హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జెఎఫ్‌సి మీటింగ్: మాపై ఎక్కువ ఆశలొద్దు, ఆకాశానికెత్తి పడేయొద్దు: జెపి ఆసక్తికరం

By Narsimha
|
Google Oneindia TeluguNews

Recommended Video

JFC : Pawan Kalyan says Many Are Showing Interest To Work

అమరావతి: మాపై ఎక్కువ ఆశలు పెట్టుకోవద్దని లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాష్ నారాయణ .శుక్రవారం నాడు జయప్రకాష్ నారాయణ అభిప్రాయపడ్డారు. ఏపీకి రావాల్సిన నిధుల విషయమై ఈ సమావేశంలో చర్చించనున్నారు. భవిష్యత్ కార్యాచరణను కూడ సిద్దం చేయనున్నారు.

ఏపీ రాష్ట్రానికి కేంద్రం నుండి వచ్చిన నిధుల విషయాన్ని లెక్క తేల్చేందుకు జెఎఫ్‌సిలో జయప్రకాష్ నారాయణ కీలకంగా వ్యవహరిస్తున్నారు.జెఎఫ్‌సి సమావేశానికి ముందు లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాష్ నారాయణ శుక్రవారం నాుడ మీడియాతో చిట్ చాట్ చేశారు. రెండు రోజుల పాటు జెఎప్‌సి సమావేశాలు హైద్రాబాద్‌లో జరుగుతున్నాయి.

ఈ సమావేశంలో ఏపీ రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన హమీల అమలు, భవిష్యత్‌లో చేపట్టాల్సిన కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.

ఎక్కువ ఆశలు పెట్టుకోవద్దు

ఎక్కువ ఆశలు పెట్టుకోవద్దు

ఏపీ రాష్ట్రానికి నిధుల విషయమై ప్రస్తుతం ఏపీ రాష్ట్రంలో అన్ని పార్టీలు కేంద్రం తీరును తప్పుబడుతున్నాయి. ఈ తరుణంలో జెఎప్‌సి సమావేశం ప్రాధాన్యతను సంతరించుకొంది. అయితే తమపై ఎక్కువ ఆశలు పెట్టుకోవద్దని లోక్‌సత్తా వ్యవస్థాపకులు జయప్రకాష్ నారాయణ అభిప్రాయపడ్డారు.

జగన్‌ ఎఫెక్ట్‌: గందరగోళంలో టిడిపి, అందుకే 'ఆది'ని నిలువరించారా?జగన్‌ ఎఫెక్ట్‌: గందరగోళంలో టిడిపి, అందుకే 'ఆది'ని నిలువరించారా?

ఆకాశానికి ఎత్తి పడేయొద్దు

ఆకాశానికి ఎత్తి పడేయొద్దు

తమను ఆకాశినికి ఎత్తి పాతాళానికి పదేయకూడదని లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాష్‌ నారాయణ అభిప్రాయపడ్డారు.ఏపీకి వచ్చే నిధుల విషయంలో జరుగుతున్న అన్యాయంపై పోరాటంలో తమ వంతు ప్రయత్నం చేస్తామని జేపీ స్పష్టం చేశారు.ఏపీకి రావాల్సిన న్యాయమైన వాటా విషయంలో మేధావులు, న్యాయనిపుణులతో చర్చించనున్నట్టు చెప్పారు.

జగన్‌కు కౌంటర్: మార్చి 5నే టిడిపి ఎంపీల రాజీనామా, బిజెపితో కటీఫ్: ఆదిజగన్‌కు కౌంటర్: మార్చి 5నే టిడిపి ఎంపీల రాజీనామా, బిజెపితో కటీఫ్: ఆది

పవన్ ఏం చేస్తారు

పవన్ ఏం చేస్తారు

ఏపీ రాష్ట్రంలో అధికార టిడిపి, విపక్ష వైసీపీలు రాజకీయంగా ఒకరిపై మరోకరు ఆధిపత్యం సాధించేందుకు ప్రయత్నాలను ప్రారంభించాయి. ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలనే డిమాండ్‌తో రాజకీయపరమైన ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే రాజకీయంగా ఒక పార్టీపై మరో పార్టీ ప్రయత్నాలను చేస్తున్నాయి అదే సమయంలో జెఎప్‌సి ఏర్పాటుతో పవన్ కళ్యాణ్ ఏం చేస్తారనేది ప్రస్తుతం ఆసక్తిగా మారింది. రెండు రోజుల పాటు పవన్ కళ్యాణ్ పలువురు నేతలతో సమావేశాన్ని నిర్వహిస్తున్నారు.ఈ సమావేశంలో ఏపీకి న్యాయం జరిగేలా పోరాట కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

ఇక తాడోపేడో, మార్చి 5న బాబు కీలక నిర్ణయం: పత్తిపాటి ఇక తాడోపేడో, మార్చి 5న బాబు కీలక నిర్ణయం: పత్తిపాటి

జెఎసి ఏర్పాటు చేసి ఆందోళలనలు

జెఎసి ఏర్పాటు చేసి ఆందోళలనలు

ఏపీ రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై కేంద్రంపై మరింత ఒత్తిడిని తెచ్చేందుకుగాను జెఎసిని ఏర్పాటు చేసి ఆందోళన కార్యక్రమాలపై ఫిబ్రవరి 17వ, తేదిన స్పష్టత వచ్చే అవకాశం ఉందని జనసేన వర్గాలు చెబుతున్నాయి.

English summary
Loksatta founder president Jayaprakashnarayana intresting comments on JFC at Hyderabad on Friday.He was chit chat with media on Friday before JFC meeting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X