వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజధాని పేరుతో దోచుకున్నారు: గ్రేటర్ సీమ ఉద్యమం చేస్తాం: జేసీ కీలక వ్యాఖ్యలు..!

|
Google Oneindia TeluguNews

మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేసారు. ఈ సారి ఆయన వైసీపీ ప్రభుత్వం మీదే కాదు..టీడీపీ నేతల మీద ఆరోపణలు చేసారు. రాజధాని పేరుతో టీడీపీ..వైసీపీ నేతలు వేల కోట్లు దోచుకు న్నారని..ఇది వాస్తవమని తేల్చి చెప్పారు. ఇక, రాజధాని విషయంలనూ కొత్త అంశం తెర మీదకు తెచ్చారు. ప్రభుత్వం ప్రతిపాదించి..అమలు దిశగా ముందుకు వెళ్తున్న మూడు రాజధానుల అంశం పైనా జేసీ ఉద్యమం దిశగా హెచ్చరిక చేసారు.

అమరావతి మార్పు తప్పదనుకుంటే

అమరావతి మార్పు తప్పదనుకుంటే

తల, కాళ్లు, చేతులు వేరు చేసినట్లుగా రాజధాని వ్యవహారం ఉందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి మార్పు తప్పదనుకుంటే గ్రేటర్ రాయలసీమ ఉద్యమం చేస్తామన్నారు. గ్రేటర్ రాయలసీమ కోసం త్వరలో సమావేశమవుతామని చెప్పారు. తమ ప్రాంతాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలని జేసీ డిమాండ్ చేశారు. బీజేపీ నేతలతో సమావేశం గురించి ఇప్పటికే చెప్పిన అంశాన్నే మరోసారి చెప్పుకొచ్చారు.

సీమను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలి..

సీమను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలి..


రాజధాని వ్యవహారంలో మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తాజాగా హెచ్చరిక చేసారు. విశాఖలో పరిపాలనా రాజధాని..కర్నూలులో న్యాయ రాజధాని..అమరావతిలో లెజిస్లేచర్ రాజధాని అంటూ ప్రభుత్వం ప్రతిపాదిం చటం..రెండు కమిటీలు అదే విధంగా నివేదిక ఇవ్వటం పైన జేసీ స్పందించారు. రాజధాని వ్యవహారంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం పైన ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. తల..కాళ్లు..చేతులు వేరు చేసి నట్లుగా ఉందని వ్యాఖ్యానించారు. అమరావతి మార్పు తప్పదనుకుంటే గ్రేటర్ రాయలసీమ ఉద్యమం చేస్తామన్నారు. తమ ప్రాంతాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలని జేసీ డిమాండ్ చేశారు. ఇదే డిమాండ్ తో త్వరలోనే ఆ ప్రాంత నేతలంతా సమావేశమవుతామని చెప్పారు.

రాజధాని పేరుతో దోచుకున్నారు..

రాజధాని పేరుతో దోచుకున్నారు..

రాజధాని పేరుతో దోపిడీ జరిగిందని జేసీ వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకు టీడీపీ నేతల పైన విమర్శలు చేయని జేసీ..ఇప్పుడు రాష్ట్రంలో రాజధాని మార్పు అంశం వివాదాస్పదంగా మారిన సందర్బంలనే ఈ వ్యాఖ్యలు చేసారు. రాజధాని పేరుతో టీడీపీ, వైసీపీ నేతలు వేల కోట్లు దోచుకున్నది వాస్తవమని చెప్పారు. అమారవతి నుండి రాజధాని మార్పు పైన తన అభిప్రాయాన్ని జేసీ స్పష్టం చేసారు. ఇక, తాజాగా బీజేపీ నేతలను కలుస్తూ..జేసీ పొలిటికల్ హంగామాకు కారణమయ్యారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ను స్వాధీనం చేసుకుంటే కచ్చితంగా బీజేపీలోకి వెళ్తానని ఆయన తెలిపారు. కిషన్‌రెడ్డి, సత్యకుమార్ తన స్నేహితులు కాబట్టే కలిశానని మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రాంతీయ పార్టీల్లో ఉన్నంత కాలం తాను టీడీపీలోనే ఉంటానని జేసీ తేల్చి చెప్పారు.

English summary
ex MP JC Diwakar Reddy key comments on Capital shifting and his relation with Bjp Leaders. He says TDP and YCP leaders robbed by name of capital.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X