వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జనసేన విలీనం కోసం పవన్‌ను అంత వేధిస్తున్నారా.. ఆ పెద్ద పార్టీకి ఎందుoకు ఇంత కక్కుర్తి..?

|
Google Oneindia TeluguNews

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ మధ్యకాలంలో ఏ సమావేశం నిర్వహించినా అక్కడ కచ్చితంగా విలీనం ప్రస్తావన తెస్తున్నారు. పార్టీని విలీనం చేయాలని ఒక పెద్ద పార్టీ తనను పదేపదే ఇబ్బందులకు గురి చేస్తుందంటూ ఆయన ఆరోపణలు గుప్పిస్తున్నారు. తన పార్టీని ఏ పార్టీలో విలీనం చేసేది లేదంటూ తేల్చి చెబుతున్నారు. నా పక్కన ఒక్కడున్నా చాలు పార్టీ నడిపిస్తానంటూ చెప్పుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్, జనసేన ఆఫీసులు కట్టడానికి తన దగ్గర ఆర్థిక వనరులు లేకపోతే టెంట్ వేసి అయినా పార్టీ నడిపిస్తానని చెప్పిన పవన్ తాను పార్టీ పెట్టింది వేరే పార్టీలో కలపడానికి కాదంటూ పదేపదే పేర్కొంటున్నారు. ఎందుకు పవన్ పదేపదే విలీనంపై మాట్లాడుతున్నారు అంటే ..

<strong>రివర్స్ టెండరింగ్ మానుకోవాలని సూచన .. జగన్ సర్కార్ కు పీపీఏ సిఈవో జైన్ లేఖ</strong>రివర్స్ టెండరింగ్ మానుకోవాలని సూచన .. జగన్ సర్కార్ కు పీపీఏ సిఈవో జైన్ లేఖ

పవన్ పార్టీని విలీనం చెయ్యాలని కోరుతున్న బీజేపీ .. లేదని తేల్చేసిన జనసేనాని

పవన్ పార్టీని విలీనం చెయ్యాలని కోరుతున్న బీజేపీ .. లేదని తేల్చేసిన జనసేనాని

ఇటీవల జనసేన పార్టీ ఆఫీస్ లో కీలక నేతలతో పార్టీ విలీనం వ్యవహారం గురించి పవన్ కళ్యాణ్ చర్చించినట్లుగా ప్రచారం జరిగింది. ఓ జాతీయ పార్టీ జనసేన పార్టీని తమ పార్టీలో విలీనం చేయాలని కోరినట్లుగా పవన్ పార్టీ ముఖ్యులతో చెప్పినట్లు తెలుస్తోంది.ఇంతకీ పవన్ అంతగా ఇబ్బంది పెడుతున్న ఆ జాతీయ పార్టీ ఏది అంటే ఎవరైనా టక్కున చెప్పే సమాధానం బిజెపి. ఎందుకంటే పవన్ అమెరికా వెళ్లినప్పుడు , అక్కడ బిజెపి నాయకుడు రాంమాధవ్ తో భేటీ జరిగింది. అదే సమయంలో రామ్ మాధవ్ పవన్ పార్టీని తమ పార్టీలో విలీనం చేస్తే బాగుంటుందని కోరినట్లుగా తెలుస్తోంది. ఇక ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కూడా పార్టీ ముఖ్యుల దగ్గర ఈ ప్రస్తావన తెచ్చి, వారి అభిప్రాయాలను తీసుకున్నారు. ఆ తరువాత తమ పార్టీని ఏ పార్టీలో విలీనం చేయనని, కచ్చితంగా పార్టీని నడిపించి తీరుతానని పవన్ కళ్యాణ్ పదే పదే ప్రకటిస్తున్నారు.

