వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పీఆర్పీ ఎందుకు నిలబడలేదంటే.. జనసేనాని చెప్పిన కారణమిదే..?

|
Google Oneindia TeluguNews

అమరావతి : జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన అన్న చిరంజీవి పెట్టిన పార్టీ ప్రజారాజ్యం ఎందుకు నిలబడలేదో కుండబద్దలు కొట్టీ మరి చెప్పారు. జనసేనకు కార్యకర్తల బలం ఉందని .. భవిష్యత్‌లో మరింత బలోపేతం చేస్తామని పేర్కొన్నారు. రాజకీయాల్లో గెలుపు, ఓటములు సహజమేనని స్పష్టంచేశారు. సోమవారం మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.

తాను ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొగలనని, తనకు ఆ నమ్మకం ఉందన్నారు. రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి రాలేకపోయినా .. ఓటమి గురించి బాధ లేదన్నారు. కేవలం ఒక్క ఎమ్మెల్యే గెలిచినా .. ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తానని స్పష్టంచేశారు. జనసేన పార్టీని తన తుదిశ్వాస ఉన్నంతవరకు నడుపుతానని వెల్లడించారు. ఈ సందర్భంగా తన అన్న చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీ ఎందుకు మనగలదో వివరించారు. తాను పార్టీ పెట్టాక గానీ పరిస్థితి అర్థం కాలేదన్నారు. ఇప్పుడు నేతలతో మాట్లాడితే సమస్యలు పరిష్కరం అవుతున్నాయన్నారు. అప్పుడు ఇప్పటీలా చొరవ తీసుకుంటే పార్టీ ఉండేదన్నారు. మరోవైపు చిరంజీవి మెతకవైఖరి కూడా ఓ కారణమని విశ్లేషించారు. ఆయన కఠినంగా ఉంటే పార్టీ ఉండేదన్నారు. వారి ఒత్తిడితోనే ప్రజారాజ్యం పార్టీ నడపలేకపోయారని పేర్కొన్నారు.

janasena will be strengthen in future pawan kalyan

జనసేన పార్టీకి ఏపీ అసెంబ్లీలో ఒక్క ఎమ్మెల్యే ఉన్నారని గుర్తుచేశారు. భవిష్యత్‌లో తమ పార్టీ అధికారం చేపట్టేందు కోసం పాటుపడతామన్నారు. జనసేన పార్టీ రాష్ట్రంలో మరింత బలోపేతం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఒక్క ఎమ్మెల్యే నుంచి అధికారం చేపట్టేవరకు తమ పార్టీ ఎదుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ఆయాచోట్ల జనసేన రెండు, మూడోస్థానంలో ఉందని గుర్తుచేశారు. మొదటి స్థానానికి వచ్చేందుకు నేతలంతా కృషిచేయాలని కోరారు. లోక్ సభ స్థానాల్లో కూడా పార్టీ పరిస్థితి బాగుందన్నారు. ముఖ్యంగా నరసాపురంలో జనసేన మంచి జోరు మీదున్నదన్నారు.

English summary
Janasena chief Pawan Kalyan made sensational remarks. Janasena has the strength of activists .. It will be strengthened in the future. In politics, victory and defeat are natural.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X