వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రెండురోజుల్లో జనసేన తొలి జాబితా ..? లిస్ట్ లో చోటు దక్కేది వీరికేనా ..?

|
Google Oneindia TeluguNews

Recommended Video

Date Fixed for Janasena First Candidates List? | Oneindia Telugu

హైదరాబాద్ : సార్వత్రిక ఎన్నికలతోపాటు ఏపీ అసెంబ్లీకి షెడ్యూల్ విడుదలవడంతో రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఎంపికలో బిజీ బిజీగా ఉన్నాయి. ఇప్పటికే అధికార టీడీపీ, వైసీపీ కొందరు అభ్యర్థుల పేర్లను మాత్రమే ఖరారు చేశాయి. జాబితా మాత్రం కొలిక్కిరాలేదు. ఇందులో జనసేన పార్టీ ఒకడుగు ముందే ఉంది. రెండురోజుల్లో తమ తొలి జాబితా విడుదల చేస్తామని స్పష్టంచేసింది.

జగన్, కేసీఆర్ కోరుకున్నదే జరిగిందా ? తెలుగురాష్ట్రాల్లో ఒకేరోజు ఎన్నికలు దానికి సంకేతమా ?జగన్, కేసీఆర్ కోరుకున్నదే జరిగిందా ? తెలుగురాష్ట్రాల్లో ఒకేరోజు ఎన్నికలు దానికి సంకేతమా ?

అభ్యర్థుల ఎంపికపై తుది కసరత్తు

అభ్యర్థుల ఎంపికపై తుది కసరత్తు

ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తారనే ఊహాగానాల మధ్య ఆదివారం తమ పార్టీ నేతలతో పవన్ కల్యాణ్ సమావేశమయ్యారు. అభ్యర్థుల ఎంపికకు సంబంధించి స్క్రీనింగ్ కమిటీ ముందుకొచ్చిన దరఖాస్తులను పరిశీలించి .. జనరల్ బాడీకి అందజేశారు. తర్వాత అభ్యర్థుల ఖరారుపై పవన్ సమాలోచనలు జరిపారు. అందరీ అభిప్రాయం తీసుకొని, సామాజిక సమీకరణాలు, గెలుపు గుర్రాల ఆధారంగా అసెంబ్లీ, లోక్ సభ ఫస్ట్ లిస్ట్ ను రెండురోజుల్లో విడుదల చేస్తామని జనసేన పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

 వీరితోనేనా ఫస్ట్ లిస్ట్

వీరితోనేనా ఫస్ట్ లిస్ట్

లోక్ సభతోపాటు అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల ఎంపికపై జనసేన పార్టీ గత కొద్దిరోజులుగా కసరత్తు చేస్తోంది. తొలి జాబితాలో తూర్పుగోదావరి, గుంటూరు, శ్రీకాకుళం, అనంతపురం జిల్లాలకు చెందిన కొన్ని నియోజవర్గాలు ఉంటాయని విశ్వసనీయంగా తెలుస్తోంది. ఇప్పటికే జనసేన తొలి అభ్యర్థిగా తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నుంచి బీసీ నేత పితాని బాలకృష్ణ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. ఇక రాజమహేంద్రవరం ఎంపీ అభ్యర్థిగా ఆకుల సత్యనారాయణ, రాజమహేంద్రవరం రూరల్ నుంచి కందుల దుర్గేష్, తుని నుంచి రాజా అశోక్ బాబు, మండపేట నుంచి దొమ్మేటి వెంకటేశ్వర్లు, కాకినాడ రూరల్ నుంచి అనిశెట్టి బుల్లెబ్బాయి, పి గన్నవరం నుంచి పాముల రాజేశ్వరి, రాజోలు నుంచి రాపాక వరప్రసాద్ పేర్లతో జాబితా ఉండే అవకాశం ఉంది.

 వీరిది లాంఛనమేనా

వీరిది లాంఛనమేనా

ఇక గుంటూరు జిల్లాలో తోట చంద్రశేఖర్, నాదెండ్ల మనోహర్ పేర్లు కూడా ఉండే ఛాన్స్ ఉంది. నాదెండ్ల మనోహర్ .. కాంగ్రెస్ పార్టీని వీడి జనసేనలో చేరారు. పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నందున .. ఆయనకు తొలి జాబితాలో సీటు వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. వీరితోపాటు అనంతపురం జిల్లాలో రాజకీయ నాయకులు కాకుండా ప్రజాసేవ చేసే ఇద్దిరికీ టికెట్ ఇస్తారనే ప్రచారం సాగుతోంది. అన్నీ కుదిరితే వారి పేర్లు కూడా తొలి జాబితాలో ఉండే ఛాన్స్ లేకపోలేదు.

English summary
Pawan Kalyan met with party leaders Sunday. Pawan's comments were made on finalizing candidates. Janasana Party sources have claimed that they will release the assembly and the Lok Sabha first list in two days based on social equations and winning horses.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X