వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గాజువాక నుండి ప‌వ‌న్ : 1 లోక్‌స‌భ‌..13 అసెంబ్లీ స్థానాల‌కు : జ‌న‌సేన జాబితా విడుద‌ల‌..!

|
Google Oneindia TeluguNews

ఎన్నిక‌ల్లో పోటీ చేసే అభ్య‌ర్దుల మ‌లి విడ‌త జాబితాను జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాన్ విడుద‌ల చేసారు. ఒంగోలు లోక్‌స‌భ తో పాటుగా 13 శాస‌న‌స‌భా స్థానాల‌కు అభ్య‌ర్దుల‌ను ఖ‌రారు చేసారు. గ‌తంలో విడుద‌ల చేసిన రెండో జాబితా లో ఒక సీటులో అభ్య‌ర్దిని మార్పు చేసారు.

విశాఖ నుండి భ‌ర‌త్‌: అసెంబ్లీ సిట్టింగ్ ల్లో మార్పులు : టిడిపి తుది జాబితా విడుద‌ల‌..! విశాఖ నుండి భ‌ర‌త్‌: అసెంబ్లీ సిట్టింగ్ ల్లో మార్పులు : టిడిపి తుది జాబితా విడుద‌ల‌..!

ఒంగోలు లోక్‌స‌భ‌..13 అసెంబ్లీ..

ఒంగోలు లోక్‌స‌భ‌..13 అసెంబ్లీ..

ఆంధ్రప్రదేశ్‌లోని మరో 13 శాసనసభ స్థానాలకు, మరో లోక్‌సభ స్థానానికి జనసేన నుంచి పోటీ చేసే అభ్యర్థుల జాబితాను పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ అర్ధరాత్రి ప్రకటించారు. ఆదివారం విడుదల చేసిన రెండో జాబితాలో ఒక అభ్యర్థి స్థానాన్ని మార్చారు. గిద్దలూరు స్థానం నుంచి ముందుగా ప్రకటించిన షేక్‌రియాజ్‌ తాజా మార్పులో భాగంగా ఒంగోలు శాసనసభ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. గిద్దలూరు స్థానం నుంచి బైరబోయిన చంద్రశేఖర్‌ యాదవ్‌ పోటీ చేస్తారని జనసేన ప్రకటించింది. చిత్తూరు జిల్లా పలమనేరు నుంచి పోలూరు శ్రీకాంత్‌నాయుడు పోటీ చేయను న్నారు. ఒంగోలు (లోక్‌సభ): బెల్లంకొండ సాయిబాబా పేరును ప్ర‌క‌టించారు. వైసిపి నేత‌గా ఉంటూ పాలకొల్లు సీటు ఆశంచి భంగ‌ప‌డిన గుణ్ణం నాగ‌బాబు జ‌న‌సేన లో చేరి పాలకొల్లు సీటు సాధించారు.

గాజువాక నుండి ప‌వ‌న్ క‌ళ్యాన్‌..

గాజువాక నుండి ప‌వ‌న్ క‌ళ్యాన్‌..

పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ విశాఖ జిల్లా గాజువాక నుంచి పోటీ చేసే అవకాశం ఉందని సమాచారం. ప‌వ‌న్ తొలుత తూర్పు గోదావ‌రి పిఠాపురం లేదా విశాఖ లోని భీమిలి నుండి పోటీ చేస్తార‌ని ప్ర‌చారం జ‌రిగింది. అయితే ,ఆయ‌న త‌న అభిమానుల కోరిక మేర‌కు గాజువాక్ నుండి పోటీ చేయాల‌ని భావిస్తున్నారు. ఇప్ప‌టికే వైసిపి..టిడిపి గాజువాక నుండి త‌మ అభ్య‌ర్దుల‌ను ఖ‌రారు చేసాయి. ఇక‌, ప‌వ‌న్ గాజువాక నుండి మాత్ర‌మే చేస్తారా..లేక రాయ‌ల‌సీమ నుండి మ‌రో స్థానం నుండీ పోటీ చేస్తారా అనేదీ ఈ రోజు స్ప‌ష్ట‌త రానుంది. అదే విధంగా జ‌న‌సేన లో చేరిన మాజీ జేడి ల‌క్ష్మీనారా య‌ణ పోటీ చేసే స్థానం పైనా ఈ రోజు అధికారికంగా ప్ర‌క‌ట‌న విడుద‌ల కానుంది. ఆయ‌న రాయ‌ల‌సీమ నుండి ఎంపీ గా బ‌రిలోకి దిగే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయి.

13మంది అసెంబ్లీ అభ్య‌ర్దులు...

13మంది అసెంబ్లీ అభ్య‌ర్దులు...

జ‌న‌సేన ప్ర‌క‌టించిన 13 మంది శాసనసభ అభ్యర్థులు.. టెక్కలి: కణితి కిరణ్‌కుమార్‌, పాలకొల్లు: గుణ్ణం నాగబాబు,
గుంటూరు తూర్పు: షేక్‌ జియాఉర్‌ రెహ్మాన్‌, రేప‌ల్లె: కమతం సాంబశివరావు, చిలకలూరిపేట: మిరియాల రత్నకుమారి
మాచర్ల: కె.రమాదేవి, బాపట్ల: పులుగు మధుసూదన్‌రెడ్డి, ఒంగోలు: షేక్‌ రియాజ్‌, మార్కాపురం: ఇమ్మడి కాశీనాథ్‌, గిద్దలూరు: బైరబోయిన చంద్రశేఖర్‌యాదవ్‌, ప్రొద్దుటూరు: ఇంజా సోమశేఖర్‌రెడ్డి, నెల్లూరు నగరం: కేతంరెడ్డి వినోద్ రెడ్డి, మైదుకూరు: పందింటి మల్హోత్రా ,కదిరి: సాడగల రవికుమార్‌ (వడ్డే రవిరాజు) పేర్ల‌ను ఖ‌రారు చేసారు.

English summary
Pawan Kalyan released another 13 candidates for assembly and one for loksabha. Pawan Kalyan may contest for Gajuwaka in Visakha dist. Final list may announce to night.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X