అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

'రాజధానిపై చంద్రబాబు మాయల పకీర్ వేషాలు మానుకోవాలి'

By Srinivas
|
Google Oneindia TeluguNews

విజయవాడ: ఏపీ సీఎం చంద్రబాబు మాయలఫకీర్ వేషాలు మానుకోవాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తులసి రెడ్డి శనివారం నాడు హెచ్చరించారు. రాష్ట్ర విభజన చట్టంలో రాజ్ భవన్, సచివాలయం, శాసనమండలి, ముఖ్యమంత్రి కార్యాలయం, హైకోర్టు, పరిపాలనాపరమైన భవనాలు, రోడ్లు ఇతర మౌలిక సదుపాయాలను కేంద్రమే నిర్మిస్తుందని స్పష్టంగా పేర్కొందన్నారు.

విభజన చట్టంలో ఉన్నదానిని వదిలేసి, మీరు చేస్తున్నదేమిటని ప్రశ్నించారు. వీటన్నింటినీ పక్కన పడేసిన చంద్రబాబు సింగపూర్ కంపెనీతో మాస్టర్ ప్లాన్ అంటూ రూ.15 కోట్ల చెల్లించారని, భవనాల డిజైన్ల కోసం జపాన్‌కు చెందిన మాకీ కంపెనీకి రూ.97.50 లక్షల చెల్లించారన్నారు. రాజధానికి నిధుల సేకరణ ఎలా చేయాలన్న సలహా ఇచ్చినందుకు రూ.112 కోట్ల చెల్లించేందుకు సన్నాహాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.

ఒక రాజధానికి భూమిపూజ, శంకుస్థాపన, ఇతర పూజలు, భూసేకరణ... అంటూ చంద్రబాబు టక్కుటమార గజకర్ణగోకర్ణ విద్యలన్నీ ప్రదర్శిస్తున్నారన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఇలాంటి చీప్ ట్రిక్స్ కు పాల్పడుతున్నారని ఆయన విమర్శించారు. కాగా, రాజధాని అమరావతి నిర్మాణానికి జపాన్ సంస్థ డిజైన్స్‌ను ఖరారు చేసిన విషయం తెలిసిందే.

 అమరావతి

అమరావతి

అమరావతిలో నిర్మించబోయే భవనాలు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా, అత్యంత సౌకర్యవంతంగా, ఆకర్షణీయంగా, పర్యావరణానుకూలంగా, రాష్ట్ర సంస్క్రతిని ప్రతిభింభించేవిగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నారు. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం గ్లోబల్ టెండర్లను పిలువగా భారత్‌కుచెందిన ప్రముఖ ఆర్కిటెక్ట్ డీవీ జోషి, బ్రిటన్‌కు చెందిన రిచర్డ్ రోజస్, జపాన్‌కు చెందిన మాకి అండ్ అసోసియేట్స్ డిజైన్లు సమర్పించాయి.

 అమరావతి

అమరావతి

వాటిలో ఏపీ రాష్ట్రానికి అత్యంత అనుకూలంగా ఉన్న డిజైన్‌ని ఎంపిక చేసేందుకు ప్రభుత్వం ఆరుగురు సభ్యులతో కూడిన ఒక నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసింది. వారిలో ముగ్గురు విదేశీయులు ముగ్గురు భారతీయులు సభ్యులుగా ఉన్నారు.

 అమరావతి

అమరావతి

వారిలో సుహాజ్‌ ఓల్టా, ఇర్విన్‌, క్రిస్టోఫర్‌ విదేశీ నిపుణులు కాగా రవీంద్ర నాథ్, కేశవా వర్మ, రాజీవ్ సేథిలు భారత్‌కి చెందినవారు. వారు జపాన్ సంస్థ రూపొందించిన డిజైన్లను ఖరారు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు, సీఆర్డీఏ అధికారులకు కూడా అది నచ్చింది.

 అమరావతి

అమరావతి

శుక్రవారం విజయవాడ గేట్ వే హోటల్లో ముఖ్యమంత్రి అధ్యక్షతన నిర్వహించిన సమీక్షా సమావేశం అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విషయాన్ని మీడియాకు తెలిపారు.

English summary
The jury members appointed for Amaravati capital design selected the design submitted by Maki and Associates of Japan. Announcing this at a press conference on Friday the AP CM Chandrababu said that three architects participated in the final competition including Richard Rogers of Rogers Stirk Harbour and Partners, UK, BV Doshi of Vastu Shilpa consultants, India and Fumihiko Maki of Maki and associates, Japan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X