వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప‌వ‌న్‌కు సొంత ఎమ్మెల్యే షాక్‌: జ‌గ‌న్ మాట త‌ప్ప‌రు..మ‌డ‌మ తిప్ప‌రు..కానీ : శాస‌న‌సభా సాక్షిగా..!

|
Google Oneindia TeluguNews

Recommended Video

శాస‌న‌సభా సాక్షిగా ప‌వ‌న్‌కు సొంత ఎమ్మెల్యే షాక్‌..!! || Oneindia Telugu

ఏపీ శాస‌న‌స‌భ‌లో మ‌రో ఆస‌క్తి క‌ర ప‌రిణామం చోటు చేసుకుంది. జ‌న‌సేన నుండి గెలిచిన ఒకే ఒక్క ఎమ్మెల్యే శాస‌న స‌భా వేదిక‌గా షాక్ ఇచ్చారు. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌ను ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తారు. అదే స‌మ‌యంలో బీజేపీ మీ మిత్ర‌ప‌క్షం అంటూ వైసీపీని ఉద్దేశించి జ‌న‌సేన ఎమ్మెల్యే రాపాక వ‌ర ప్ర‌సాద్ వ్యాఖ్యానించారు. దీని పైన వైసీపీ అభ్యంత‌రం వ్య‌క్తం చేసింది. జ‌గ‌న్ ప‌ధ‌కాల‌ను వ‌రుస‌గా ప్ర‌స్తావించారు. వీటిని అమ‌లు చేయాల‌ని అభ్య‌ర్దించారు.

సీఎంకు జన‌సేన ఎమ్మెల్యే ప్ర‌శంస‌లు..

సీఎంకు జన‌సేన ఎమ్మెల్యే ప్ర‌శంస‌లు..

శాస‌న‌స‌భా వేదిక‌గా జ‌న‌సేన ఎమ్మెల్యే ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ పైన ప్ర‌శంస‌లు కురిపించారు. గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగానికి ధ‌న్య‌వాదాలు తెలిపే తీర్మానం పైన చ‌ర్చ‌లో ఆయ‌న పాల్గొన్నారు. అదే స‌మ‌యంలో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మాట త‌ప్ప‌రు..మ‌డ‌మ తిప్పరు అంటూ కీర్తించారు. జ‌గ‌న్ ప్ర‌కటించిన ప‌ధ‌కాల‌ను ప్ర‌శంసించారు. అమ్మ ఒడి ప‌ధ‌కం మంది కార్య‌క్ర‌మ‌మ‌ని అభినందించారు. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లు మూత‌ప‌డ‌కుండా చూడాల‌ని ఆయ‌న ప్ర‌భుత్వానికి సూచ‌న చేసారు. అదే విధంగా మంత్రివ‌ర్గంలో ఎస్సీ-ఎస్టీ, బ‌లహీన వ‌ర్గాల‌కు ప్రాధాన్య‌త ఇవ్వ‌టం మంచి ప‌రిణామం అని చెప్పుకొచ్చారు. ఎస్సీ వ‌ర్గానికి చెందిన మ‌హిళ‌కు హోం మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌టం గొప్ప విష‌యంగా రాపాక వ‌ర ప్ర‌సాద్ శాస‌న‌స‌భ‌లో అభినందించారు. ఎస్సీల‌పైన జ‌రుగుతున్న దాడుల‌ను అరిక‌ట్టాల‌ని ఆయ‌న ప్ర‌భుత్వాన్ని కోరారు.

బీజేపీ మిత్ర‌ప‌క్షం అంటూ..

బీజేపీ మిత్ర‌ప‌క్షం అంటూ..

ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌ను అభినందించిన జ‌న‌సేన ఎమ్మెల్యే రాపాక వ‌ర ప్ర‌సాద్ త‌న ప్ర‌సంగంలో చేసిన వ్యాఖ్య‌ల పైన వైసీపీ నేత‌లు స్పందించారు. మీ మిత్ర‌ప‌క్షం బీజేపీని ఒప్పించి ప్ర‌త్యేక హోదా సాధించాల‌ని ఆయ‌న సూచించారు.
దీనికి అధికార పార్టీ అభ్యంత‌రం వ్య‌క్తం చేసింది. ప్ర‌భుత్వ చీఫ్ విప్ జ‌న‌సేన ఎమ్మెల్యే వ్యాఖ్య‌ల‌ను ఖండించారు. వైసీపీ ఏనాడు బీజేపీతో క‌లిసి పోటీ చేయ‌లేద‌ని..పొత్తు కూడా పెట్టుకోలేద‌ని చెప్పుకొచ్చారు. జ‌న‌సేన ఎమ్మెల్యే ఏది ప‌డితే అది మాట్లాడితే కుద‌ర‌ద‌ని స్ప‌ష్టం చేసారు. టీడీపీతో జ‌న‌సేన అంత‌ర్గ‌త పొత్తు ఉంద‌నే విష‌యం అంద‌రికీ తెలుస‌న్నారు. కేంద్రంతో గొడ‌వ ప‌డే ప‌రిస్థితి లేద‌ని.. స‌ఖ్య‌త‌గా ఉంటూ హోదా సాధ‌న కోసం కృషి చేస్తామ‌ని చీఫ్ విప్ శ్రీకాంత రెడ్డి తేల్చి చెప్పారు. ఆ తరువాత జ‌న‌సేన ఎమ్మెల్యే ఇక స్పందించ‌లేదు.

ప‌వ‌న్‌కు షాకింగేనా..ఎమ్మెల్యే రూటు మారుతున్నారా..

ప‌వ‌న్‌కు షాకింగేనా..ఎమ్మెల్యే రూటు మారుతున్నారా..

జ‌న‌సేన నుండి గెలిచిన రాపాక వ‌రప్ర‌సాద్ నాలుగు రోజుల క్రితం ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌తోనూ క‌లిసారు. ఇక‌, ఇప్పుడు స‌భ‌లో ఏకంగా ముఖ్య‌మంత్రిని అంద‌రి స‌మ‌క్షంలో అభినంద‌న‌ల‌తో మంచెత్తారు. గ‌తంలో తాను జ‌న‌సేన‌లోనే ఉంటాన‌ని..తాను జ‌న‌సేన‌లో ఉంటే తాను ఫ‌స్ట్ అని..అదే వైసీపీలోకి వెళ్తే 152 నెంబ‌ర్ అని వ్యాఖ్యానించారు. అయితే జ‌న‌సేన ఎమ్మెల్యే స‌భ‌లో మాట్లాడుతూ త‌న పైన సానుభూతి చూపించాల‌ని వ్యాఖ్యానించ‌టం..పార్టీ వాయిస్ బ‌లంగా వినిపించ‌లేక పోయార‌నే అభిప్రాయం వ్య‌క్తం అవుతోంది. దీని పైన జ‌నసేన ఎలా స్పందిస్తుందో చూడాలి. అసెంబ్లీలో మాత్రం ఈ వ్య‌వ‌హారం హాట్ టాపిక్‌గా మారింది.

English summary
Janasena MLA Rapaka Vara Prasad praise Cm Jagan on floor in AP Assembly. He said jagan taking good decisions in his administration and in his cabinet equations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X