస్తున్న మాటల దాడితో వైసిపి నేతలనే కాకుండా, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై సైతం విమర్శల వర్షం కురిపిస్తున్నారు.

English summary
Responding to Botsa's latest comments, Jana Sena MLA Rapaaka Varaprasad has advised Janasena on behalf of the farmers in the capital to see the injustice of the farmers. If Janasena's suggestions, botsa make a comment on pawan kalyan is the political benami of chandrababu . rapaka varaprasad made strong counter to minister Botsa
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X