వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సుజనాచౌదరి వల్లే.. అవిశ్వాసానికి దూరంగా ఉంటా: టీడీపీకి జేసీ షాక్, బుజ్జగింపు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Recommended Video

ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

అమరావతి: అనంతపురం తెలుగుదేశం పార్టీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అలకవహించారా? అంటే అవుననే ప్రచారం సాగుతోంది. తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై దేశవ్యాప్తంగా చర్చ సాగుతోంది. టీడీపీ కూడా దీనిని ఎంతో కీలక సమయంగా భావిస్తోంది.

చదవండి: నాడు సోనియా, నేడు చంద్రబాబు: ఇదీ బలాల లెక్క.. మోడీ ప్రభుత్వానికి ముప్పులేదా?

బీజేపీని ఇరుకున పెట్టి, తద్వారా రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్, జనసేనలకు గట్టి సమాధానం ఇవ్వాలని చూస్తోంది. ఇందుకోసం సీఎం చంద్రబాబు నాయుడు, అధికారులు, పార్టీ నేతలు తీవ్ర కసరత్తు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో జేసీ ఊహించని షాకిచ్చారు.

JC Diwakar Reddy shocks TDP before No Confidence Motion

సుజనా చౌదరి తీరుతో జేసీ అలకవహించినట్లుగా తెలుస్తోంది. దీంతో తాను అవిశ్వాసానికి దూరంగా ఉంటానని హెచ్చరికలు జారీ చేశారు. టీడీపీ ఎంపీల బృందానికి నేతృత్వం వహిస్తున్న సుజన తనను విస్మరిస్తున్నారని సీరియస్ అయినట్లుగా ప్రచారం సాగుతోంది.

చదవండి: అలా అని ఎవరు చెప్పారు?: టీడీపీ అవిశ్వాసంపై సోనియా, '20న సత్తా చూపిస్తాం'

తాను అవిశ్వాసానికి హాజరు కానని తోటి ఎంపీలతో చెప్పారని అంటున్నారు. కీలకమైన అవిశ్వాసానికి ముందు జేసీ అసంతృప్తి టీడీపీని ఇబ్బందులకు గురి చేస్తోంది. దీంతో ఆయనను బుజ్జగిస్తున్నారు.

చదవండి: మోడీని చిక్కుల్లోకి నెట్టేలా స్కెచ్, ద్విముఖ వ్యూహం: బీజేపీ నేతలకు బాబు వల!

టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాసంపై మద్దతు కోరుతూ వివిధ పార్టీల నాయకులను కలవాల్సిన ఎంపీల బృందంలో జేసీ ఉన్నారు. ఈ బృందానికి సుజన నేతృత్వం వహిస్తున్నారు. సుజన సొంత పోకడలకు పోతున్నారని జేసీ ఆరోపించారని తెలుస్తోంది.

English summary
Anantapur MP JC Diwakar Reddy gave shock to Telugudesam Party before No Confidence Motion. He unhappy with Sujana Choudhary.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X