అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సత్యసాయి జిల్లా కోసం డిమాండ్, ఫ్యాన్స్ హంగామా-అపశృతి: 'పవన్! హోదాపై మాట్లాడవేం'

|
Google Oneindia TeluguNews

Recommended Video

పవన్ కొత్త డిమాండ్, అపశృతి: హోదాపై మాట్లాడవేం పవన్ ?

అనంతపురం: విద్య, వైద్య రంగాల్లో పుట్టపర్తి సత్య సాయిబాబా విశేష సేవలందించారని జనసేన అధ్యక్షులు పవన్‌ కళ్యాణ్‌ అన్నారు. కదిరి పర్యటన అనంతరం ఆయన పుట్టపర్తి చేరుకున్నారు. అక్కడ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. సత్యసాయి స్ఫూర్తితో జనసేన ముందుకు పోతుందన్నారు.

చదవండి: పవన్‌తో టీడీపీ ఎమ్మెల్యే గంటన్నరపాటు భేటీ, జైళ్లో పెట్టినా: బాబుకూ జనసేనాని ఝలక్!

సత్య సాయిబాబా సేవలకు గుర్తింపుగా ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు. సత్యసాయి పేరుతో కొత్త జిల్లా ఏర్పాటు చేస్తే సంపూర్ణ మద్దతు ఇస్తామన్నారు. పవన్ అంతకుముందు కదిరి లక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకున్నారు.

చదవండి: ఆసక్తికరం: పరిటాల ఇంటికి పవన్, ఎదురెళ్లిన శ్రీరామ్, 'తెలంగాణ ఇష్యూలా కావొద్దు'

కదిరి ఆలయంలో పూజలు

కదిరి ఆలయంలో పూజలు

కదిరి లక్ష్మీనర్సింహ స్వామి ఆలయంలో పవన్‌కు అర్చకులు, ఆలయ అధికారులు ఆలయ పద్ధతుల ప్రకారం ఘన స్వాగతం పలికారు. కదిరి నరసింహస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం, అర్చకుల ఆశీర్వాదాలు స్వీకరించిన తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు. పవన్‌ని చూసేందుకు అభిమానులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.

 జీవితకాలం ప్రజా క్షేత్రంలో

జీవితకాలం ప్రజా క్షేత్రంలో

అనంతలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. తన జీవితకాలం ప్రజా క్షేత్రంలోనే ఉంటానని పవన్‌ కళ్యాణ్ చెప్పారు. కదిరిలో పర్యటించిన ఆయన ఆత్మహత్యలకు పాల్పడిన రైతు కుటుంబాలను పరామర్శించారు. బాధిత రైతు కుటుంబాల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతపురంలో ప్రకృతి అనుకూలంగా లేకపోవడం దురదృష్టకరమన్నారు. ప్రతికూల పరిస్థితులను ఎదురొడ్డి సమస్యలను పరిష్కరించాలన్నారు. మానవ మేధస్సు గొప్పదని, ఏ సమస్యకైనా పరిష్కారం దొరుకుతుందన్నారు.

నా జీవితం ధన్యమైనట్లే

నా జీవితం ధన్యమైనట్లే

తన జీవితాంతం ప్రజాక్షేత్రంలోనే ఉంటానని, దేశ ప్రజలకు ఎంత ఉపయోగపడగలనో అంత ఉపయోగపడతానని పవన్‌ కళ్యాణ్ అన్నారు. ప్రస్తుతం ప్రజల మధ్య ఉండి సమస్యలు తెలుసుకుంటున్నానని చెప్పారు. అనంతపురం జిల్లాకు తాను ఏదైనా చేయగలిగితే తన జీవితం ధన్యమైనట్లే అన్నారు.

పవన్ పర్యటనలో అపశృతి, అభిమానికి గాయాలు

పవన్ పర్యటనలో అపశృతి, అభిమానికి గాయాలు

పవన్ అనంతపురం పర్యటనలో ఆదివారం అపశృతి చోటు చేసుకుంది. నల్లమాడ వద్ద పవన్ కాన్వాయ్‌లోని కారు కింద పడి మహేష్ అనే యువకుడు గాయపడ్డాడు. పవన్ కదిరి నుంచి పుట్టపర్తి వెళ్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. కాన్వాయ్‌ని ఆపిన పవన్ ప్రమాదానికి గల కారణాలు తెలుసుకున్నారు. మహేష్‌ను ఆసుపత్రికి తరలించాలని సూచించారు.

పవన్ కళ్యాణ్ పుట్టపర్తిలో పర్యటించిన సమయంలో అభిమానులు జై పవన్ కళ్యాణ్, జై జనసేన అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. శనివారమే ఫ్యాన్స్ అత్యుత్సాహం ప్రదర్శిస్తే పవన్ వారించారు. ఆయన మాట్లాడుతుండగా కొందరు ఈలలు వేశారు. దీనిపై పవన్ స్పందిస్తూ.. ఇది బతుకు సమస్య అని, ఇలాంటి సమస్య గురించి చర్చిస్తున్నప్పుడు దయచేసి ఈలలు వేయవద్దన్నారు. కాగా, పవన్ అనంతలో పర్యటించడంపై ప్రజలు, అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. కాగా, తమ నీటి సమస్యలు పవన్ పరిష్కరిస్తారని ప్రజలు భావిస్తున్నారు.

పవన్‌కు బొత్స ప్రశ్న

పవన్‌కు బొత్స ప్రశ్న

ప్రత్యేక హోదాపై ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించడం లేదని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. నాలుగేళ్లుగా బీజేపీతో పొత్తు పెట్టుకొని ఇప్పుడు నమస్కారం చెప్పడం సరికాదన్నారు. ఉత్తరాంధ్రలో టీడీపీ దోపిడీ, అవినీతిపై ఈ నెల 31న ప్రధాని మోడీకి లేఖ రాస్తామని చెప్పారు. చంద్రబాబు విదేశీ పర్యటనలు, పెట్టుబడులపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

English summary
Puttaparthi Hanuman Nagar was completely over crowded with people due to Pawan's craze. Pawan Kalyan while addressing public at Hanuman Circle in Puttaparthi said Janasena will work out on the possibilities of making Puttaparthi as a district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X