వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జ‌షిత్ క‌ధ సుఖాంతం: నాలుగు రోజుల‌ ఉత్కంఠ‌కు తెర‌: కిడ్నాప‌ర్లు ఎలా వ‌దిలేసారంటే..!

|
Google Oneindia TeluguNews

Recommended Video

క్షేమంగా త‌ల్లి తండ్రుల వ‌ద్ద‌కు చేరుకున్న జషిత్‌ || Jashith Safely Return Back To His Parents

రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన నాలుగేళ్ల చిన్నారి జషిత్‌ కిడ్నాప్‌ కథ సుఖాంతం అయింది. నాలుగు రోజుల ఉత్కంఠ కు తెరదించుతూ జ‌షిత్ త‌ల్లి తండ్రుల వ‌ద్ద‌కు చేరాడు. కిడ్నాపర్ల బారి నుంచి జషిత్‌ క్షేమంగా బయటపడ్డారు. కుతు కులూరు రోడ్డులో జషిత్‌ను కిడ్నాపర్లు వదిలివెళ్లారు. బాలుడిని గమనించిన కూలీలు పోలీసులకు సమాచారం ఇచ్చా రు. పోలీసులు జ‌షిత్‌ను త‌ల్లి దండ్రుల‌కు అప్ప‌గించారు. దీంతో..జ‌షిత్ కుటుంబ స‌భ్యులు ప‌ట్ట‌రాతి సంతోషంలో మునిగిపోయారు. అయితే జ‌షిత్ మాత్రం తాను ఆడుకున్నాన‌ని...తీసుకెళ్లార‌ని వ‌చ్చీ రాని మాట‌ల‌తో చెబుతున్నాడు. కిడ్నాప‌ర్ల‌ను ప‌ట్టుకుంటామ‌ని జిల్లా పోలీసులు స్ప‌ష్టం చేసారు.

త‌ల్లి దండ్రుల వ‌ద్ద‌కు క్షేమంగా జ‌షిత్‌..

త‌ల్లి దండ్రుల వ‌ద్ద‌కు క్షేమంగా జ‌షిత్‌..

తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన బాలుడు జషిత్‌ కథ సుఖాంతంగా ముగిసింది. కిడ్నాపర్ల బారి నుంచి జషిత్‌ క్షేమంగా బయటపడ్డారు. కుతుకులూరు రోడ్డులో జషిత్‌ను కిడ్నాపర్లు వదిలివెళ్లారు. బాలుడిని గమనించిన కూలీలు పోలీసుల కు సమాచారం ఇచ్చారు. సోమవారం రాత్రి ఇంటి వద్దే జషిత్‌ను దుండగులు కిడ్నాప్‌ చేశారు. అయితే, కుతుకులూరు చింతాలమ్మ గుడివద్ద బాలున్ని కిడ్నాపర్లు గురువారం తెల్లవారుజామున వదిలి వెళ్లారు. దీంతో అక్క‌డ‌కు చేరుకున్న పోలీసులు జ‌షిత్‌ను తీసుకొని త‌ల్లి తండ్రుల‌కు అప్ప‌గించారు. మండపేటలో ఈ నెల 21న కిడ్నాప్‌నకు గురైన జసిత్‌ ఆచూకీ కోసం 500 మంది పోలీసులు 17 ప్రత్యేక బృందాలుగా రెండు రోజుల నుంచి జల్లెడ ప‌ట్టారు. స్వ‌యంగా జిల్లా ఎస్పీ ఈ కేసును వ్య‌క్తిగ‌తంగా ప‌ర్య‌వేక్షించ‌టంతో..జిల్లా మొత్తంగా పోలీసు శాఖ అప్ర‌మ‌త్తంగా వ్య‌వ‌హ‌రించింది. దీంతో.. పోలీసులు ముమ్మర గాలింపు చర్యలతో బెదిరిపోయిన దుండగులు ఎట్టకేలకు జసిత్‌ను విడిచిపెట్టినట్టు చెబుతు న్నారు. ఇక త‌మ కుమారుడిని చూసిన త‌రువాత ఆ త‌ల్లి దండ్రుల్లో సంతోషం వ్య‌క్తం అయింది.

త‌ల్లిదండ్రుల భావోద్వేగం...

