వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కడప జిల్లాలో పాలెగాళ్ళ రాజ్యం..పుస్తకంలో జగన్ ప్రస్తావన: జనసేనాని ఏమంటారంటే..!

|
Google Oneindia TeluguNews

ముఖ్యమంత్రి జగన్ పైన కొద్ది రోజులు తీవ్ర విమర్శలు చేస్తున్న పవన్ కళ్యాణ్ మరో అంశం ద్వారా ఇప్పడు టార్గెట్ చేసారు. తాజాగా పవన్ కళ్యాన్ చేసిన ట్వీట్లతో పాటుగా పార్టీ చేసిన ట్వీట్లు రాజకీయంగా కలకలంగా మారాయి. తాజాగా పౌర హక్కుల సంఘం రాసిన కడప జిల్లాలో పాలెగాళ్ల రాజ్యం పుస్తకంలో సీఎం జగన్ ప్రస్తావన ఉన్న ఒక పేజీని జనసేన పార్టీ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. దీనికి సంబంధించే జనసేన అధినేత పవన్ కళ్యాన్ సైతం కొన్ని ట్వీట్లు చేసారు.

అందులో రాయలసీమ నుంచి ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చిన ఎందుకు దళిత, వెనుకబడిన, మిగతా అన్నికులాల సామాన్య ప్రజలు ఈ ముఠా సంస్కృతి వలన ఎలా నలిగి ,వలసలు వెళ్లి పోతున్నారు, రాయలసీమ వెనుకబాటుకు కారణాలు ఏంటో అవగతమౌతుంది..అంటూ ట్వీట్ చేసారు. అయితే పార్టీ ట్విట్టర్ ఖాతా నుండి పోస్ట్ అయిన పుస్తకం లోని అంశమే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

పవన్ కళ్యాన్ పాటలు..సీఎం రమేష్ స్టెప్పులు: రిత్విక్ నిశ్చితార్దంలో స్పెషల్ ఎట్రాక్షన్..! (video)పవన్ కళ్యాన్ పాటలు..సీఎం రమేష్ స్టెప్పులు: రిత్విక్ నిశ్చితార్దంలో స్పెషల్ ఎట్రాక్షన్..! (video)

కడప జిల్లాలో పాలెగాళ్ల రాజ్యం పుస్తకంలో..

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్లు..పార్టీ చేసిన ట్వీట్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ తన ట్వీట్ లో ..మానవ హక్కుల ఉల్లంఘన అధికంగా ఉన్నది.. రాయల సీమ లోనే..దళిత కులాల మీద దాడులు జరిగిన..బయటకి వచ్చి చెప్పటానికి భయపడతారు. ఇంకా మిగతా వారు ముఠాలు చెప్పింది ,మౌనంగా వినటమే. పోరాట యాత్రలో నన్ను యువత కలిసి వారి బాధలు వెళ్లపోసుకుంటుంటే నా గుండె కలిచి వేసింది...అంటూ ట్వీట్ చేసారు.

చేదు నిజాలు బయటకు వస్తాయి..

దీనికి కొనసాగింపుగా పవన్ చేసిన మరో ట్వీట్ లో పౌర హక్కుల సంఘం ప్రచురించిన ఈ పుస్తకం గురించ కామెంట్చ చేసారు. 1996 లో పౌరహక్కులు వారు ప్రచురించిన ఈ పుస్తకంలో,అనేక చేదు నిజాలు బయటకి వస్తాయి.రాయలసీమ నుంచి ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చిన ఎందుకు దళిత, వెనుకబడిన, మిగతా అన్నికులాల సామాన్య ప్రజలు ఈ ముఠా సంస్కృతి వలన ఎలా నలిగి ,వలసలు వెళ్లి పోతున్నారు, రాయలసీమ వెనుకబాటుకు కారణాలు ఏంటో అవగతమౌతుంది..అంటూ పేర్కొన్నారు.

జగన్ రెడ్డి గారి ప్రస్తావన కూడా ఉంటుంది

ఆడపిల్లపై అఘాయిత్యం జరిగి ఏళ్ళు గడుస్తున్నా ఇంకా న్యాయం జరగకపోవడం రాయలసీమలో మానవ హక్కుల ఉల్లంఘన ఏ స్థాయిలొ ఉందో తెలిపే మచ్చుతునక అంటూ జనసేనాని ట్వీట్ చేసారు. దీంతో పాటుగా..1996లో పౌరహక్కులు వారు ప్రచురించిన ఈ పుస్తకంలో.. అనేక చేదు నిజాలు బయటకి వస్తాయని వివరించారు.

రాయలసీమ నుంచి ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చిన ఎందుకు దళిత, వెనుకబడిన..మిగతా అన్నికులాల సామాన్య ప్రజలు ఈ ముఠా సంస్కృతి వలన ఎలా నలిగి ..వలసలు వెళ్లి పోతున్నారు,.. రాయలసీమ వెనుకబాటుకు కారణాలు ఏంటో అవగతమౌతుందంటూ విశ్లేషించారు. మానవ హక్కుల ఉల్లంఘన అధికంగా ఉన్నది రాయలసీమలోనే.. కర్నూలులోని ఒక రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థిని, 14 ఏళ్ల ‘సుగాలి ప్రీతి' ఉదంతమే దానికి ఉదాహరణ. అలాగే ఈ పుస్తకంలో 75వ పేజీలో శ్రీ జగన్ రెడ్డి గారి ప్రస్తావన కూడా ఉంటుంది..అంటూ పవన్ పేర్కొన్నారు.

వైసీపీ స్పందన ఏ రకంగా..

వైసీపీ స్పందన ఏ రకంగా..

ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ కు సంబంధించిన అంశాన్ని ప్రస్తావిస్తూ ఈ పుస్తకంలోని పేజీని సైతం జనసేన ట్వీట్ చేసింది. మరి ఈ ట్వీట్‌పై వైసీపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే మరి.

English summary
Janasena revealed YS jagan involvement in book Kadapa jillalo palegalla rajyam book which published by Civil Rights Association.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X