వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వీడియో: రాత్రివేళ..జనసేన ఎమ్మెల్యే ఆందోళన: పోలీస్ స్టేషన్ ముట్టడి: ఉద్రిక్తత

|
Google Oneindia TeluguNews

Recommended Video

Janasena Mla Rapaka Varaprasad Protest In Front Of Police Station At Malikipuram

కాకినాడ: తూర్పు గోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గానికి చెందిన జనసేన పార్టీ శాసన సభ్యుడు రాపాక వరప్రసాద్ ఆదివారం రాత్రి ఆందోళనకు దిగారు. తన నియోజకవర్గం పరిధిలోని మలికిపురం పోలీస్ స్టేషన్ ను ముట్టడించారు. తన అనుచరులు, పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులతో కలిసి పోలీస్ స్టేషన్ వద్ద బైఠాయించారు. ధర్నాకు దిగారు. నిరసన వ్యక్తం చేశారు. మలికిపురం ఎస్సై ఇన్స్ పెక్టర్ కేవీ రామారావును వెంటనే సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాత్రివేళ మెరుపుదాడికి చేయడానికి ప్రధాన కారణం- సీఐ కేవీ రామారావు ఎమ్మెల్యేను దుర్భాషలాడటమేనని చెబుతున్నారు.

ఒక కేసు విష‌యంలో రాపాక వరప్రసాద్ మలికిపురం ఎస్సై రామారావుకు ఫోన్ చేయగా.. ఆయన స్పందించలేదని, నిర్లక్ష్యంతో సమాధానం ఇచ్చారనేది ఆరోపణ. ఏకవచనంతో సంబోధిస్తూ, కఠిన పదజాలంతో ఎమ్మెల్యేను దూషించారని ఆయన అనుచరులు చెబుతున్నారు. దీనితో ఆగ్రహించిన రాపాక.. ఎనిమిది గంటల సమయంలో తన అనుచరులతో కలిసి మలికిపురం పోలీస్ స్టేషన్ ను ముట్టడించారు. ఆ సమయంలో పలువురు జనసేన పార్టీ కార్యకర్తలు ఆయన వెంట ఉన్నారు. దుర్భాషలు ఆడారనే ఆరోపణలను ఎదుర్కొంటున్న రామారావు ఆ సమయంలో స్టేషన్ లో లేరు. సీఐ ఎక్కడికెళ్లారని, వెంటనే స్టేషన్ కు రావాలని ఆయన పట్టుబట్టారు.

స్టేషన్ సిబ్బంది ఎస్సైకి ఫోన్ చేయగా.. స్విచాఫ్ లో ఉన్నట్లు వెల్లడించారు. దీనితో ఆగ్రహించిన రాపాక.. తన అనుచరులతో కలిసి అక్కడే బైఠాయించారు. రామారావుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎమ్మెల్యే పోలీస్ స్టేషన్ ను ముట్టడించారనే సమాచారం నియోజకవర్గంలో దావానలంలా వ్యాపించింది. జనసేన పార్టీ కార్యకర్తలు బైక్ లు, ఇతర వాహనాల ద్వారా పెద్ద సంఖ్యలో పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. దీనితో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అకారణంగా తమ నాయకుడిని దూషించిన రామారావును సస్పెండ్ చేయాలంటూ జనసేన కార్యకర్తలు పోలీసు అధికారులను డిమాండ్ చేశారు. రామారావుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Janasena MLA Rapaka Varaprasad Protest in front of Police Station at Malikipuram in East Godavari

ఆయనను సస్పెండ్ చేసేంత వరకూ తాము అక్కడి నుంచి కదిలేది లేదని కార్యకర్తలు, రాపాక అనుచరులు పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించారు. ఫలితంగా పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఈ సమాచారం తెలుసుకున్న వెంటనే జిల్లా ఎస్పీ జోక్యం చేసుకున్నారు. రాపాకకు ఫోన్ చేశారు. ఈ ఘటనకు దారి తీసిన కారణాలను అడిగి తెలుసుకున్నారు. తాను ధర్నాకు దిగడానికి ఏర్పడిన పరిస్థితులను ఆయన ఎస్పీకి వివరించారు. దీనిపై తాను స్వయంగా విచారిస్తానని, ఆందోళనను ఉపసంహరించుకోవాలని కోరారు. అయినప్పటికీ- రాపాక, ఆయన అనుచరులు శాంతించలేదు. అప్పటికప్పుడు ఎస్సైని సస్పెండ్ చేయాల్సిందేనని పట్టుబట్టారు.

English summary
Jana Sena Party law maker Rapaka Varaprasad representated from Razole Assembly constituency in East Godavari District of Andhra Pradesh was sat on Protest in front of the Police Station on Sunday. He sat dharna against SI KV Rama Rao, Jana Sena Party supporters and Workers also participate in this agitation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X