జషిత్‌ తల్లిదండ్రులిద్దరూ బ్యాంకు ఉద్యోగులే. జషిత్‌ తండ్రి మండపేట యూనియన్‌ బ్యాంకులో అసిస్టెంట్‌ మేనేజర్ గా నూక వెంకటరమణ పనిచేస్తున్నారు. తల్లి నాగవళి కెనరా బ్యాంకు ఉద్యోగి. వీరికి 2014లో పెళ్లియింది. ఏడాది తరు వాత ఈ దంపతులకు జషిత్‌ జన్మించాడు. వీరికి 2014లో పెళ్లియింది. ఏడాది తరువాత ఈ దంపతులకు జషిత్‌ జన్మిం చాడు. డ‌పేట‌లోని ఇంటి వ‌ద్దే నాలుగు రోజుల క్రితం జషిత్‌ను దుండగులు కిడ్నాప్‌ చేశారు. సోమ‌వారం రాత్రి బైక్ మీద వ‌చ్చిన ఇద్ద‌రు విద్యుత్ స‌ర‌ఫ‌రా నిలిచ‌న స‌మ‌యంలో వ‌చ్చి..క‌రెంట్ లేదా అని ప్ర‌శ్నించారు. మెట్ల మీద జ‌శంత్‌తో ఉన్న నాయనమ్మ పార్వతిపై దాడి చేసి బాలుడిని ఎత్తుకెళ్లారు. ఆ వెంట‌నే వారు పోలీసుల‌కు ఫిర్యాదు చేసారు. పోలీసులు విచార‌ణ చేస్తున్న స‌మ‌యంలోనే జషిత్ క్షేమంగా తిరిగి రావాల‌ని ఆకాంక్షిస్తూ వేలాది మంది నెట్‌జన్లు సోషల్‌మీడియాలో బాబు ఫొటో షేర్‌ చేస్తూ తమ వంతుగా సహకరించారు. జషిత్‌ క్షేమంగా బయటపడడంతో తల్లిదండ్రుల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. బాలుడి ఆచూకి తెలియగానే ఒక్కసారి భావోద్వేగానికి గురయ్యారు. జషిత్‌ క్షేమంగా ఉండడంతో పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు.

ఉచ్చులో చిక్కుకున్న కిడ్నాప‌ర్లు...

ఉచ్చులో చిక్కుకున్న కిడ్నాప‌ర్లు...

ఖ‌చ్చితంగా ఇది బాగా తెలిసిన వారి ప‌నేన‌ని పోలీసులు అనుమానిస్తున్నారు. జ‌షిత్ నివాసంలోని సీసీ కెమేరాల ద్వారా గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు కిడ్నాప్ చేసిన‌ట్లు గుర్తించారు. అయితే, వారు ఖ‌చ్చితంగా జిషిత్ కుటుంబం గురించి పూర్తిగా అవ‌గాహ‌న ఉన్న‌వారేనంటూ...ఇద్ద‌రు అనుమానితుల పైన దృష్టి పెట్టారు. ఈ కిడ్నాప్ వ్య‌వహారం పూర్తిగా ప్ర‌ణాళికాబ‌ద్దంగానే వ్య‌వ‌హ‌రించార‌ని పోలీసులు అంచనా వేస్తున్నారు. అయితే పోలీసు శాఖ ఈ వ్య‌వ‌హారాన్ని ప్ర‌తి ష్ఠాత్మ‌కంగా తీసుకోవ‌టంతో త‌ప్పించుకోలేని ప‌రిస్థితుల్లో కిడ్నాప‌ర్లు బాలుడిని వ‌దిలివేసిన‌ట్లు క‌నిపిస్తోంది. అయితే,
ఏది ఏమైనా జ‌షిత్ తిరిగి క్షేమంగా రావ‌టంతో త‌ల్లి దండ్రులే కాదు.. మొత్తం తెలుగు ప్ర‌జ‌లు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. జ‌షిత్ క్షేమంగా తిరిగి వ‌చ్చినా..కిడ్నాప‌ర్ల‌ను మాత్రం వ‌దిలేది లేద‌ని జిల్లా ఎస్పీ స్ప‌ష్టం చేసారు.

English summary
Jashith safely return to his parents in Mandapaeta. Four days back boy kidnapped in his house after that police special teams started searching. Last late night kidnappers released Jshanth near a temple
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X