వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మూడేళ్లు సరిపోదు: నిర్భయ కేసుపై జయసుధ

By Pratap
|
Google Oneindia TeluguNews

Jayasudha
హైదరాబాద్: నిర్భయ కేసులో నలుగురు దోషులకు కోర్టు ఉరిశిక్ష విధించడాన్ని సికింద్రాబాద్ కాంగ్రెసు శానససభ్యురాలు, నటి జయసుధ స్వాగతించారు. ఢిల్లీ సామూహిక అత్యాచారం కేసులో మైనర్ దోషికి మూడేళ్లు శిక్ష విధించడం సరిపోదని ఆమె అన్నారు. సికింద్రాబాదులోని తన కార్యాలయంలో ఆమె శుక్రవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.

సుప్రీంకోర్టులో కూడా దోషులకు అదే శిక్ష ఖరారయ్యే విధంగా కేంద్ర ప్రభుత్వం చొరవ చూపి న్యాయకోవిదుల సహకారాన్ని పొందాలని ఆమె కోరారు. మహిళలపై అత్యాచారాలకు పాల్పడేవారిపై కఠిన చరయ్లు తీసుకోవడం ద్వారా మాత్రమే ఇటువంటి నేరాలు అదుపులోకి వస్తాయని, అటువంటి నేరాలు పునరావృతం కావని ఆమె అన్నారు.

నిర్బయ కేసులో దోషులకు ఉరిశిక్ష విధించడాన్ని రాష్ట్ర మంత్రి డికె అరుణ కూడా స్వాగతించారు. దోషులకు వెంటనే శిక్ష అమలు జరిగేలా చూడాలని ఆమె కోరారు. నిర్భయ కేసులో దోషులనను బహిరంగంగా ఉరి తీస్తే ద్రోహులకు కనువిప్పు కలుగుతుందని తెలుగు మహిళ అధ్యక్షురాలు శోభా హైమవతి అభిప్రాయపడ్డారు.

నిర్భయ కేసులో న్యాయస్థానం తీర్పును ఆమె స్వాగతించారు. రాష్ట్రంలో నిర్భయ చట్టం సక్రమంగా అమలు కావడం లేదని ఆమె శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. నిర్భయ చట్టం అమలులోకి వచ్చిన తర్వాత కూడా రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు తగ్గకపోవడానికి అదే కారణమని ఆమె అన్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి మహిళలపై అత్యాచారాల కేసులను సత్వరమే పరిష్కరించాలని ఆమె డిమాండ్ చేశారు.

English summary
Actress and Congress Secendurabad MLA Jayasudha invited the Saketh court judgement in Delhi gang rape case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X