jayalalithaa telugu vidyasagar rao apollo hospitals narendra modi aiadmk o panneerselvam tamil nadu జయలలిత అన్నాడీఎంకే తమిళనాడు విద్యాసాగర రావు వెంకయ్య నాయుడు అపోలో ఆసుపత్రి
'తెలుగు'తో అనుబంధం: తమిళ అసెంబ్లీలో ఆశ్చర్యపరిచిన జయలలిత
చెన్నై: దివంగత జయలలితకు తమిళం మాత్రమే కాకుండా తెలుగుపై కూడా మమకారం ఎక్కువే. తెలుగు సినిమాలతో ఆమెకు విడదీయరాని అనుబంధం ఉంది. ఆమె పాతిక తెలుసు సినిమాల్లో నటించారు. తమిళనాడు శాసన సభలో తెలుగు కూడా మాట్లాడి అందర్నీ ఆశ్చర్యపరిచారు.
హోసూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా గోపీ వ్యవహరించినప్పుడు తెలుగు ప్రజల సంక్షేమం గురించి ప్రసంగించారు. ఆయనకు జయలలిత ఆనాడు తెలుగులోనే సమాధానం ఇచ్చారు. తమిళనాడులో తెలుగు భాష పరిరక్షణ గురించి ఆమె స్పందించారు.

అన్ని భాషలను కాపాడటానికి మేం సిద్ధంగా ఉన్నామని, అందుకు ఏం చెయ్యాలో మీరే చెప్పాలని జయలలిత తెలుగులో మాట్లాడారు. దీంతో సభలోని వారంతా ఆశ్చర్యపోయారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఇతర భాష విద్యార్థులు తెలుగు నేర్చుకుంటున్నారని, అలాంటప్పుడు తమిళనాడులోని ఇతర భాష విద్యార్థులు తమిళంలో చదువుకోవడంలో ఏమాత్రం తప్పులేదని జయలలిత కౌంటర్ ఇచ్చారు. అంతేకాదు, విలేకరుల సమావేశంలో తెలుగులో ఎవరైనా తెలుగులో అడిగితే తెలుగులో సమాధానం ఇచ్చిన సందర్బాలు కూడా ఉన్నాయి.