వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మొండిగా ఉండొద్దంటే జగన్ వినడు.!మొండిగా ఉండాలంటే బాబు వినడు.!మరోసారి కీలక వ్యాఖ్యలు చేసి జేసీ.!

|
Google Oneindia TeluguNews

అమరావతి/హైదరాబాద్ : కొందరు రాజకీయ నేతలు ఏది మాట్లాడినా సంచలనంగా మారుతుంది. మరికొంత మంది నాయకులు సంచలనాల కోసమే మాట్లాడుతుంటారు. ఇందులో మొదటి సందర్బానికి చెందిన నాయకుడే జేసీ దివాకర్ రెడ్డి. ఏపార్టీ లో ఉన్నా, ఏ నేత గురించి మాట్లాడాలన్నా, చివరకు సొంత పార్టీ అధినేత గురించి మాట్లడాలన్నా ఆయనంత ముక్కుసూటిగా మాట్లాడే నేత మరొకరు ఉండరు. రాయలసీమ యాసలో రాజకీయ పంచ్ లతో ఆయన చుట్టూ ఉన్న వాతావరణం ఎప్పుడూ ఆహ్లాదంగా ఉంటుంది. అయితే మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఏ అంశం గురించి మాట్లాడినా అందులో ఉన్న సమాచారం మాత్రం కొత్తగానే ఉంటుంది.

అప్పుడు వైఎస్సార్..ఇప్పుడు జగన్: ఏసీ, ఫ్యాన్ల కింద కూర్చుని దీక్షలంటే ఎలా: జేసీ దివాకర్ రెడ్డిఅప్పుడు వైఎస్సార్..ఇప్పుడు జగన్: ఏసీ, ఫ్యాన్ల కింద కూర్చుని దీక్షలంటే ఎలా: జేసీ దివాకర్ రెడ్డి

 జగన్ పై, చంద్రబాబు పై జేసీ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఇద్దరూ మొండి ఘటాలేనన్న మాజీ ఎంపీ..

జగన్ పై, చంద్రబాబు పై జేసీ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఇద్దరూ మొండి ఘటాలేనన్న మాజీ ఎంపీ..

జేసీ ఎంత ఘాటు విమర్శలు చేసినా, పచ్చి ఆరోపణలు గుప్పించినా, ఘోరంగా నిందించినా ఎదుటి వారిలో అంత ఆగ్రహం మాత్రం రాదు.
ఎందుకంటే జేసీ వ్యాఖ్యల్లోని ఖరుకుదనం వెనక ఉన్న సున్నితత్వం, హాస్యం, ఒకింత అమాయకత్వం ఎదుటివారి మనోభావాలు నొప్పించవనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతుంటాయి. అందుకే జేసి దివాకర్ రెడ్డి మీడియా సమావేశమన్నా, చిట్ చాట్ అన్నా విలేఖరులతో పాటు సహచర నాయకులు ఎక్కువ సంఖ్యలో పాల్గొంటారు. తాజాగా ఏపి సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు పట్ల, టీటీడీ ఆస్తుల అమ్మకం పట్ల జేసీ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

 ప్రతిపక్ష పార్టీని విమర్శించినట్టే సొంతపార్టీని కూడా.. సంచలన వ్యాఖ్యలు చేసిన జేసీ దివాకర్ రెడ్డి..

ప్రతిపక్ష పార్టీని విమర్శించినట్టే సొంతపార్టీని కూడా.. సంచలన వ్యాఖ్యలు చేసిన జేసీ దివాకర్ రెడ్డి..

సొంత పార్టీ పై అయినా, ఎదుటి పార్టీపై అయినా తూటాల్లాంటి మాటలు పేల్చడంలో జేసీ దివాకర్ రెడ్డిదే ప్రథమ స్థానం అని చెప్పొచ్చు. తనకు ఏం నచ్చితే అది మొహమాటం లేకుండా మాట్లాడుతుంటారు. కొన్నిసార్లు పార్టీలు, ప్రభుత్వాల రహస్యాలు బట్టబయలు చేయడమే కాకుండా అంతర్గతంగా జరిగే విశ్వసనీయ సమాచారాన్ని కూడా తేలిగ్గా చెప్పేస్తుంటారు. అంతే కాకుండా జేసీ దివాకర్ రెడ్డి ఎపుడు స్పందించినా సమకాలీన రాజకీయాల మీద కీలక వ్యాఖ్యలు చేస్తుంటారు. ఆ మద్య టీడీపీ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇళ్లల్లోనే నిరసన తెలిపాలని పిలుపునిస్తే అందుకు టీడిపి పెద్దలకు దిమ్మతిరిగే సమాధానం చెప్పారు జేసీ.

 ఇళ్లలో చేసే నిరసనలకు జగన్ ఎలా భయపడతారు.. టీడిపి పి సూటిగా ప్రశ్నించిన జేసీ..

ఇళ్లలో చేసే నిరసనలకు జగన్ ఎలా భయపడతారు.. టీడిపి పి సూటిగా ప్రశ్నించిన జేసీ..

నడిరోడ్డు మీద ఆమరణ నిరిహార దీక్ష చేస్తేనే పట్టించుకోని జగన్ ఇలాంటి ఇళ్లల్లో చేసే నిరసనలను పట్టించుకోడని కుండబద్దలు కొట్టినట్టు చెప్పేశారు. అంతే కాకుండా ఎన్నికల ముందు భజన చేసే వాళ్లను పట్టించుకోకండి చంద్రబాబు, వాళ్లతో ఎప్పటికైనా ప్రమాదమేనని ఎంత చెప్పినా బాబు వినలేదని, సిట్టింగులకు సీట్లు ఇవ్వొద్దని ఖరాఖండిగా చెప్పినా బాబు అపుడు వినలేదని చెప్పుకొచ్చారు జేసీ. అంతే కాకుండా ప్రస్తుతం ఏపి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పాలన గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు జేసీ.

 టీటీడి భూముల నిర్ణయం ఎవరిదో చెప్పిన జేసీ.. ఇప్పుడు చర్చంతా అటు వైపే..

టీటీడి భూముల నిర్ణయం ఎవరిదో చెప్పిన జేసీ.. ఇప్పుడు చర్చంతా అటు వైపే..

అంతే కాకుండా టీటీడీ భూముల అమ్మకం నిర్ణయం గురించి కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు జేసీ. తిరుమల వెంకన్న ఆస్తులు అమ్మాలంటూ టీటీడీ చేసిన నిర్ణయం బోర్డు నిర్ణయం అని అందరూ భావిస్తున్నారని, కానీ అందులో వాస్తవం లేదని, స్వయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డే టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డిపై శ్రీవారి భూములు అమ్మే ప్రక్రియకు ఒత్తిడి తీసుకొచ్చారని ఎవరూ ఊహించని వ్యాఖ్యలు చేసారు. ఐతే టీటీడి భూముల వ్యవహారంలో దేశ వ్యాప్తంగా జరుగుతున్న చర్చ ఒకటైతే మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మరో రకంగా ఉన్నాయనే చర్చ జరుగుతోంది. మరీ జేసీ వ్యాఖ్యల పట్ల టీటీడి గానీ. ప్రభుత్వ వర్గాలు గాని ఎలా స్పందిస్తోయో చూడాలి.

English summary
JC Diwakar Reddy loves talking about it. Sometimes it is easy to uncover the secrets of parties and the government, but also to disclose credible information that is internal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X