విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జ‌న‌సేన‌ ఐదో జాబితా విడుద‌ల‌..! నేడు గాజువాక‌లో నామినేష‌న్ వేయ‌నున్న గ‌బ్బ‌ర్ సింగ్..!!

|
Google Oneindia TeluguNews

అమరావతి/హైద‌రాబాద్: చ‌ట్ట స‌భ‌ల్లో ప్ర‌వేశించేందుకు జ‌న‌సైనొకుడి తొలి అడుగు నేడు ప‌డ‌బోతోంది. ప్ర‌జామోదంతో రాజ్యాంగ బ‌ద్దంగా ప్ర‌జా సేవ చేసేందుకు, చ‌ట్టాల రూక‌ల్ప‌న‌లో త‌న భాగ‌స్వామ్యం కోసం చేసే ప్ర‌య‌త్నానికి నేటితో అంకురార్ప‌ణ జ‌ర‌గ‌బోతోంది. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గురువారం నామినేషన్ వేయనున్నారు. పవన్ కళ్యాన్ గాజువాక నుంచి పోటీకి దిగుతున్నారు.

ఉదయం పదింటికి విశాఖ విమానాశ్రయానికి చేరుకోనున్న పవన్‌ గాజువాక జీవీఎంలో నామినేషన్‌ వేస్తారు. ఉదయం 11గంటలకు గాజువాకలో నిర్వహించే బహిరంగ సభలో కూడా పాల్గొంటారు. మధ్యాహ్నం మూడింటికి ఆనందపురం పూల మార్కెట్‌ వద్ద నిర్వహించే బహిరంగ సభలో, సాయంత్రం ఐదింటికి ఆర్టీసీ కాంప్లెక్స్‌ సమీపంలోని పాత జైలు రోడ్డు వద్ద నిర్వహించే సభలో పాల్గొంటారు.

ప‌వ‌న్ కు అండ‌గా నాగబాబు :జ‌న‌సేన లో ఎంట్రీ : న‌ర్సాపురం ఎంపీగా బ‌రిలోకి..!ప‌వ‌న్ కు అండ‌గా నాగబాబు :జ‌న‌సేన లో ఎంట్రీ : న‌ర్సాపురం ఎంపీగా బ‌రిలోకి..!

జనసేన పార్టీ నుంచి లోక్ సభ, శాసనసభ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులతో అయిదో జాబితాను విడుదల చేశారు. నాలుగు లోక్ సభ, 16 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. తెలంగాణలోని మహబూబాబాద్ లోక్ సభ స్థానానికి అభ్యర్థిని ఎంపిక చేశారు.

Janesenas fifth list release..! Gabbar Singh to be nominated today..!!

లోక్ సభ అభ్యర్థులు...
1. విజయనగరం: శ్రీ ముక్కా శ్రీనివాసరావు. 2. కాకినాడ: శ్రీ జ్యోతుల వెంకటేశ్వరరావు. 3. గుంటూరు: శ్రీ బి.శ్రీనివాస్.
4. నంద్యాల: శ్రీ ఎస్.పి.వై.రెడ్డి. 5. మహబూబాబాద్ (తెలంగాణ): డా.భూక్యా భాస్కర్ నాయక్.

శాసనసభ అభ్యర్థులు...!
1) సాలూరు: శ్రీమతి బోనెల గోవిందమ్మ. 2) పార్వతీపురం : శ్రీ గొంగడ గౌరీ శంకరరావు. 3) చీపురుపల్లి: శ్రీ మైలపల్లి శ్రీనివాసరావు. 4) విజయనగరం: డా.పెదమజ్జి హరిబాబు. 5) బొబ్బిలి: శ్రీ గిరదా అప్పలస్వామి. 6) పిఠాపురం: శ్రీమతి మాకినీడు శేషుకుమారి. 7) కొత్తపేట: శ్రీ బండారు శ్రీనివాసరావు. 8) రామచంద్రపురం: శ్రీ పోలిశెట్టి చంద్రశేఖర్
9) జగ్గంపేట: శ్రీ పాటంశెట్టి సూర్యచంద్ర రావు. 10) నూజివీడు: శ్రీ బసవా వైకుంఠ వెంకట భాస్కరరావు
11) మైలవరం: శ్రీ అక్కల రామ్మోహన్ రావు (గాంధీ). 12) సత్తెనపల్లి: శ్రీ వై.వెంకటేశ్వర రెడ్డి. 13) పెదకూరపాడు: శ్రీమతి పుట్టి సామ్రాజ్యం. 14) తిరుపతి: శ్రీ చదలవాడ కృష్ణమూర్తి. 15) శ్రీకాళహస్తి: శ్రీమతి వినుత నగరం. 16) గుంతకల్లు: శ్రీ మధుసూదన్ గుప్తా

English summary
Janasana President Pawan Kalyan will be nominated today. Pawan Kalyan is coming to contest from Gajuwaka. Pawan Kalyan, who will reach Vishakha airport in the morning, will be nominated in the GVM.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X