వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అంత మగాడివా.. నన్ను ముట్టుకో, బూట్లు నాకేవాడినైతే, తాత గుణాలు: జగన్‌పై జేసీ

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన అనంతపురం టిడిపి ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు.

|
Google Oneindia TeluguNews

పులివెందుల: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన అనంతపురం తెలుగుదేశం పార్టీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు.

పులివెందులలో అందరూ రెడ్లేనని, ఎవరూ టిడిపికి ఓటేయలేదని, ఇప్పుడు నీళ్లివ్వడంతో 2019లో అందరూ ఓటేయాలని, పులివెందులలో జగన్‌ను ఓడించాలని అభిప్రాయపడ్డారు. నా నాలుక చీలుస్తానంటావా, అంతమగాడివా అని వైసిపి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డిపై నిప్పులు కక్కారు.

నిజమా.. నువ్వేనా :చిరంజీవిని సర్‌ప్రైజ్ చేసిన రోజా, అందరికీ షాక్!నిజమా.. నువ్వేనా :చిరంజీవిని సర్‌ప్రైజ్ చేసిన రోజా, అందరికీ షాక్!

ఇక్కడ (పులివెందుల) అందరూ రెడ్లు రెడ్లు అంటుంటారని జేసీ అన్నారు. తాను నిఖార్సైన రెడ్డిని అన్నారు. తాను కంత్రీ రెడ్డిని కాదని, అసలు సిసలు రెడ్డిని అన్నారు. మరి, మాకు పోటీ ఎందుకు పెడతారని, మీరు? మేమూ రెడ్లమే కదా, మాకు పోటీ పెట్టకండి.. మా స్థానాలు మాకు వదిలేయండని ఆయన జగన్‌కు సూచించారు.

ఆ విధంగా జనగ్ రెడ్లపై పోటీ పెట్టకుండా వదిలిపెడితే... జైజైజై రెడ్లు అని తాను కూడా నినాదాలు చేస్తానని అన్నారు. మాట్లాడితే రెడ్లకు రెడ్లకు పోటీ పెడతారు. ఈ కులం, వర్గం అన్నీ పక్కనపెట్టి ప్రజలు ఆలోచించాలన్నారు.

ఈ మధ్య కాలంలో లారీ పళ్ళు అమ్మితే, రెండు టన్నులు... మూడు టన్నులు సూట్ అంటున్నారని మండిపడ్డారు. టన్ను చీనా కాయలు 80 వేల ధర పలుకుతాయని, అయితే దళారులు మాత్రం సూట్ అంటూ దోచుకుంటున్నారని, పోలీసుల్ని ఉపయోగించి ఈ సూట్ అనే వాళ్లను కంట్రోల్ చేయాలని జేసీ సీఎం చంద్రబాబుకు సూచించారు. దానికి చంద్రబాబు అంగీకరించారు.

బూట్లు నాకేవాడినైతే మంత్రిని అయ్యేవాడిని.. అంత మగాడివా

బూట్లు నాకేవాడినైతే మంత్రిని అయ్యేవాడిని.. అంత మగాడివా

తనను జగన్ చెంచాగాళ్లు బూట్లు నాకేవాడు అన్నారని, తాను అదే చేసేవాడిని అయితే ఎప్పుడో మంత్రిని అయ్యేవాడినని వైసిపి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డిని ఉద్దేశించి మండిపడ్డారు. తనను జానీవాకర్ అని అంటున్నారని, అసలు తనకు తాగే అలవాటే లేదని చెప్పారు. నా నాలుక చీస్తానని అంటున్నావని, అంత మగాడివా అని శ్రీకాంత్ రెడ్డి పైన నిప్పులు చెరిగారు.

దమ్ముంటే నన్ను ముట్టుకో

దమ్ముంటే నన్ను ముట్టుకో

తన పైన విమర్శలు చేస్తున్నారని, మీ ఊరికి వస్తానని, దమ్ముంటే నన్ను ముట్టుకోవాలని జేసీ సవాల్ చేశారు. అప్పుడు నీ కథ తెలుస్తుందన్నారు. 'ఎవడ్రా వాడు శ్రీకాంత్ రెడ్డి? నా నాలుక కోస్తాడా? అరేయ్ నీ ఊరికి వస్తా. దమ్ముంటే నన్ను టచ్ చేయి చాలు' అంటూ నిప్పులు చెరిగారు.

పులివెందులలో రక్తపాతం వద్దు

పులివెందులలో రక్తపాతం వద్దు

పులివెందులలో మళ్లీ రక్తపాతం వద్దని జేసీ దివాకర్ రెడ్డి హితవు పలికారు. బుద్ధి ఉన్న వాడు ఎవరైనా పట్టిసీమ ప్రాజెక్టును అడ్డుకుంటారా అని నిలదీశారు. సీమ ప్రాంతానికి అన్యాయం చేస్తున్నారని ధ్వజమెత్తారు.

