• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

జేసి దివాక‌ర్ రెడ్డి.. ఓ అవ‌కాశ వాది..

|
  సోనియా గాంధీతో జేసీ దివాకర్ రెడ్డి వ్యంగ్య వ్యాఖ్యలు

  తాజాగా జేసి దివాకర్ రెడ్డి పేరు మరో సారి వార్తల్లోకి ఎక్కింది. ప్రత్యేక హోదా విషయంలో తెలుగుదేశం అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించి విజయం సాధించింది. కేంద్రాన్ని బలంగా నిలదీయడానికి టీడీపీకి చక్కటి అవకాశం దక్కింది. మోదీ సర్కార్ పైన ఎలా నిప్పులు చెరగాలా అని చంద్రబాబు సమాలోచనలు చేస్తున్నారు. పార్టీ ఎం.పిలు కూడా ఆంధ్రా ప్రజల గళాన్ని లోక్ సభ వేదికగా వినిపించడానికి సిద్ధమతున్నారు. రాష్ట్రం మొత్తం పార్లమెంటు వైపు చూస్తుంది. కాని జేసి దివాకర్ రెడ్డికి మాత్రం ఇవేమి పట్టడం లేదు. సమయం చూసుకొని తన డిమాండ్ల చిట్టాను ఆయన పార్టీ ముందు పెట్టారు.

  అవ‌కాశ‌వాద రాజ‌కీయాలు న‌డ‌ప‌డంలో దిట్ట‌..

  అవ‌కాశ‌వాద రాజ‌కీయాలు న‌డ‌ప‌డంలో దిట్ట‌..

  జేసీ దివాకర్ రెడ్డి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆ పేరుకు ఓ బ్రాండ్ ఉంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత సీనియర్ నాయకుల్లో ఒకరు.కాని ఆ సీనియార్టీయే ఇప్పుడు ఆయనకు శాపంగా మారుతోంది. పెద్దరికం పేరుతో ఆయన చేస్తున్న హడావుడి ఎబ్బెట్లుగా తయారౌతోంది. నోటికొచ్చినట్లు మాట్లాడుతు ఆయన హద్దులు మీరిపోతున్నారు. చిన్నా,పెద్దా లేకుండా దివాకర్ రెడ్డి చేస్తున్న కామెంట్లు నాన్సెస్ గా తయారైంది. ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఇప్పుడు ఎం.పిగా ఉన్న జేసీ ప్రవర్తిస్తున్న తీరుపైన సర్వత్రా విమర్శలు వ్యక్తమౌతున్నాయి.అహంకారపూరితంగా ఆయన మాట్లాడుతున్నారనే అభిప్రాయం నెలకొన్నది. రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెపుతున్న దివాకర్ రెడ్డి హుందాగా వ్యవహారించాల్సింది పోయి చెలరేగిపోతున్నారు. కొడుకుకు తన రాజకీయ వారసత్వాన్ని అప్పగించాలని భావిస్తున్న ఆయన ఆ విషయాన్ని మరిచిపోయి మాట్లాడుతున్నట్లు కనిపిస్తోంది.

  రాష్ట్ర ప్ర‌యోజ‌నాల క‌న్నా సొంత ప్ర‌యోజానాలకే ప్రాధాన్య‌త‌...

  రాష్ట్ర ప్ర‌యోజ‌నాల క‌న్నా సొంత ప్ర‌యోజానాలకే ప్రాధాన్య‌త‌...

  నిజానికి జేసీ సోదరులిద్దరికి నోటి దుర‌ద ఎక్కువ‌. దివాకర్ రెడ్డి సోదరుడు ప్రభాకర్ రెడ్డికి కూడా ఇష్టానుసారంగా మాట్లాడటం అలవాటు.తాడిపత్రిలో తిరుగులేకపోవడంతో ఈ ఇద్దరు అన్నదమ్ముళ్లు కనీస మర్యాద పాటించకుండా చేరరేగిపోతుంటారు.కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ఇలాగే వ్యవహారించడంతో వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి జేసి బ్రదర్స్ ను కట్ చేసి పక్కన పెట్టారు.మంత్రి పదవి ఇవ్వకుండా దివాకర్ రెడ్డిని కావాలనే రాజశేఖర్ రెడ్డి క్యాబినెట్‌ లోకి తీసుకోలేదు.తనకు మంత్రి పదవి ఖాయమని నమ్మి తన అనుచరులకు బిర్యానీ కూడా సిద్ధం చేయించిన జేసీ లిస్టులో పేరు లేకపోవడంతో నీరుకారిపోయాడు. గత ఎన్నికల సమయంలో టీడీపీలోకి దూకి అనంతపురం ఎం.పి అయిన ఆయన ఆ పార్టీలో ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్నారు.

