జగన్ ప్రమాణ స్వీకారానికి మోదీ ప్రతినిధులు : మోదీ ప్రమాణ స్వీకారానికి కేసీఆర్..జగన్..!
ఈ నెల 30న ఇటు రాష్ట్రంలో జగన్..అటు కేంద్రంలో మోదీ ఒకే రోజు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటికే ఇద్దరూ ముహూర్తాలు నిర్ణయించుకోవటంతో ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. అయితే, ఢిల్లీకి వెళ్లి మోదీని తన ప్రమాణ స్వీకారినికి రావాల్సిందిగా జగన్ ఆహ్వానించారు. అదే రోజు తన ప్రమాణ స్వీకారం ఉందని మోదీ వివిరించారు. అయితే, ప్రధాని ప్రమాణ స్వీకారానికి రావాలంటూ జగన్‌కు కేంద్ర ప్రభుత్వం నుండి అధికారిక ఆహ్వానం అందింది. దీంతో.. ఆయన మోదీ ప్రమాణ స్వీకారానికి హాజరు కావాలని నిర్ణయించారు.
జగన్ ప్రమాణ స్వీకారానికి అతిధులు..
ఈ నెల 30న విజయవాడలోని ఇందిరా గాంధీ స్టేడియంలో ఏపీ నూతన ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకారం చేయనున్నార. తన ప్రమాణ స్వీకారానికి హాజరు కావాలంటూ మోదీని వ్యక్తిగతంగా కలిసి జగన్ ఆహ్వానించారు . అయితే అదే రోజు తన ప్రమాణ స్వీకారం కూడా ఉండటంతో తాను రాలేనని మోదీ స్పష్టం చేసారు. ఇదే సమయంలో తన తరపున పంపిస్తానని హామీ ఇచ్చారు. ఆ వెంటనే బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాతోనూ జగన్ సమాశమయ్యారు. తన ప్రమాణ స్వీకారానికి రావాలంటూ అమిత్ షాను జగన్ ఆహ్వానించారు. జగన్‌తో ఏపీ భవన్లో బిజేపీ ముఖ్య నేత రాం మాధవ్ కలిసి ఏపీ రాజకీయాల పైన చర్చించారు. ఆ సమయంలో జగన్ ప్రమాణ స్వీకారానికి మోదీ- అమిత్ షా ప్రతినిధులుగా నేతలు హాజరువుతున్నారని వివరించారు. ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏపీ పర్యటన ఖరారైంది. ఈనెల 29న రాత్రికి ఆయన కుటుంబ సభ్యులతో కలిసి విజయవాడ చేరుకుంటారు. 30వతేదీ ఉదయం కనకదుర్గను దర్శించుకున్న తరువాత జగన్ ప్రమాణ స్వీకారానికి హాజరవుతారు.

మోదీ ప్రమాణ స్వీకారానికి జగన్..కేసీఆర్
ఇక, ప్రధానిగా వరుసగా రెండో సారి మోదీ ఈనెల 30వ తేదీ రాత్రి 7గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మోదీ ప్రమాణ స్వీకారానికి హాజరు కావాల్సిందిగా ఏపీ-తెలంగాణ ముఖ్యమంత్రులకు ఆహ్వానాలు అందాయి. 30వతేదీ మధ్నాహ్నం తన ప్రమాణ స్వీకారం ముగిసిన వెంటనే జగన్..కేసీఆర్ గన్నవరం నుండి ప్రత్యేక విమానంలో నేరుగా ఢిల్లీకి వెళ్లనున్నారు. జగన్‌తో పాటుగా విజయమ్మ కూడా వెళ్తున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి హోదాలో జగన్ తొలి పర్యటన సైతం ఢిల్లీ కావటం...అందునా ప్రధాని ప్రమాణ స్వీకారం కావటంతో..అక్కడ ప్రముఖ జాతీయ నేతలంతా హాజరుకానున్నారు. కాంగ్రెస్ పార్టీ మాజీ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్‌తో పాటుగా అనేక మంది నేతలు ఈ కార్యక్రమానికి రానున్నారు. దీంతో..ముఖ్యమంత్రిగా తాను వెళ్తున్న తొలి ఢిల్లీ పర్యటనకు తన తల్లిని సైతం తీసుకెళ్లాలని జగన్ నిర్ణయించారు.