పదేపదే వేదికల మీద బహిరంగ వ్యాఖ్యలు చేస్తున్న పవన్ ..... రీజన్ ఇదే

పదేపదే వేదికల మీద బహిరంగ వ్యాఖ్యలు చేస్తున్న పవన్ ..... రీజన్ ఇదే

తాజాగా విజయవాడ పార్లమెంటు పరిధిలోని పార్టీ నేతలతో సమావేశమైన నేపథ్యంలోనూ పవన్ కళ్యాణ్ తమ పార్టీని విలీనం చేయాలంటూ ఒక పెద్ద పార్టీ ఒత్తిడి తెస్తుందని వెల్లడించారు. అదే సమయంలో.. తన పార్టీని ఎట్టి పరిస్థితుల్లోనూ వేరే పార్టీలో విలీనం చేసే ప్రసక్తే లేదని మరోమారు తేల్చి చెప్పారు. తాను సత్యం కోసం పని చేసేవాడినని చెప్పిన ఆయన.. తన బలం ఏమిటో, బలహీనత ఏమిటో తెలుసని చెప్పారు. పవన్ నోటి నుంచి విలీనం మాట అదే పనిగా ఎందుకు వస్తోంది? అన్నది ఇప్పుడు అందరికీ పెద్ద ప్రశ్నగా మారింది. పార్టీని విలీనం చేయమని అడిగితే చెయ్యాలి అనుకుంటే ఓకే.. కానీ నో అంటే ప్రపోజల్ తెచ్చిన వాళ్లకు, ప్రపోజల్ విన్న వారికి మధ్యనే ఉండాల్సిన వ్యవహారాన్ని బయట ఎందుకు పెడుతున్నట్లు? అన్నది పవన్ కళ్యాణ్ విషయంలో పెద్ద ప్రశ్న. దీనిపై పార్టీకి చెందిన కీలక నేతల అభిప్రాయం ఏమిటంటే పార్టీని విలీనం చేసేది లేదని స్పష్టం చేసినప్పటికీ.. ఏపీలో పాగా వేయాలని తెగ ఉవ్విళ్లూరుతున్న బిజెపి ఆయనపై అదే పనిగా ఒత్తిడి తెస్తుందన్న మాటను చెబుతున్నారు.మరి నిజంగానే బిజెపి ఒత్తిడి తెస్తుందా? లేక పవన్ కళ్యాణ్ తెస్తున్నట్టు ఫీల్ అవుతున్నారా ? అన్నది మాత్రం తెలీదు.

విలీనం చెయ్యనని తేల్చి చెప్పినా ఒత్తిడి తెచ్చే యత్నం .. అందుకే పవన్ బహిరంగ ప్రకటనలు

విలీనం చెయ్యనని తేల్చి చెప్పినా ఒత్తిడి తెచ్చే యత్నం .. అందుకే పవన్ బహిరంగ ప్రకటనలు

అందుకే జనసేనాని పవన్ కళ్యాణ్ పలుమార్లు తన పార్టీని విలీనం చేసేది లేదని చెప్పినా.. వివిధ పద్ధతుల్లో ఒత్తిళ్లు తీసుకురావటంతో.. ఈ విషయాన్ని బహిరంగంగా ప్రకటిస్తే తన మీద ఒత్తిడి తగ్గుతుందని భావిస్తున్నారని జనసైనికులు చెప్తున్నారు. తనకు పార్టీని విలీనం చేసే ఆలోచన లేదని చెప్పేందుకు బహిరంగ ప్రకటనతో తన మీద ఆశలు పెట్టుకున్న వారికి సరైన సంకేతాలు ఇవ్వొచ్చని భావించారని అందుకే అలా చెబుతున్నారని జనసైనికులలో అభిప్రాయం ఉంది. అయితే.. ఏపీలో బలోపేతం కావాలని భావిస్తున్న బీజేపీ పదేపదే పవన్ కళ్యాణ్ పార్టీని తమ పార్టీలో విలీనం చేసుకోవాలని ప్రయత్నాలు సాగుతుండటంతో అలాంటి ఆలోచన మానుకోవాలని, విలీనం ప్రసక్తే లేదని తేల్చి చెప్తున్నారు పవన్ కళ్యాణ్. అయితే పవన్ పై ఆశలు పెట్టుకున్న బిజెపి మాత్రం, ఇన్నిసార్లు పవన్ వేదికల మీద బహిరంగంగానే ఆ జాతీయ పార్టీపై విమర్శలు చేస్తుంటే ఇప్పటివరకు బిజెపి నోరు మెదిపిన దాఖలాలు లేవు. పవన్ కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలపై సమాధానం చెప్పిన పరిస్థితి లేదు.ఇక తాజా వ్యాఖ్యలతో అయినా ఏపీ స్పందిస్తుందా లేదా పవన్ పై ఒత్తిడి తీసుకురావడాన్ని విరమిస్తుందా అన్నది తెలియాల్సి ఉంది.

English summary
Janasena chief Pawan Kalyan has definitely mentioned the merger at any meeting held recently. He is accused by a large party of repeatedly bothering to merge the party. It is clear that pawan will not going to merge his party in any party .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X