అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేబినెట్ తర్వాతే...రాజధానిపై ఫైనల్ డెసిషన్... పవన్ కళ్యాన్

|
Google Oneindia TeluguNews

ఏపీ రాజధాని నిర్మాణం, రాష్ట్ర సమగ్ర అభివృద్దిపై జీఎన్ రావు ఇచ్చిన కమిటీ నివేదికపై రాష్ట్ర ప్రభుత్వం నుండి స్పష్టత తర్వాతే... పార్టీ నిర్ణయాన్ని వెల్లడిస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. రాజధాని నిర్మాణంపై ప్రభుత్వం క్యాబినెట్ చర్చించి నిర్ణయాన్ని ప్రకటించిన తర్వాతే పార్టీపరంగా చేపట్టాల్సిన కార్యాచరణను ప్రకటిస్తామని చెప్పారు. కాగా జీఎఎన్ రావు కమిటీ నివేదికపై చర్చించేందుకు ఈనెల 27న భేటి కానున్నట్టు ప్రకటించారు.

ఏపీ రాజధాని అమరావతి మార్పుపై కేంద్రం జోక్యం చేసుకుంటుందా ? భిన్నవాదనలుఏపీ రాజధాని అమరావతి మార్పుపై కేంద్రం జోక్యం చేసుకుంటుందా ? భిన్నవాదనలు

ప్రభుత్వ నిర్ణయం తర్వాతే జనసేన స్పందన

ప్రభుత్వ నిర్ణయం తర్వాతే జనసేన స్పందన

ఏపీ రాజధాని నిర్మాణం ,రాష్ట్ర అభివృద్దిపై బీఎన్ రావు కమిటీ ఇచ్చిన నివేదిక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి స్పందించారు. ఇప్పటికే రాజధాని నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న పవన్ కళ్యాన్ పూర్తిస్థాయి కార్యచరణతోపాటు తమ పార్టీ నిర్ణయాన్ని ప్రజలముందు పెడతామని చెప్పారు. కాగా బీఎన్ రావు కమిటీ ఇచ్చిన నివేదికపై ప్రజల్లో గందరగోళం నెలకొందని ఆయన చెప్పారు.ఇది రాష్ట్రానికి శ్రేయస్కారం కాదని హితవు పలికారు.

సమగ్ర అభివృద్దినే పార్టీ కోరుకుంటుంది

సమగ్ర అభివృద్దినే పార్టీ కోరుకుంటుంది

ఈనేపథ్యంలోనే కమిటీ నివేదికపై ప్రభుత్వం క్యాబినెట్‌లో చర్చిస్తామని ప్రకటించిందని, అనంతరమే రాజధాని నిర్మాణంపై పార్టీ చర్చించి నిర్ణయాన్ని వెలువరుస్తామని స్పష్టం చేశారు. ఇక అభివృద్ది అంటే సంపద సృష్టించే వనరులను ఏర్పాటు చేయడం ,అనంతరం ఉద్యోగ ,ఉపాధి, మరియు వ్యాపార అవకాశాలను పెంపోందించే విధంగా ఉండాలని జనసేన భావిస్తుందని చెప్పారు. అంతేకాని అభివృద్ది అంటే భవనాలు కట్టడం ,ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించడం కాదని భావిస్తుందని వివరించారు. భవనాలు కాకుండా ప్రజల జీవన ప్రమాణాలు పెంపోందించే అభివృద్దిని జనసేన కోరుకుంటుందని అన్నారు. మరోవైపు వెనకబడిన ప్రాంతాల అభివృద్దిని, అందుకు రాజకీయ పార్టీల జవాబుదారితనాన్ని కూడ పార్టీ కొరుకుంటుందని స్పష్టం చేశారు.

అమరావతిలో పర్యటించిన పార్టీ కమిటీ

అమరావతిలో పర్యటించిన పార్టీ కమిటీ

కాగా రాజధాని ఏర్పాటు సీఎం జగన్ చేసిన ప్రకటనను వ్యతిరేకిస్తున్న పవన్ కళ్యాన్ ...అమరావతిలో జరగుతున్న రైతుల ఆందోళనకు పూర్తి మద్దతు ఇచ్చారు. దీంతో పాటు రాజధాని ప్రాంత రైతులు, స్థానిక ప్రజల అందోళనలు తెలుసుకునేందుకు పార్టీ సీనియర్ నేత నాదేండ్ల మనోహర్ అధ్వర్యంలో పార్టీ రాజకీయ వ్యవహార బృందం పర్యటించింది. కాగా ఈ బృందం పర్యటించిన అంశాలతో పాటు ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై స్పష్టత వచ్చిన తర్వాతే పూర్తిస్థాయిలో స్పందించేందుకు జనసేన నిర్ణయించింది.

English summary
ofter state government decision cleared on the AP capital construction Janasena party activity would be made cleared said, Janasena chief PawanKalyan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X