వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ అధికారం శాశ్వతం కాదు గుర్తుంచుకో.. క్షక్ష సాధింపు వద్దు.. వ్యాపారం మూసేస్తా.. జేసీ ఫైర్

|
Google Oneindia TeluguNews

ఏపీ ప్రభుత్వం తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని ప్రకటించిన టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే తాను కొంతకాలం పాటు ట్రావెల్ వ్యాపారాన్ని నిలిపి వేస్తున్నట్టు ప్రకటించారు. ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలు ఎక్కువవుతున్నాయని , జగన్ ప్రభుత్వం తన ప్రత్యర్థులను దారుణంగా హింసిస్తుందని అరోపణలు చేశారు. ఇక అధికారం శాశ్వతం కాదనే అంశాన్ని సీఎం జగన్ గుర్తుంచుకోవాలని ఆయన హితవు పలికారు.

జేసీ దివాకర్ రెడ్డికి మరోసారి షాక్...!జేసీ దివాకర్ రెడ్డికి మరోసారి షాక్...!

మూడు సార్లు బస్సులు సీజ్

మూడు సార్లు బస్సులు సీజ్


పదిహేను రోజులుగా జేసీ ట్రావెల్స్‌పై దాడులు చేస్తున్న ఏపీ ఆర్టీఏ అధికారులు ఇప్పటి వరకు సుమారు వంద బస్సుల వరకు సీజ్ చేశారు. అనంతరం కొన్ని బస్సులను రీలీజ్ చేశారు. తాజాగా గురువారం కూడా దాడులు ఆర్టీఏ ఉన్నతాధికారులు తనిఖీలు చేసి మరికొన్ని బస్సులను సీజ్ చేశారు. దీంతో జేసీ దివాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంలోనే ప్రభుత్వంపై తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ... ఫైర్ అయ్యారు. ఇటివల కక్షసాధింపు చర్యలు పెరిగిపోయాయని వ్యాఖ్యానించారు.

 బస్సుల వ్యాపారాన్ని మూసివేస్తా...

బస్సుల వ్యాపారాన్ని మూసివేస్తా...


ప్రతిరోజు తన ఆస్తులు మరియు ఇతర వ్యాపారాలపై అధికారులు ఒత్తిడి తెస్తున్నారని జేసీ దివాకర్‌రెడ్డి ఆరోపించారు. అయితే వారిపై ఎదురు కేసులు పెడితే.. కాళ్ల బేరానికి వస్తున్నారని, పైవాళ్ల ఒత్తిడితోనే తాము దాడులు చేస్తున్నట్టు చెబుతున్నారని అన్నారు. ఈ నేపథ్యంలోనే రోజు ఏదో రకంగా గోడవ పడే బదులు కొద్ది రోజుల పాటు ట్రావెల్ వ్యాపారాన్ని నిలిపివేయాలని భావిస్తున్నట్టు తెలిపారు. వ్యాపారాన్ని మూసివేస్తే... అసలు సమస్యలే ఉండవు కదా అంటూ... వ్యాఖ్యానించారు.

పార్టీలో ఉంటూ జైలుకు వెళ్లినా పర్వాలేదు...

పార్టీలో ఉంటూ జైలుకు వెళ్లినా పర్వాలేదు...

ఇక తెలుగుదేశం పార్టీని వీడుతున్న వారిపై కూడ జేసీ స్పందించారు. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చేసిన వ్యాఖ్యలపై ఆయన మాట్లాడుతూ.... పార్టీ నుండి బయటకు వెళ్లేవారు ఏదో ఒకటి విమర్శించాలి కాబట్టి ఆరోపణలు చేస్తూ వెళుతున్నారని అన్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీని వీడకుండా ధైర్యంగా పోరాడాలని అన్నారు. కేసులు పెట్టి... నాలుగు రోజుల పాటు జైలుకు పంపిణ అధైర్యపడకుండా ఎదురు నిలపడాలని సూచించారు.

 జేసీ ట్రావెల్స్ పై పలుసార్లు దాడులు

జేసీ ట్రావెల్స్ పై పలుసార్లు దాడులు

తనకు చెందిన ట్రావెల్ బస్సులను టార్గెట్ చేస్తూ.... బస్సులు సమయానికి రాలేదని కూడ సీజ్ చేస్తున్నారని జేసీ చెప్పారు. మరోవైపు కోర్టులు చెప్పినా అధికారులు కొన్నిబస్సులను తన వద్దే పెట్టుకున్నారని వాపోయారు. ఈ నేపథ్యంలోనే అధికారులపై కేసులు పెడతానని కూడ ఆయన వ్యాఖ్యానించారు. కేసుల విషయంలో అవసరమైతే తాను జైలుకు కూడ వెళ్లడానికి సిద్దంగా ఉన్నానని అన్నారు.

English summary
Former MP JC Diwakar Reddy has once again expressed his displeasure at YCP government. he Wanted to stop the travel business for some time.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X