• search
  • Live TV
శ్రీకాకుళం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

JAWAD CYCLONE: వర్షాలు మొదలు -కేంద్రం అప్రమత్తం : రంగంలోకి సహాయక బృందాలు..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

ఏపీతో పాటుగా ఒడిశా..పశ్చిమ బెంగాల్ లోని పలు జిల్లలను వణికిస్తున్న జవాద్ తుఫాను పైన కేంద్రం అప్రమత్తమైంది. రాష్ట్ర ప్రభుత్వాలకు పలు సూచనలు చేస్తోంది. సహాయక బృందాలను సిద్దం చేసింది. నేవి..వైమానిక హెలికాప్టర్లను అందుబాటులో ఉంచింది. తాజా పరిస్థితులను కేంద్రం సమీక్షించింది. ప్రాణ నష్టానికి అవకాశం లేకుండా.. ఆస్తి నష్టాన్ని తగ్గించడానికి అవసరమైన అన్ని చర్యలను చేపట్టాలని కేంద్ర, రాష్ట్ర విపత్తు నిర్వహణ బలగాలకు ఆదేశించింది. తుఫాను శనివారం ఉదయం నాటికి ఉత్తర ఆంధ్రప్రదేశ్​, ఒడిశా తీరాన్ని తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

కేంద్రం సమీక్ష...కలక సూచనలు

కేంద్రం సమీక్ష...కలక సూచనలు

కేంద్ర కేబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబా ఏపీ, ఒడిశా రాష్ట్రాల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.సముద్రంలో ఉన్న మత్స్యకారులు, వారి ఓడలను సంబంధిత సమాచారాన్ని సేకరించాలని దిశానిర్దేశం చేశారు. మరో వైపు ఏపీ ముఖ్యమంత్రి జగన్ సైతం ఇప్పటికే కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. సహాయ కార్యక్రమాలు, పనుల కోసం తుపాన్‌ ప్రభావిత జిల్లాలకు రూ.10 కోట్ల చొప్పున నిధులు అందుబాటులో ఉంచాలని ఏపీ సీఎం జగన్ సూచించారు. శ్రీకాకుళం జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. తీరం వెంబడి గంటకు 45-55 కిమీ వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి.

రంగంలోకి సహాయక బృందాలు

రంగంలోకి సహాయక బృందాలు

అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని ప్రజలకు అధికారులు హెచ్చరికలు జారీచేశారు. తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పర్యటిస్తున్నాయి. సహాయక చర్యల కోసం ఉత్తరాంధ్రకు 11ఎన్డీఆర్‌ఎఫ్‌, 3 ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలతో పాటు, మరో 4బృందాలు అందుబాటులో ఉన్నాయన్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఆహారం, నీరు, మందులతోపాటు ఇతర నిత్యవసర వస్తువుల సరఫరా దృష్టి సారించాలని కేంద్రం సూచించింది.విద్యుత్​, రోడ్లుతో పాటు అత్వసర సేవలను పునరుద్ధరించేందుకు సంబంధిత బృందాలను సంసిద్ధంగా ఉంచాలని పేర్కొంది.

శ్రీకాకుళంలో కురుస్తున్న వర్షాలు

శ్రీకాకుళంలో కురుస్తున్న వర్షాలు

తుపాను తీరం చేరే క్రమంలో భారీ నుంచి అతి భారీ వర్షాలతో పాటు 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వ మార్గదర్శకాలను తప్పకుండా పాటించాలని అధికారులు సూచించారు. తుఫాన్‌ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలోని 12 తీరప్రాంత మండలాల్లోని 237 లోతట్టు గ్రామాల ప్రజలను ముందస్తుగా పునరావాస కేంద్రాలకు తరలించేందుకు చర్యలు చేపట్టారు. జవాద్‌ తుఫాన్‌ నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా కొన్ని విభాగాల్లో శుక్రవారం అర్ధరాత్రి నుంచి ఉత్పత్తి తగ్గించాలని విశాఖ స్టీల్‌ప్లాంట్‌ యాజమాన్యం నిర్ణయించింది.

IND VS NZ 2nd Test : KS Bharat Can Be The Trump Card For Virat Kohli || Oneindia Telugu
ప్రధాని మోదీ..సీఎం జగన్ సమీక్షలు

ప్రధాని మోదీ..సీఎం జగన్ సమీక్షలు


ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంతో పాటు దక్షిణ ఒడిసాకు 'జవాద్‌' తుఫాన్‌ ముప్పు పొంచి ఉందని భారత వాతావరణ విభాగం డైరెక్టర్‌ జనరల్‌ ఎం.మహాపాత్ర తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆరో తేదీ నాటికి ఏపీ, ఒడిసా, పశ్చిమబెంగాల్‌, అసోం, మేఘాలయ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయన్నారు. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. కాగా, తుఫాన్‌ ప్రభావానికి గురయ్యే ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుని ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా చూడాలని ప్రధాని మోదీ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఏపీతో పాటు ఒడిసా, పశ్చిమ బెంగాల్‌కు తుఫాన్‌ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాలకు 64 బృందాలను పంపనున్నట్టు ఎన్‌డీఆర్‌ఎఫ్‌ డైరెక్టర్‌ జనరల్‌ అతుల్‌ కర్వాల్‌ వెల్లడించారు.

English summary
The rains started with the impact of Hurricane Jawad and the central government became alert and issued instructions to the states. Support teams are ready.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X