వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ వంద రోజుల పాలనకు వంద మార్కులు: నడిపించేవాడు కావాలి : జేసీ సంచలనం..!!

|
Google Oneindia TeluguNews

ముఖ్యమంత్రి జగన్ వంద రోజుల పాలనకు మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వందకు వంద మార్కులు వేసారు. అదే సమయంలో కొన్ని సూచనలు చేసారు. ప్రభుత్వంలో ఉన్నా..ప్రతిపక్షంలో ఉన్నా జగన్ ఎప్పుడూ మా వాడేనంటూ చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వ నిర్ణయాలను మైక్రో స్కోప్ లో చూడాలి తప్ప దాన్ని పగుల గొట్టి చూస్తే ఎలా అని ప్రశ్నించారు. రివర్స్ టెండరింగ్ లో కొన్ని తప్పిదాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి జగన్ కిందపడుతున్నాడు..లేస్తున్నాడు..చెయ్యి పట్టుకని నడిపించేవాడు కావాలని వ్యాఖ్యానించారు. తనను సలహాలు ఇవ్వాలని అడిగితే ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నానని జేసీ దివాకర్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఆర్టీసీ విలీనం చేయటం పైన కీలక వ్యాఖ్యలు చేసారు.

వందకు వంద మార్కులు వేస్తాను..
ముఖ్యమంత్రి జగన్ వంద రోజుల పాలన గురించి మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి స్పందించారు. ఆయన తీసుకుంటున్న నిర్ణయాల గురించి చెప్పుకొచ్చారు. జగన్ అధికారంలో ఉన్నా..ప్రతిపక్షంలో ఉన్న తమ వాడేనని వ్యాఖ్యానించారు. ఏపీకి మంచి జరగాలని..జగన్ ఇంకా మంచి పనులు చేయాలని పేర్కొన్నారు. జగన్ వంద రోజుల పాలనకు వందకు వంద మార్కులు వేస్తానని..వాస్తవంగా నూట పది మార్కులు ఇవ్వా లని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో జగన్ కొన్ని నిర్ణయాల విషయంలో కిందపడుతున్నాడు..లేస్తున్నాడు..చెయ్యి పట్టుకని నడిపించేవాడు కావాలని వ్యాఖ్యానించారు. రాజధాని అమరావతి నుండి తరలించే అంత తెలివి తక్కువ పని జగన్ చేయడని..చాలా తెలివిగలవాడని జేసీ కామెంట్ చేసారు. ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం మీద జేసీ స్పందించారు. ప్రైవేటు సంస్థలను ప్రభుత్వం తమ అదుపులో ఉంచుకోవాలని..ప్రైవేటు వారితో కలసి ప్రభుత్వం వ్యాపారం చేయకూడదున్నారు. ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేయడమంటే ప్రైవేటు వారితో వ్యాపారం చేయటమేనని వ్యాఖ్యానించారు. గ్రామ సచివాలయాలు ఆశించిన రీతిలో జరుగుతాయా లేదా అనేది చూడాలి అని చెప్పుకొచ్చారు.

JC Diwakar Reddy give hundred marks for Jagan for his 100 days administration

జగన్ ను నడిపించేవాడు కావాలి...
ముఖ్యమంత్రి జగన్ కు మంచి సూచనలు ..సలహాలు ఇచ్చి నడింపించేవాడు కావాలని జేసీ పేర్కొన్నారు. రివర్స్ టెండరింగ్ అంటే ఏమిటో తనకు తెలియదన్నారు. ఏ ప్రభుత్వమైనా అధికారం లోకి వచ్చాక ప్లస్, మైనస్ చూసుకోవాల్సిందేనని చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వ నిర్ణయాలను మైక్రో స్కోప్ లో చూడాలి తప్ప దాన్ని పగుల గొట్టి చూస్తే ఎలా అని ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వం చేసిన రివర్స్ టెండరింగ్ లో కొన్ని తప్పిదాలు ఉన్నాయని చెప్పారు. ప్రభుత్వంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా జగన్ ఎప్పుడూ మావాడే అని పాత డైలాగ్ రిపీట్ చేసారు. తాను రాజకీయాల నుంచి ఇప్పటికే రిటైర్డ్ అయ్యానని..
రాష్ట్రానికి అంతా మంచే జరగాలని కోరుకుంటున్నానని చెప్పారు. తనకు సలహాలు ఇవ్వాలని జగన్ అడిగితే చూస్తానని జేసీ స్పష్టం చేసారు. ఆర్టీసీ ని ప్రభుత్వంలో విలీనం చేయడం వల్ల ప్రభుత్వానికి చాలా భారం పడుతుందని.. ఆర్టీసీ విలీనం వల్ల ప్రభత్వం కొత్త ఉద్యోగాలు ఇచ్చినట్లు కాదన్నారు.

English summary
EX Mp JC Diwakar Reddy give hundred marks for Jagan for his 100 days administration. JC also suggested CM on Reverse tendering and on RTC merge with govt.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X