వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ స్పందించకపోతే.... నిరహారదీక్ష చేస్తా.... తూ.గోలో పవన్ కళ్యాణ్

|
Google Oneindia TeluguNews

తూర్పుగోదావరి జిల్లాలో ధాన్యం రైతుల కష్టాలను తెలుసుకునేందుకు జనసేన పవన్ కళ్యాణ్ పర్యటన కొనాసాగుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ విధానాలపై ఆయన మరోసారి ఫైర్ అయ్యారు. రైతులు పడే కష్టాల గురించి పట్టించుకునే నాయకుడే లేడని ఆయన విమర్శించారు. ఓట్ల కోసం పాదయాత్రలు చేయడం కాదు, నిజమైన పాదయాత్రలు ఇప్పుడు చేయాలని ఆయన సూచించారు.

రైతులకు అండగా ఉంటాను

రైతులకు అండగా ఉంటాను

రైతులకు ఇప్పుడు అండగా నిలబడకపోతే ఇంకా ఎప్పుడు అండగా ఉంటారని ఆయన ప్రభుత్వ నేతలను ప్రశ్నించారు. వ్యవసాయాన్ని లాభాసాటిగా తీసుకువచ్చే ప్రయత్నాలకు ప్రభుత్వం పూనుకోవడం లేదని ఆయన విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలోనే రైతుల పోట్టగొట్టిన ఏ ప్రభుత్వమైనా.. కాలిపోయి కూలిపోవాల్సిందేనని హెచ్చరించారు. ఇక రైతులు కన్నీరుతో పండించిన పంటతో రక్తపు కూడును నేతలు తింటున్నారని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలోనే రైతులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

పవన్ దృష్టికి సమస్యలు తీసుకువెళ్లద్దు

పవన్ దృష్టికి సమస్యలు తీసుకువెళ్లద్దు

పవన్ కళ్యాణ్ పర్యటన జిల్లాలో కొనసాగుతున్న నేపథ్యంలోనే కొంతమంది ధాన్యం మిల్లర్లకు ఫోన్ చేసి అక్కడ ఉన్న సమస్యలను పవన్‌ కళ్యాణ్‌కు వివరించవద్దని చెప్పారని దుయ్యబట్టారు. సీఎం జగన్ తీరు రైతుల కష్టాలపై ఏరుదాటాక తెప్ప తగిలేసేలా తాయరైందని ఆయన అన్నారు. అధికారం కోసం పాదయాత్ర చేసిన జగన్ రైతుల కోసం ఇప్పుడు చేయాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు.

 నిరహార దీక్ష

నిరహార దీక్ష

కాగా రేపటి నుండి జరిగే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండడంతో...ఈ సంధర్భంగా అసెంబ్లీలో రైతు సమస్యలపై అసెంబ్లీలో చర్చించాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. వారి సమస్యలపై మూడు రోజుల్లో స్పందించకపోతే నిరాహార దీక్షకు దిగుతానని హెచ్చరించారు. ప్రభుత్వం దిగిరాకపోతే... 12న కాకినాడలో దీక్షకు కూర్చుంటానని స్పష్టం చేశారు. రైతుల సంక్షేమం కోసం సీఎం జగన్ నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చిందని ఆయన అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో వైసీపీ ల్యే రైతు సమస్యలపై చర్చించకపోతే... భవిష్యత్‌లో తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని పవన్ కళ్యాణ్ హెచ్చరికలు చేశారు.

వెలగతోడులో పవన్ పర్యటన

వెలగతోడులో పవన్ పర్యటన

తూర్పుగోదావరి జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెలగతోడులో రైతులతో ముఖాముఖి చర్చ చేపట్టారు. ఈ నేపథ్యంలోనే ఆయన రైతులను కష్టాలను నేరుగా విన్నారు. అంతకు ముందు ఉదయం మధుపూరి విమానాశ్రయానికి చేరుకుని అక్కడ నుండి లాలాచెరువు, మోరంపూడి, వేమగిరి గుండా వెలగతోడు చేరుకున్నారు. అనంతరం రైతులతో కలిసి సమావేశం అయ్యారు. అనంతరం రైతుల కష్టాలను విని తెలుసుకున్నారు. దీంతో పలువురు రైతులు తమ కష్టాలు పవన్‌కు వివరించారు. ఈ నేపథ్యంలోనే పలువురు రైతులు, పంట నష్టాలతో పాటు, ధాన్యం కొనుగోళ్లపై ఎదురయ్యో నష్టాలను ఆయన వివరించారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై పలువురు రైతులు ధ్వజమెత్తారు.

English summary
Janasena PawanKalyan visits the East Godavari district to knowing farmers issues. he once again fired on government policies
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X