వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్‌పార్టీ దాడి: జయసుధ ఫిర్యాదు, టి న్యూస్‌పై శ్రవణ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కాంగ్రెసు పార్టీ సికింద్రాబాద్ అసెంబ్లీ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే జయసుధ శనివారం తన పైన దాడికి ప్రయత్నించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు తమ కాన్వాయ్ పైన దాడికి యత్నించారని, చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మెట్టుగూడ నుండి వస్తుండగా ఈ సంఘటన జరిగిందని చెప్పారు.

అంతకుముందు జయసుధ కాన్వాయ్ పైన శనివారం ఉదయం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు దాడి చేసిన విషయం తెలిసిందే. సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న జయసుధ జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆమె మెట్టుగూడలో ఉదయం ప్రచారం ప్రారంభించారు.

Jayasudha complaints on attack

ఆమె ప్రచారం చేస్తున్న సమయంలో పలువురు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు జయసుధ వాహనం పైన దాడికి పాల్పడ్డారు. దీంతో ఒక్కసారిగా నిశ్చేష్టురాలైన జయసుధ.. తన ప్రచారాన్ని అర్ధాంతరంగా నిలిపివేసి అక్కడి నుండి ఇంటికి వెళ్లిపోయారు. పోలీసులు దాడికి పాల్పడ్డ వారిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు దాడి చేసిన వారని అదుపులోకి తీసుకున్నారు. ఈ సమయంలో జయసుధ డ్రైవర్ పైన జగన్ పార్టీ నాయకులు ఒకరు చేయి చేసుకున్నారు.

తెరాసపై శ్రవణ్ ఫైర్

తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ కుమార్ మరోసారి నిప్పులు చెరిగారు. టి న్యూస్ ఉద్యోగులకు పిఎఫ్ కూడా ఇవ్వని కెసిఆర్ ఉద్యోగుల భద్రతను ఎలా కాపాడతారని ప్రశ్నించారు. టి న్యూస్ చానెల్ జర్నలిజం విలువలను దిగజార్చిందన్నారు. టి న్యూస్ ప్రసారం చేస్తున్న వార్తలను పెయిడ్ ఆర్టికల్స్‌గా పరిగణనించాలని ఈసిని కోరారు. తెరాస అసలైన ఉద్యమకారులకు టికెట్లు ఇవ్వలేదన్నారు. కష్టపడ్డ వారికి టిక్కెట్లు ఇవ్వకుండా మోసం చేసిందన్నారు.

English summary
Secunderabad Congress MLA candidate Jayasudha complaints on attack.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X