అప్యాయంగా పిలిస్తే

అప్యాయంగా పిలిస్తే

తాను వైసిపి అధినేత జగన్‌ను ఆప్యాయంగా వాడు అని పిలిచానని, అలా పిలిచినా తప్పేనా అని జేసీ మండిపడ్డారు. పైడిపాలెం ప్రాజెక్టు ద్వారా వచ్చే నీరు కేవలం పులివెందులకే కాదని, తమకు కూడా ఉపయోగపడుతుందని జేసీ అన్నారు.

మీకు ఓట్లేయలేదు!

మీకు ఓట్లేయలేదు!

జేసీ మాట్లాడుతూ.. ఇక్కడి (పులివెందుల) రెడ్లు, ఇతరులు మీకు ఓట్లేయలేదని చంద్రబాబును ఉద్దేశించి చెప్పారు. ఇక్కడ అంతా రెడ్లే అన్నారు.

పులివెందులలో టిడిపిని గెలిపించాలి

పులివెందులలో టిడిపిని గెలిపించాలి

ఇక్కడి వారికి నీరు ఇవ్వండి ఓట్లు వేస్తారని తాను చంద్రబాబుతో చెప్పానని, అప్పుడు చాలా సంతోషంగా ఓకే చెప్పారని జేసీ అన్నారు. ఇప్పుడు నీరు ఇస్తున్నారని, 2019 ఎన్నికల్లో పులివెందులలో టిడిపి అభ్యర్థిని గెలిపించాలన్నారు. ఇప్పుడు చప్పట్లు కొట్టడం కాదని, అప్పుడు గెలిపించాలన్నారు.

జగన్‌కు తాత గుణాలు

జగన్‌కు తాత గుణాలు

నీకు ఏం తెలుసునని మాట్లాడుతావని జగన్‌ను జేసీ దివాకర్ రెడ్డి ప్రశ్నించారు. ఎవరో చెబితే మాట్లాడుతావని, వారికి, నీకు కూడా ఏం తెలియదని ఎద్దేవా చేశారు. నీకేం తెలుసునని మాట్లాడుతావని ఎద్దేవా చేశారు. మీ తాత గుణాలు నీకు ఒంటబట్టాయన్నారు. మీ నాన్న గుణం రాలేదన్నారు. ఈ సందర్భంగా జగన్ తాత రాజారెడ్డి గురించి జేసీ కాసేపు మాట్లాడారు. ఆ తర్వాత పులివెందులలో ఇక రక్తపాతం వద్దని హితవు పలికారు. కానీ మళ్లీ జగన్ రూపంలో వస్తున్నాడన్నారు.

ఫ్యాక్షన్ గొడవలు రేపేందుకు

ఫ్యాక్షన్ గొడవలు రేపేందుకు

ఫ్యాక్షన్ గొడవలు రేపేందుకు జగన్ సిద్ధమవుతున్నాడని మండిపడ్డారు. రాజారెడ్డికి ఏం తెలుసు? చెయ్యి నరకడం, తల నరకడం, కాలు నరకడం తెలుసునని చెప్పారు. అలాంటి బుద్ధే ఉన్నవాడిని జగన్ ఇప్పుడు తాడిపత్రికి పార్టీ ఇంచార్జిగా పెట్టాడన్నారు.

కుక్కకు కూడా కృతజ్ఞత

కుక్కకు కూడా కృతజ్ఞత

అంటే మళ్లీ గొడవలు రేపాలని చూస్తున్నాడన్నారు. రక్తపాతాన్ని అందరూ మర్చిపోయారని, జగన్ మళ్లీ రక్తపాతం రేపేందుకు వస్తున్నాడన్నారు. ప్రతి వ్యక్తికి కృతజ్ఞత ఉండాలని ఆయన సూచించారు. కుక్కకి కూడా కృతజ్ఞత ఉంటుందని ఆయన తెలిపారు. అలా కృతజ్ఞత లేకపోతే మనుషులమనిపించుకోమన్నారు. ఇలాంటి వారు వద్దని, దేశం విడిచి వెళ్లాలన్నారు.

నేను కల్తీ రెడ్డిని కాదు.. జగన్ రూపంలో వస్తున్నాడు

నేను కల్తీ రెడ్డిని కాదు.. జగన్ రూపంలో వస్తున్నాడు

తాను కల్తీ రెడ్డిని కాదన్నారు. జగన్ కల్తీ రెడ్డి అని జేసీ అభిప్రాయపడ్డారు. కులం, వర్గం అంటుంటే లాభం లేదన్నారు. రెడ్లు అయినా, ఎవరైనా నీళ్లు ఇవ్వాలని చెప్పారు. అందుకే చంద్రబాబు పులివెందులకు నీరు ఇవ్వాలని ఎంత ఖర్చుకు అయినా వెనుకాడలేదన్నారు.

English summary
TDP MP JC Diwakar Reddy takes on YS Jagan and Srikanth Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X