వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్ అభిమాని అత్యుత్సాహం: విరాళంగా రూ.200 కోట్లు..జనసేన బ్యాంక్‌ అకౌంట్ వైరల్

|
Google Oneindia TeluguNews

విజయవాడ: ఏపీ రాజకీయాలు వేడెక్కుతున్న నేపథ్యంలో అధికార పక్షంపై ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ పలు అంశాలపై నిప్పులు చెరుగుతోంది. వార్తల్లో నిలుస్తోంది. అయితే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మాత్రం ట్విటర్‌కే పరిమితమవుతూ పలు విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే చంద్రబాబు లోకేష్‌లు ఏపీలో పర్యటించగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మాత్రం ట్విటర్‌ ద్వారానే ట్వీట్లు సంధిస్తుండటం జనసైనికులకే రుచించడం లేదు. తమ నాయకుడు ఏపీలో తిరిగి ఎప్పుడు అడుగు పెడతారా అని ఎదురుచూస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం సినిమాల పేరుతో హైదరాబాదుకే పరిమితమయ్యారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇదిలా పక్కన ఉంచితే ఒక జనసైనికుడు అత్యుత్సాహంతో చేసిన ఓ ట్వీట్ వైరల్‌గా మారుతోంది. ఇంతకీ ఆ జన సైనికుడు చేసిన ట్వీట్ ఏంటి..?

మళ్ళీ లాక్ డౌన్ చేస్తే ప్రభుత్వాలు చారిత్రక తప్పిదం చేసినట్టే : జనసేన నేత నాగబాబుమళ్ళీ లాక్ డౌన్ చేస్తే ప్రభుత్వాలు చారిత్రక తప్పిదం చేసినట్టే : జనసేన నేత నాగబాబు

 రూ.200 కోట్లు పార్టీకి విరాళంగా సేకరించాలి

రూ.200 కోట్లు పార్టీకి విరాళంగా సేకరించాలి

జనసేన పార్టీకి విరాళాలు సేకరించాలన్న ఆలోచనతో ఓ జనసేన కార్యకర్త పవన్ కళ్యాణ్ అభిమాని ఓ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. ప్రతి జనసేన కార్యకర్త, అభిమాని రూ. 100 పార్టీకి విరాళంగా ఇవ్వాలని ట్వీట్ చేశారు. అంతేకాదు పవన్ కళ్యాణ్ బర్త్‌డే సందర్భంగా 2 కోట్లు ట్వీట్లు చేస్తూనే రూ.100 పార్టీకోసం విరాళంగా ఇవ్వాలంటూ ఆ అభిమాని అత్యుత్సాహం ప్రదర్శించాడు. తద్వారా రూ.200 కోట్లు పార్టీకి విరాళంగా సేకరించాలని పిలుపునిచ్చారంటూ ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ప్రచురించిన కథనం వైరల్‌గా మారింది. ట్వీట్ చేసిన జనసైనికుడిని జనసేన పార్టీ అధిష్టానం గుర్తించింది. అప్పటికే ఈ ట్వీట్ వైరల్ అయ్యింది. ఒక్క ట్విటర్ పైనే కాదు ఇతర సోషల్ మీడియా సైట్స్ అంటే వాట్సాప్‌లలో కూడా ఈ మెసేజ్ సర్క్యులేట్ అయ్యింది. ఈ మెసేజ్‌లో జనసేన పార్టీ బ్యాంకు ఖాతాతో పాటు ఐఎఫ్ఎస్‌సీ కోడ్ కూడా ఇవ్వడం జరిగింది.

 ఖండించిన జనసేన పార్టీ వర్గాలు

ఖండించిన జనసేన పార్టీ వర్గాలు

ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ మెసేజ్‌ను ఖండించింది జనసేన పార్టీ ఉన్నత వర్గాలు. జనసేన పార్టీ అభిమానుల నుంచి డబ్బులు సేకరించడాన్ని వ్యతిరేకిస్తుందని పేర్కొంది. అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న మెసేజ్‌తో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని చెప్పిన జనసేన... సర్క్యులేట్ అవుతున్న బ్యాంక్ అకౌంట్‌లో డబ్బులు డిపాజిట్ చేయొద్దంటూ అధికారికంగా అభిమానులకు పార్టీ హైకమాండ్ చెప్పలేదు. ఇదిలా ఉంటే మెసేజ్‌లో ఉన్న బ్యాంకు అకౌంట్ నెంబరు జనసేనదే అని మాత్రం పార్టీ ధృవీకరించింది.

 ఖండించిన జనసేన పార్టీ వర్గాలు

ఖండించిన జనసేన పార్టీ వర్గాలు

ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ మెసేజ్‌ను ఖండించింది జనసేన పార్టీ ఉన్నత వర్గాలు. జనసేన పార్టీ అభిమానుల నుంచి డబ్బులు సేకరించడాన్ని వ్యతిరేకిస్తుందని పేర్కొంది. అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న మెసేజ్‌తో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని చెప్పిన జనసేన... సర్క్యులేట్ అవుతున్న బ్యాంక్ అకౌంట్‌లో డబ్బులు డిపాజిట్ చేయొద్దంటూ అధికారికంగా అభిమానులకు పార్టీ హైకమాండ్ చెప్పలేదు. ఇదిలా ఉంటే మెసేజ్‌లో ఉన్న బ్యాంకు అకౌంట్ నెంబరు జనసేనదే అని మాత్రం పార్టీ ధృవీకరించింది.

Recommended Video

Pawan Kalyan Fans Break Jr NTR’s Birthday Trend | #AdvanceHBDPawanKalyan
 పవన్ బర్త్‌డే నాటికి నిధులు సమీకరించాలనే టార్గెట్

పవన్ బర్త్‌డే నాటికి నిధులు సమీకరించాలనే టార్గెట్

ఇక పవన్ కళ్యాణ్ అభిమానులు సెప్టెంబర్ 2న తమ అధినేత పుట్టినరోజు ఉండటంతో అప్పటికల్లా అడ్వాన్స్‌ హ్యాపీబర్త్‌డే విషెస్‌తో ట్విటర్‌లో సరికొత్త రికార్డు సృష్టించాలని జనసైనికులు భావించి ఇప్పటికే ఆ టాస్క్‌ను పూర్తిచేశారు. ఇక జనసైనికులు ఆన్ ‌లైన్ ట్రాన్స్‌ఫర్స్ చేయడం నేర్చుకోవాలంటూ ఒక అభిమాని చెప్పారు. సెప్టెంబర్ 2 నాటికల్లా పెద్ద ఎత్తున పార్టీకి నిధులు సమీకరించాలని ఆ అభిమాని చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే 2019లో కొందరు వ్యక్తులు తమ పేర్లతో బ్యాంకు ఖాతాలను తెరిచి నిజమైన పవన్ అభిమానుల నుంచి డబ్బులు వసూలు చేశారని పార్టీ వర్గాలు గుర్తు చేశాయి. ఈ విషయం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి రావడంతో అభిమానుల నుంచి విరాళాలు సేకరించరాదని హుకూం జారీ చేశారు.

English summary
An over enthusiastic Jana Sena worker has come up with a fancy idea of raising Rs. 200 crore as party fund.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X