వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గుంటూరులో జ‌న‌సేన ప‌టిష్టం..! నాదెండ్ల చేరిక‌తో మారుతున్న స‌మీక‌ర‌ణాలు..!!

|
Google Oneindia TeluguNews

హైద‌రాబాద్/ఏపి : ఏపిలో రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు శ‌ర‌వేగంగా మారుతున్నాయి. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్టులు య‌ధాలాపంగా జ‌రిగిపోతున్నాయి. ఎన్నికల నాటికి ఇంకా ఎలాంటి ప‌రిణామాలు జ‌రుగుతాయో అంచానా వేయ‌డం కూడా క‌ష్టంగా మారుతోంది. ఏపిలో అదికార, ప్ర‌తిప‌క్షానికి ప్ర‌త్యామ్నాయంగా ఎదుగుతున్న జ‌న‌సేన పార్టీ మాత్రం రోజురోజుకూ ప్రజాధ‌ర‌ణ పొందుతోంది. అంతే కాకుండా బ‌ల‌మైన నేత‌లు ఆ పార్టాలో చేరేందుకు సుముఖ‌త వ్య‌క్తం చేస్తున్నారు. దీంతో రాబోవు రోజుల్లో జ‌న‌సేన‌ ఇంకెన్ని అద్బుతాలు చేస్తుందోన‌నే ఉత్కంఠ రాజ‌కీయ వ‌ర్గాల్లో నెల‌కొంది.

జ‌న‌పేన‌లోకి ఊహించ‌ని వ‌ల‌స‌లు..! మారుతున్న ఏపి రాజ‌కీయం..!!

జ‌న‌పేన‌లోకి ఊహించ‌ని వ‌ల‌స‌లు..! మారుతున్న ఏపి రాజ‌కీయం..!!

మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ తెనాలి నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేనలో చేరిన ఆయన అంతకు ముందుగానే తెనాలి టిక్కెట్ ఆశించినట్టు తెలుస్తోంది. ఈ ఒప్పందం మేరకే ఆయన జనసేనలో చేరిన‌ట్టు సమాచారం. మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కుమారుడైన నాదెండ్ల మనోహర్ తెనాలి నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే రాష్ట్ర విభజన నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాభవం పాలవడంతో గత ఎన్నికల్లో నాదెండ్ల డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయారు. ఆ తర్వాత రాజకీయాకు దూరంగావుంటూవచ్చారు.

చాప‌కింద నీరులా జ‌న‌సేన‌..! ఏపీలో క్యూ క‌డుతున్న కీల‌క‌నేత‌లు..!!

చాప‌కింద నీరులా జ‌న‌సేన‌..! ఏపీలో క్యూ క‌డుతున్న కీల‌క‌నేత‌లు..!!

నాదెండ్ల జనసేనలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఆయన చాలా రోజుల నుంచి కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపధ్యంలోనే తనకు పరిచయం ఉన్న వ్యక్తి, పవన్ కల్యాణ్‌కు సన్నిహితుడుగా పేరున్న పారిశ్రామిక వేత్త లింగమనేని రమేష్ సాయం తీసుకున్నారని తెలుస్తోంది. లింగమనేని ఆధ్వర్యంలో కొద్ది రోజుల క్రితం నిర్మించిన వెంకటేశ్వర ఆలయానికి సంబంధించి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాల్లో నాదెండ్ల మనోహర్ కీలకంగా వ్యవహరించారు. ఈ సమయంలోనే నాందెండ్ల తన మనసులోని భావాన్ని లింగమనేని ముందు చెప్పడం, అది కార్యరూపం దాల్చడం జరిగిందంటున్నారు. కాగా జనసేనలో చేరబోయే నాదెండ్ల మనోహర్ కు జనసేన తరపున గుంటూరు జిల్లా వ్యవహారాలు చక్కదిద్దే టాస్క్ కూడా అప్పగించనున్నారని తెలుస్తోంది.

నాదెండ్ల చేరిక‌తో పార్టీ బ‌లోపేతం..! మరికొంత మంది నేత‌లు చేరే ఛాన్స్..!!

నాదెండ్ల చేరిక‌తో పార్టీ బ‌లోపేతం..! మరికొంత మంది నేత‌లు చేరే ఛాన్స్..!!

ఇదిలావుండగా జనసేన పార్టీ లోకి ఒక్కొక్కరుగా పెద్దనేతలు చేరుతుండటంతో పార్టీ తన బలం పెంచుకున్నట్లవుతున్నదనే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. దీనికితోడు ఒకవైపు చంద్రబాబు ప్రభుత్వం ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్నదనే ఆరోపణలున్నాయి. అలాగే జగన్ పలు అంశాలలో విమర్శలు ఎదుర్కొంటూ వస్తున్నారు. ఈ నేపధ్యంలో ఈ రెండు అంశాలను జనసేన తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నదని సమాచారం. దీనికితోడు ఏపీ ఓటర్లు రాజకీయాల్లో కొత్తదనం కోరుకుంటున్నారన్న వార్తలు వస్తున్న నేప ధ్యంలో పవన్ కు మద్దతు పలికే అవకాశాలు ఉండవచ్చని తెలుస్తోంది.

గుంటూరు జిల్లాలో జ‌న‌సేన‌కు తిరుగులేదు..! పార్టీ స్వ‌రూపం మార్చ‌నున్న నాదెండ్ల‌..!!

గుంటూరు జిల్లాలో జ‌న‌సేన‌కు తిరుగులేదు..! పార్టీ స్వ‌రూపం మార్చ‌నున్న నాదెండ్ల‌..!!

మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు తనయుడు నాదెండ్ల మనోహర్ తెనాలి నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2014 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ త‌ర‌ఫున పోటీ చేసి ఓడిపోయారు. 2019 ఎన్నిక‌ల నేప‌థ్యంలో జ‌న‌సేన‌లో చేరాల‌ని ఫిక్స్ అయ్యారు. కొద్ది రోజుల క్రితం ప‌వ‌న్ తో నాదెండ్ల భేటీకి లింగ‌మ‌నేని ర‌మేష్ ఏర్పాటు చేశారు. ఆ భేటీలో తెనాలి నుంచి జనసేన అభ్యర్థిగా నాదెండ్ల‌ను బ‌రిలోకి దించాల‌ని ప‌వ‌న్ భావించిన‌ట్టు తెలుస్తోంది. దీంతో స్లో అండ్ స్ట‌డీ విన్స్ ద రేస్ అన్న చందంగా ఏపీలో జ‌న‌సేన త‌న ప్ర‌భావాన్ని రోజురోజుకూ పెంచుకుంటూ పోతోంద‌ని చెప్పొచ్చు.ఎన్నికల స‌మ‌యానికి ఇంకెంత‌మంది కీల‌క నేత‌లు జ‌న‌సేన‌లో చేరతారో చూడాలి.

English summary
Political equations in AP are rapidly changing. Nobody's unexpected Twists are doing the job. It is also difficult to predict what kind of consequences will occur by the election. The party is gaining popularity day by day and the party is growing as an alternative to the Opposition.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X