వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోహన్ బాబు, జయసుధ , జీవిత ,ఆలీలలో ఆ పదవి ఎవరికో ? జగన్ నిర్ణయం ఏంటో ?

|
Google Oneindia TeluguNews

Recommended Video

AP నామినేటెడ్ పోస్ట్ ల కోసం... సినీ పెద్దల మధ్య తీవ్ర పోటీ!! | Mohan Babu | Jayasudha | Ali

ఇప్పుడు వైసీపీలో నామినేటెడ్ పోస్ట్ ల కోసం పోటీ నెలకొంది. టీడీపీ హయాంలో ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్‌‌గా చేసిన అంబికా క్రిష్ణ ఇటీవల రాజీనామా చేయడంతో ఇప్పుడు ఆ పదవిపై చాలా మంది సినీ ప్రముఖుల దృష్టి పడింది. ముఖ్యంగా మోహన్ బాబు, జయసుధ, జీవిత, ఆలీ వంటి సినీ ప్రముఖులు ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్‌ రేసులో ఉన్నారు. అయితే జగన్ ఈ పదవికి ఎవరైతే సరిపోతారో ఆచి తూచి నిర్ణయం తీసుకోనున్నారు.

జగన్ గెలుపు కోసం పని చేసిన సినీ ప్రముఖులు .. జగన్ టీం లో కీలక పదవి కోసం పోటీ

జగన్ గెలుపు కోసం పని చేసిన సినీ ప్రముఖులు .. జగన్ టీం లో కీలక పదవి కోసం పోటీ

‘2019 ఎన్నికల్లో జగన్ ఖచ్చితంగా సీఎం అవుతారు' అని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఎన్నికలకు ముందు వైసీపీ పార్టీలో జాయిన్ అయ్యారు సినీ నటి జయసుధ. ఒక్క జయసుధ మాత్రమే కాదు జీవితా రాజశేఖర్, మోహన్ బాబు ,ఆలీవంటి సినీ ప్రముఖులు కూడా వైసీపీలో జాయిన్ అయ్యారు. పృథ్వీ, పోసాని, హేమ, రాజా రవీంద్ర, భాను చందర్, కృష్ణుడు, శ్యామల ఇలా చాలా మంది వైసీపీ తరుపున ప్రచారం చేశారు. అన్నట్టుగానే వైసీపీ విజయం సాధించింది. జగన్ సీఎం అయ్యారు. దీంతో జగన్ టీంలో కీలక పదవి కోసం వీరంతా పోటీ పడుతున్నారు. ఇప్పుడు ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పోరేషన్ చైర్మన్ గా ఎవరికి అవకాశం ఇస్తారు అన్న దానిపై ఏపీలోని రాజకీయ వర్గాల్లో, సినీ పరిశ్రమలో ఆసక్తికర చర్చ సాగుతుంది.

ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పోరేషన్ చైర్మన్ గా పోటీలో జయసుధ, మోహన్ బాబు, జీవిత, ఆలీలు

ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పోరేషన్ చైర్మన్ గా పోటీలో జయసుధ, మోహన్ బాబు, జీవిత, ఆలీలు

ఇక వైసీపీ పార్టీ బలోపేతానికి ప్రయత్నిస్తా. ప్రత్యేకించి ఎక్కడ నుండి పోటీ చేయాలనుకోవడం లేదని చెప్పి జగన్ ఆదేశానుసారం పార్టీకి సేవచేస్తా అని ఈ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న జయసుధ జగన్ గెలుపుతో నామినేటెడ్ పదవిని ఆశిస్తున్నారు.అయితే ఈ పదవికి జయసుధతో పాటు చాలా మంది ఇండస్ట్రీ నటులు పోటీ పడుతున్నారు. గత ఎన్నికల్లో జయసుధతో పాటు.. మోహన్ బాబు, జీవిత, రాజశేఖర్, వీరిలో జయసుధ, మోహన్ బాబు, జీవిత, రాజశేఖర్‌లు నామినేటెడ్ పోస్ట్‌లు ఆశిస్తున్నవారిలో ఉన్నారు. వీరంతా పార్టీ కోసం బాగానే పని చేశారు. మోహన్ బాబు, జీవితా రాజశేఖర్ ప్రచారంలో దూసుకుపోయారు. పోసాని కృష్ణ మురళి, పృధ్వీ , హేమ వంటి వారు సైతం చాలా సపోర్ట్ చేశారు. జీవితా రాజశేఖర్ విషయంలో జగన్ ఏ నిర్ణయం తీసుకోలేదు. అందుకు కారణాలు లేకపోలేదు. ఇక మోహన్ బాబు విషయానికి వస్తే మొదట మోహన్ బాబు టీటీడీ చైర్మన్ గా పోటీలో ఉన్నారని ప్రచారం జరిగింది. ఇక తాజాగా ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పోరేషన్ చైర్మన్ బరిలో ఉన్నారని చెప్తున్నా మోహన్ బాబుకు టూరిజం ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.

జయసుధ వైపే జగన్ మొగ్గు .. ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పోరేషన్ చైర్మన్ గా జయసుధ కే ఎక్కువ అవకాశం

జయసుధ వైపే జగన్ మొగ్గు .. ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పోరేషన్ చైర్మన్ గా జయసుధ కే ఎక్కువ అవకాశం

ఇక జయ సుధ విషయంలోనే జగన్ సానుకూలంగా ఉన్నట్టు సమాచారం. గతంలో ‘మా' ఎన్నికల్లో పోటీ చేసిన అనుభవంతో పాటు వైఎస్ హయాంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పనిచేయడం ఆమె కు ప్లస్. ఇండస్ట్రీ పెద్దలతో ప్రత్యేక అనుబంధం ఉండటంతో పాటు ఎలాంటి కాంట్రవర్సీలు లేకుండా పని చేసే నేత కాబట్టి ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్‌ పదవికి జయసుధ అయితే బావుంటుందనే అభిప్రాయంలో ఉన్నారట జగన్. జయసుధ ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్‌ గా అవకాశం జగన్ కల్పిస్తారో లేదో త్వరలోనే తెలియనుంది.

English summary
Many celebrities including the likes of Mohan Babu, Ali, Jayasudha, Jeevitha and Rajasekhar, Prithvi and others have canvassed for YS Jagan in the elections. Then the likes of Kona Venkat, Chinni Krishna and Posani Krishnamurali gave their superior support through media meets. Guess what, only one of them will get rewarded now.Apparently, Andhra Pradesh CM YS Jagan is looking forward to appointing a popular celebrity as the chairman of Andhra Pradesh Film Development Corporation (APFDC). We hear that he will be picking one of the celebrities who has helped him in the recent election. But the odds are favouring only a couple of them in that case. They say that either Jayasudha or Mohan Babu will be getting the APFDC chairman post which was held by Ambika Krishna in the Telugudesam Party regime. As Jagan feels that Mohan Babu is little aggressive, the post will be given to Jayasudha most likely.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X