వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్ కు షాక్ ఇస్తూ .. నేడు జగన్ నిర్ణయానికి మద్దతుగా ఏకైక జనసేన ఎమ్మెల్యే రాపాక

|
Google Oneindia TeluguNews

జనసేన ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్ పవన్ కళ్యాణ్ కు షాకుల మీద షాక్ లు ఇస్తున్నారు. ఇప్పటికే అనేక సందర్భాల్లో ఏపీ సీఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి మద్దతుగా మాట్లాడిన జనసేన ఎమ్మెల్యే రాపాక రాజధాని అమరావతి విషయంలో కూడా పవన్ కళ్యాణ్ తో విబేధించారు. ఇక తాజాగా నేడు జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లోనూ జగన్ నిర్ణయానికి జై కొట్టనున్నట్టు రాపాక పేర్కొనటం జనసేనాని పవన్ కళ్యాణ్ కు ఇబ్బందికర పరిణామం అని చెప్పక తప్పదు.

వెలగపూడిలో జగన్... కొనసాగుతున్న క్యాబినెట్ భేటీ ..గోప్యంగా అజెండా .. హోం మంత్రికి నిరసన సెగవెలగపూడిలో జగన్... కొనసాగుతున్న క్యాబినెట్ భేటీ ..గోప్యంగా అజెండా .. హోం మంత్రికి నిరసన సెగ

పవన్ నిర్ణయానికి వ్యతిరేకంగా రాపాక

పవన్ నిర్ణయానికి వ్యతిరేకంగా రాపాక

జనసేన నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ గత కొంత కాలంగా పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న విషయం తెలిసిందే. ఇక నేడు రాజధాని విషయంలో కీలక నిర్ణయం తీసుకునే దిశగా అసెంబ్లీ సమావశాలు జరగనున్న నేపధ్యంలో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు షాక్ ఇచ్చే విషయం చెప్పారు జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ . మూడు రాజధానులపై ఈరోజు ఏపీ అసెంబ్లీలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ వ్యతిరేకిస్తున్న మూడు రాజధానులకు మద్దతు తెలుపుతున్నట్టు ప్రకటించి సంచలనం సృష్టించారు.

మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా పవన్ పోరుబాట

మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా పవన్ పోరుబాట

ఇప్పటికే జనసేనాని పవన్ కళ్యాణ్ ఏపీకి మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకించారు. రాజధానిగా అమరావతి కొనసాగాలని ఆయన రాజధాని రైతుల కోసంపోరుబాట సాగించారు. రాజధాని రైతుల ఆందోళనలలో పాల్గొన్నారు .ఇక తాజాగా పొత్తు పెట్టుకున్న బీజేపీతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలకు శ్రీకారం చుడుతున్నారు. అయితే ఆయన సోదరుడు చిరంజీవి జగన్ మూడు రాజధానుల ప్రతిపాదనను స్వాగతించారు .

అసెంబ్లీ చర్చలో జగన్ కు మద్దతు ఇస్తానన్న రాపాక

అసెంబ్లీ చర్చలో జగన్ కు మద్దతు ఇస్తానన్న రాపాక

దీంతో పవన్ నిర్ణయాన్ని వ్యతిరేకించి , జగన్ నిర్ణయానికి మద్దతు తెలిపిన ఆ పార్టీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఒక ఇంటిలోని అన్నాతమ్ముళ్ళ మధ్యనే ఏకాభిప్రాయం లేనప్పుడు, ఒక పార్టీలో ఉన్నంత మాత్రాన ఉంటుందా అని మాట్లాడి అప్పుడే పవన్ కు షాక్ ఇచ్చారు. ఇక తాజాగా మూడు రాజధానులకు ఏపీ అసెంబ్లీలో చర్చ సందర్భంగా మద్దతు తెలుపుతానని చెప్పారు.

జగన్ కు జై కొడుతున్న ఏకైక జనసేన ఎమ్మెల్యే

జగన్ కు జై కొడుతున్న ఏకైక జనసేన ఎమ్మెల్యే

తమ అధినేత పవన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జగన్ కు మద్దతు తెలుపుతానని తాజాగా జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద తెలిపారు.ఈ పరిణామం జనసేనకు ఏ మాత్రం మింగుడుపడటం లేదు . ఓ వైపు జనసేన సీఎం జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పోరాటం మొదలు పెడుతుంటే ఆయన పార్టీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే మాత్రం సీఎం జగన్ కు మద్దతు ఇస్తానని చెప్పటం జనసేన వర్గాలను షాక్ కు గురిచేసింది.

English summary
Today Janasena MLA Rappaka Varaprasad told AP Assembly Media Point that he would support Jagan's decision and oppose to Pawan's decision. This is a shock for Janasena. He stated that CM Jagan's three capitals decision is correct and he will support to the government as a MLA .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X