హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపీకి కేంద్ర బడ్జెట్‌లో అన్యాయం: జేపీ దీక్షలు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రాష్ట్ర విభజనతో నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగిన నష్టంపై ప్రజాభిప్రాయాన్ని కూడగట్టే నిమిత్తం లోక్‌సత్తా పార్టీ వ్వవస్ధాపక అధ్యక్షుడు డాక్టర్. జయప్రకాశ్ నారాయణ్ ఉద్యమ బాట పట్టారు. అనంతపురం, విశాఖపట్నం, విజయవాడల్లో బలమైన ప్రజా ఉద్యమం కోసం దీక్షలు చేసేందుకు సిద్ధమయ్యారు.

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్, అనంతరం చేసిన ప్రకటనలపై ప్రజాగ్రహం వ్యక్తమవుతోందని, ఈ నేపథ్యంలో ఏపీకి న్యాయం జరిగేంత వరకు లోక్ సత్తా పార్టీ పోరాటం చేస్తుందని జేపీ ప్రకటించారు.

Jayaprakash Narayan is ready to do deeksha for Andhra Pradesh

రాష్ట్రాభివృద్ధిపై కేంద్రపై ఒత్తిడి తీసుకురావడంలో భాగంగా మార్చి 3న అనంతపురం, 5న విశాఖపట్నం, 8న విజయవాడలో తాను నిరాహారదీక్షలు చేస్తున్నట్లు జేపీ ప్రకటించారు. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రేదశ్‌కు జరిగిన తీవ్ర అన్యాయంపై అన్ని రాజకీయ పార్టీలు స్తబ్దుగా ఉన్న సమయంలో కేవలం లోక్‌సత్తా పార్టీ ఒక్కటే ప్రజల పక్షాన నిలిచి పోరాటం చేస్తుందని గుర్తు చేశారు.

English summary
Jayaprakash Narayan is ready to do deeksha for Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X