వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జనసేన ఎమ్మెల్యే మరోసారి సభలోనే: సీఎం జగన్ పై ప్రశంసలు: చారిత్రాత్మక నిర్ణయమంటూ..!

|
Google Oneindia TeluguNews

జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మరోసారి ముఖ్యమంత్రి జగన్ పైన ప్రశంసలు కురిపించారు. ఇదే సభలో ఏపీ ప్రభుత్వం ఇంగ్లీషు మీడియం స్కూళ్లు ప్రవేశ పెట్టే నిర్ణయాన్ని స్వాగతించారు. ఆ వెంటనే తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడలో నిర్వహించిన సౌభాగ్య రైతు దీక్ష పైన తొలుత తాను అసెంబ్లీ సమావేశాల కారణంగా హాజరు కావటం లేదని చెప్పిన రాపాక..ఆ వెంటనే పవన్ దీక్ష పైన తనకు సమాచారం లేదంటూ చేసిన వ్యాఖ్యలు కలకలానికి కారణమయ్యాయి. ఇక, ఇప్పుడు మరోసారి ఎస్సీ సంక్షేమం విషయంలో ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్ధించిన జనసేన ఎమ్మెల్యే..ముఖ్యమంత్రి జగన్ పైన ప్రశంసలు కురిపించారు.

జనసేనపై కుట్రలు మానుకోండి: రాపాక విషయంపై పవన్ కళ్యాణ్ హెచ్చరికజనసేనపై కుట్రలు మానుకోండి: రాపాక విషయంపై పవన్ కళ్యాణ్ హెచ్చరిక

జగన్ పై జనసేన ఎమ్మెల్యే ప్రశంసలు
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నిర్ణయం చారిత్రాత్మకం అని జనసేన పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ అన్నారు. ఆయన శాసనసభలో మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరు కమిషన్లను స్వాగతిస్తు న్నామన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ నిర్ణయంతో దళితులు అభివృద్ధి చెందుతారన్నారు. సీఎం జగన్‌ నిర్ణయాన్ని పూర్తిగా సమర్థిస్తున్నామని తెలిపారు. గతంలో ఎస్సీ, ఎస్టీలపై జరిగిన దాడులు చాలా దారుణ మన్నారు. కొన్ని ప్రాంతాల్లో కుల వివక్షత తీవ్రంగా ఉందన్నారు. వెనుకబడిన వర్గాలకు సమాజంలో సమాన స్థానం కల్పించాలనే ఆలోచనతో ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుందన్నారు. దళితులను సామాజికంగా.. ఆర్థికంగా బాగుపర్చాలని వరప్రసాద్‌ కోరారు.

Janasena Mla Rapaka Vara Prasad once again appreciated CM Jagan on SC, st welfare

ఇంగ్లీషు మీడియం స్కూళ్ల పైనా..
ఏపీ ప్రభుత్వం ఏపీలో ప్రవేశపెట్టటం పైన సభలో చర్చ జరిగింది. ఆ నిర్ణయాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాన్ వ్యతిరేకించారు. ఆ తరువాత ఆయన సైతం తన నిర్ణయంలో సడలింపు ఇచ్చారు. అయితే దీని పైన సభలో మాట్లాడిన రాపాక వరప్రసాద్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాన్ని స్వాగతించారు. అదే సమయంలో చంద్రబాబు ప్రవేశ పెట్టాలనుకున్న ఇంగ్లీషు మీడియం స్కూళ్లను ముఖ్యమంత్రి జగన్ కొనసాగిస్తున్నారని..ఇది మంచి నిర్ణయమని ప్రశంసించారు. ఇక, పవన్ కళ్యాణ్ దీక్షకు సైతం గైర్హాజరైన వర ప్రసాద్..అంతకు ముందు సొంత జిల్లాలో మంత్రి విశ్వరూప్ తో కలిసి ముఖ్యమంత్రి జగన్ కు పాలాభిషేకం చేసారు. ఆయన పార్టీలో కొనసాగటం పైన సోషల్ మీడియాలో జరిగిన ప్రచారం పైన రాపాక కీలక వ్యాఖ్యలు చేసారు. పవన్ సైతం రాపాక పైన వైసీపీ అనుకూలురు ప్రచారం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. అయితే, ఈ రోజు సైతం సభలో రాపాక మరోసారి ముఖ్యమంత్రి పైన ప్రశంసలు కురిపించటం మరోసారి చర్చకు కారణమైంది.

English summary
Janasena Mla Rapaka Vara Prasad once again appreciated CM Jagan on SC, st welfare. Peviously Rapaka differ with Pawan decision on English medium schools.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X