   చ‌వ‌క‌బారు మాట‌లు.. శ్రుతి మించుతున్న వేషాలు..

  చ‌వ‌క‌బారు మాట‌లు.. శ్రుతి మించుతున్న వేషాలు..

  కేవలం చంద్రబాబు మాట కోసం అనంతపురం తెలుగుదేశం నేతలు జేసిని భరిస్తున్నారు. జిల్లాలో దివాకర్ రెడ్డి సోదరులకు మంచి పట్టుండటంతో పాటు రెడ్డి సామాజిక వర్గం మద్దతు కోసం చంద్రబాబు వీరికి ప్రధాన్యత ఇస్తున్నారు.దీన్ని అలుసుగా తీసుకొని దివాకర్ రెడ్డి చేలరేగిపోతున్నాడు. ముఖ్యమంత్రి ముందే ఇష్టానుసారంగా ఆయన మాట్లాడుతుండటంతో తెలుగుదేశం నాయకులు హడలిపోతున్నారు.పార్టీ కేడర్ కు ఎలాంటి సందేశం వెళ్తుందన్న ఆలోచన లేకుండా దివాకర్ రెడ్డి తన నోటికి పదును పెడుతున్నారు.కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడే జేసీ తీరు వల్ల టీడీపీకి చికాకులు మొదలయ్యాయి.ఆయన మాటలను ప్రత్యర్థులు తమకనుకూలంగా వాడుకుంటున్నారు.ఇదే సమయంలో ప్రతిపక్ష నేత వై.ఎస్ జగన్ పైన కూడా దివాకర్ రెడ్డి తీరు ఎబ్బెట్టుగా తయారైంది.మా వాడు జగన్ అంటు నోటికొచ్చినట్లు ఆయన వ్యాఖ్యలు చేస్తున్నారు.జగన్ మీద విమర్శలు చేసే విషయంలో జేసి శ్రుతి మించుతున్నారనే అభిప్రాయం తెలుగుదేశంలో కూడా ఉంది. అయితే ఆయనను ఆపడం మాత్రం ఎవరి తరం కావడం లేదు.

  బాబునే కాదు..ఎవ‌రినైనా అదును చూసి దెబ్బ‌కొట్ట‌డం జేసీ నైజం..

  బాబునే కాదు..ఎవ‌రినైనా అదును చూసి దెబ్బ‌కొట్ట‌డం జేసీ నైజం..

  అవిశ్వాసం వల్ల ప్రయోజనం లేదంటు సొంత కవిత్వం అల్లుతున్నారు. పార్టీ విప్ జారీ చేసినా లోక్ సభకు వెళ్లనంటు మొండి వాదాన్ని వినిపిస్తున్నారు. కాని అవిశ్వాసం వల్ల మోదీ సర్కార్ పడిపోదని చిన్నపిల్లావాడిని అడిగినా చెపుతాడు.ఈ విషయాన్ని దివాకర్ రెడ్డి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.చేతిలో ఉన్న ఆయుధాన్ని ఉపయోగించుకొని పోరాటం చేయడం ముఖ్యం. ఈ ప్రాథమిక సూత్రాన్ని మరిచిపోయి జేసీ మాట్లాడుతున్నారు. రాజకీయంగా తన ఇగోను సంత్రుప్తి పర్చుకోవడం కోసం దివాకర్ రెడ్డి చిల్లర ప్రయోగం చేస్తున్నారు. దీని వల్ల ప్రత్యేక హోదా అంశం పక్క దారి పట్టే అవకాశాలున్నాయి. స్పెషల్ స్టేటస్ సెంటిమెంటుగా తయారైన సందర్భంగా దివాకర్ రెడ్డి తీరు ఆయనను చరిత్ర హీనుడిగా మిగిల్చే ఛాన్స్ ఉంది.

  English summary
  tdp mp jc diwakar reddy playing cheap trick in his constituency. jc saying that no use by introducing no trust motion in the parliament. ap cm chandrababu convinced him to go to parliament and participate in discussion on no trust motion.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X