వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జేసీ దివాకర్ రెడ్డి సంచలనం, 'నిరవ్ మోడీకి సాయం చేసి ఏపీకి అన్యాయం చేసిన మోడీ'

|
Google Oneindia TeluguNews

అనంతపురం: ఆంధ్రప్రదేశ్‌కు ఎట్టి పరిస్థితుల్లో ప్రత్యేక హోదా రాదని పలుమార్లు చెప్పిన అనంతపురం తెలుగుదేశం పార్టీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఆదివారం మరోసారి కుండబద్దలు కొట్టారు. ఏపీకి హోదా రాదని తేల్చి చెప్పారు. ప్రత్యేక ప్యాకేజీ మాత్రమే వస్తుందన్నారు.

వచ్చే నెల 14న పవన్ భారీ సభ?: మోడీపై అవిశ్వాసం.. టీడీపీ-వైసీపీలకు గట్టి షాక్!వచ్చే నెల 14న పవన్ భారీ సభ?: మోడీపై అవిశ్వాసం.. టీడీపీ-వైసీపీలకు గట్టి షాక్!

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు రాజీనామా పేరుతో డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. ఒకవేళ రాజీనామాలు ఆమోదం పొందినా, ఆ లోపు ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుందని జేసీ జోస్యం చెప్పారు.

 చంద్రబాబు తనకు అనుకూలమైన కాంట్రాక్టర్లతో

చంద్రబాబు తనకు అనుకూలమైన కాంట్రాక్టర్లతో

కాంగ్రెస్ పార్టీ నేత జైరాం రమేష్ ఆదివారం మరోసారి ఏపీ సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. చట్ట ప్రకారం పోలవరం ప్రాజెక్టును కేంద్రమే నిర్మించాలని చెప్పారు. కానీ చంద్రబాబు తనకు అనుకూలమైన కాంట్రాక్టర్లతో పోలవరం ప్రాజెక్టును కడుతున్నారని ఆరోపించారు.

29మంది ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు చేసిందేం లేదు

29మంది ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు చేసిందేం లేదు

29సార్లు ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు ఏపీ కోసం చేసింది శూన్యమని జైరాం రమేష్ ఆరోపించారు. అశాస్త్రీయ విభజన అని టీడీపీ, బీజేపీ నేతలు చెబుతున్నారని, కానీ ఇప్పుడు చట్టాలను మార్చి శాస్త్రీయం చేసుకోవచ్చు కదా అని సూచించారు.

 ప్రయత్నం చేశారే తప్ప

ప్రయత్నం చేశారే తప్ప

నియోజకవర్గాల పెంపు కోసం చంద్రబాబు ప్రయత్నం చేశారే తప్ప మరేమీ చేయలేదని జైరాం విమర్శించారు. పోలవరం ప్రాజెక్టును కేంద్రం నిర్మించాలని, కానీ సెక్షన్ 90కి విరుద్ధంగా ప్రాజెక్టును కాంట్రాక్టర్లకు ఇచ్చారని చంద్రబాబుపై మండిపడ్డారు.

నిరవ్ మోడీకి సాయం చేసి ఏపీకి అన్యాయం చేసిన మోడీ

నిరవ్ మోడీకి సాయం చేసి ఏపీకి అన్యాయం చేసిన మోడీ

ప్రధానితో ఒక్కసారి అయినా చంద్రబాబు విభజన హామీల గురించి మాట్లాడారా అని జైరాం ప్రశ్నించారు. ప్రధాని మోడీ... లలిత్ మోడీ, నీరవ్ మోడీ వంటి వారికి సాయం చేస్తూ ఏపీకి అన్యాయం చేస్తున్నారని ధ్వజమెత్తారు.

English summary
Telugu Desam Party MP JC Diwakar Reddy said on Sunday that Andhra Pradesh will not get Special tag.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X