వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాట తప్పడం-మడమ తిప్పడం జగన్ రెడ్డి నైజం .. విరుచుకుపడిన జనసేన

|
Google Oneindia TeluguNews

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పై జనసేన పార్టీ నిప్పులు చెరిగింది. నాడు చంద్రబాబు హయాంలో అన్నిటి రేట్లు పెరిగాయని మళ్ళీ చంద్రబాబుకు ఓటేస్తే ఆర్టీసీ , కరెంట్ ను కూడా వదలకుండా ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తారని ఈ ఐదేళ్ళలో కరెంట్ ,ఆర్టీసీ చార్జీలు బాదుడే బాదుడు అని సోషల్ మీడియాలో చెలరేగిన సీఎం జగన్ ఇప్పుడు మాట మార్చి మడమ తిప్పారని మండి పడ్డారు. మాట తప్పడం-మడమ తిప్పడం జగన్ రెడ్డి నైజం అంటూ ట్విట్టర్ లో చేసిన పోస్ట్ లో జనసేన పార్టీ విరుచుకుపడింది.

నాడు ఆంధ్రప్రదేశ్‌లో జగన్ వ్యవహరించిన తీరు, నేడు వ్యవహరిస్తోన్న తీరును గుర్తు చేస్తూ తమ అధికారిక ట్విట్టర్‌ ఖాతాలో ఓ పోస్టు చేసింది. నాడు రేట్లు పెరిగాయని జగన్ బాధ నటించాడని జనసేన పేర్కొంది. నేడు ప్రజలపై స్వయంగా సీఎం జగన్ విపరీతమైన భారం వేశాడని వివరిస్తూ పలు అంశాలను ప్రస్తావించింది.

Janasena outraged on Jagan mohan reddy about rates hike

మళ్లీ చంద్రబాబు నాయుడికి ఓటు వేస్తే విద్యుత్తు, ఆర్టీసీ టిక్కెట్లు, పెట్రోల్ ధరలు, ఇంటి పన్నులు పెంచేస్తాడు అని ఎన్నికల ముందు జగన్ చెప్పిన మాటలను ,నాటి పోస్ట్ లను రీ పోస్ట్ చేసిన జనసేన తాజాగా ఏపీలో విపరీతంగా పెంచిన ధరల చిట్టాను పేర్కొంది. ఇప్పుడు జగన్ పెంచేసిన ధరలను ప్రస్తావిస్తూ విమర్శలు చేసిన జనసేన పెట్రోపై వ్యాట్ పెరిగిన న్యూస్‌ను ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ఏపీలో ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో మండిపోతున్న ధరలపై ప్రతిపక్ష పార్టీల నుండి ఆగ్రహం వ్యక్తం అవుతుంది.

English summary
Jana Sena party fire on AP CM Jagan Mohan Reddy On the rise of all the rates. When tdp regime jagan alleged on chandrababu to give it to the private companies without leaving the RTC and the current charges in the state. Janasena posted a Twitter post saying that Jagan Reddy is not good enough.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X