వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫోటో వేసుకుంటూ కూడా..: జగన్‌పై జెసి, మంత్రుల మూకుమ్మడి దాడి

జగన్మోహన్ రెడ్డిపై జెసి దివాకర్ రెడ్డి సహా రాష్ట్ర మంత్రులు మూకుమ్మడి దాడి చేస్తున్నారు.ఓటర్లకు ఎంత పంచుతున్నారనేది ఎవరూ చెప్పే మాట కాదు..అందరూ సత్య హరిశ్చంద్రులే అని జెసి వ్యాఖ్యానించారు.

By Oneindia Staff Writer
|
Google Oneindia TeluguNews

విజయవాడ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు జెసి దివాకర్ రెడ్డి సహా రాష్ట్ర మంత్రులు మూకుమ్మడి దాడి చేస్తున్నారు. ఆయనపై వారు తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు.

ఓటర్లకు ఎంత పంచుతున్నారనేది ఎవరూ చెప్పే మాట కాదు..అందరూ సత్య హరిశ్చంద్రులే అని జెసి వ్యాఖ్యానించారు. ప్రజలకు అన్ని బాగా తెలుసు - వేరే ఊరి నుంచి వచ్చారంటే మహా అయితే 10వేలు ఉంటాయి..లక్షలు దొరికాయంటే ఏమిటి అర్థమని ఆయన అన్నారు.

వైసీపీ నేతలు డబ్బు పంచుతున్నారు..వాళ్లకు తప్పదని, తమ పార్టీ వాళ్లు పంచుతారో లేదో తనకు తెలీదని ఆయన అన్నారు. "నాకు డబ్బు లేదు, పేపర్ లేదు, టీవీ లేదంటూ జగన్ చెప్తున్నారు- ఫోటో వేసుకుంటూ అన్నీ నడుపుతూ నాది కాదంటే ఎలా - ఇంత పచ్చి అబద్దాలు మాట్లాడితే ప్రజలు నమ్ముతారా" అని ఆయన అన్నారు

నాకు సానుభూతి ఉంది..

నాకు సానుభూతి ఉంది..

"నాకు జగన్ పై సానుభూతి ఉంది - నేను చిన్నప్పటి నుంచి జగన్ ను చూస్తున్నాను - మంచి రాజకీయ నాయకుడిగా జగన్ ను తీర్చిదిద్దాలని నాకుంది - ఇన్ని అబద్దాలు చెబితే ఎప్పుడు పైకొస్తావు జగన్- అదేమంటే మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకునని ప్రచారం చేసుకుంటున్నాడు" అని జెసి దివాకర్ రెడ్డి అన్నారు. "మహానుభావుడు మహాత్మగాంధీ కొడుకులే తప్పతాగి బజార్లలలో దొర్లాడారు - అంటే మహానుభావుల కొడుకులందరూ మంచోళ్లేనా - రాజకీయ నాయకుడు ప్రజల్లో విశ్వసనీయత సాధించాలి - పోలవరం పూర్తి చేయాలనేది చంద్రబాబు ఆశ, కల - ఎన్నో పరిస్థితులు దృష్ట్యా పోలవరం 2018కి పూర్తి కాదు - మళ్లీ చంద్రబాబు వస్తే తప్ప పోలవరం పూర్తి కాదు" అని ఆయన అన్నారు.

Recommended Video

Nandyal By Polls : Balakrishna Targets YS Jagan In Road Show | Oneindia Telugu
జగన్‌కు ఓటమి భయం...

జగన్‌కు ఓటమి భయం...

నంద్యాలలో జగన్ కు ఓటమి భయం పట్టుకుందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. అందుకే కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి శాంతి భద్రతల సమస్య పెట్టాలని కుట్ర పన్నినట్లు సమాచారం వస్తోందని అన్నారు. అవినీతికి, అక్రమాలకు, అరాచకాలకు ప్యాంటు, షర్టు వెస్తే అది జగన్ అని ఆయన వ్యాఖ్యానించారు. నంద్యాల ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఖాయమని తెలిసి సీఎం చంద్రబాబు నాయుడిపై నోటికొచ్చినట్లుగా మాట్లాడుతున్నారని ఆయన విరుచుకుపడ్డారు. అన్నివర్గాల అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం.ప్రపంచానికి ఐయెస్ ఉగ్రవాదం ఎంత ప్రమాదమో రాష్ట్రానికి జగన్ ఉగ్రవాదం అంతకంటే ప్రమాదకరమని అన్నారు. నంద్యాల ప్రజలు, అధికారులు, పోలీసులు వైసిపి కుట్రలను తిప్పికొట్టాలని ఆయన కోరారు.

రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు....

రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు....

ఈ రోజు వైసిపి వారు డబ్బులు పంచుతూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు, మొత్తం 67 మంది దొరికిపోయారని మంత్రి సోమి రెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. పట్టుబడిన వారిలో కడప, నెల్లూరు, పులివెందుల, చిత్తూరు,తిరుపతి నుంచి వచ్చిన కౌన్సిలర్లు, ఉన్నారని చెప్పారు. వై సి పి డబ్బులతో ప్రలోభాలకు తెర లేపిందని అన్నారు.

వారు లీడ్ చేస్తున్నారు..

వారు లీడ్ చేస్తున్నారు..

జగన్, బొత్స, శ్రీకాంత్ రెడ్డి వీరంతా లీడ్ చేశారని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారుర. వైసిపి నీచమైన రాజకీయాలకు పాల్పడిందని అన్నారు. వేల కోట్ల రూపాయలు ఎక్కడ నుంచి వచ్చాయో వైసీపీ నేతలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. డబ్బులు పంచేందుకు విద్యార్థులను వాడుకున్నారని ఆరోపించారు. కేసు నమోదు చేస్తే వారి భవిష్యత్ ఏం కావాలని, వారిని ఎవరు ఆదుకుంటారని ఆయన ప్రశ్నించారు. నఃద్యాల అభివృద్ది జరుగుతుంటే... అభివృద్ధి జరగలేదని జగన్ ఆరోపించడం హాస్యాస్పదమని, జగన్ నోరు తెరిస్తే అబద్ధాలు చెపుతారని అన్నారు. నిజాయితీ గా మాట్లాడి నిజమైన ప్రతిపక్ష నేత గా నిరూపిచుకోవాలని సూచించారు. డబ్బులు పంచిన వారు ఎవరు, వారికి డబ్బులు ఇచ్చిన వారు, దీనిపై పోలీసులు విచారణ చేపట్టాలని అన్నారు.

చెప్పేదొకటి చేసేది మరోటి...

చెప్పేదొకటి చేసేది మరోటి...

ప్రతిపక్షనేత జగన్ చేప్పేది ఒక్కటి చేసేది ఓకటి అని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి అన్నారు. నంద్యాల టిడిపి కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నంద్యాల ఉప ఎన్నికలలో భూమా నాగిరెడ్డి కుటుంబీకులు ఓడిపోవాలని జగన్ కంకణం కట్టుకుని కుయుక్తులతో పని చేస్తున్నాడని ఆరోపించారు. దోంగే దోంగ దోంగ అన్న చందంగా జగన్ తీరు ఉందన్నారు. డబ్బులు అందించే వారు మాత్రం తప్పించుకున్నరని అన్నారు. వైకాపా ఎమ్మెల్యే పిఎ, కడప పులివెందులకు చెందిన కౌన్సిలర్ , నాయకులు బాస్కర్, కిరణ్ లతో పాటు విద్యార్దులు ఉన్నారన్నారు.

నంద్యాలలో మంత్రి పరిటాల సునీత

నంద్యాలలో మంత్రి పరిటాల సునీత

ఉప ఎన్నికలలో భాగంగా నంద్యాలలోని 23, 26 వార్డుల్లో మంత్రి అఖిల ప్రియతో కలిసి ప్రచారంలో పాల్గొన్న మంత్రి పరిటాల సునీత నంద్యాలలో తెలుగుదేశం గెలుపు తధ్యమని అన్నారు. ఎవరెన్ని మాటలు చెప్పిన, మభ్యపెట్టినా ప్రజలు నమ్మె స్ధితిలో లేరని అన్నారు. ప్రజలు అభివృద్ధిని చూసి ఓటేయాలని పిలుపు ఇచ్చారు.అప్పట్లో శోభానాగిరెడ్డి పెనుగొండ ఎన్నికల ప్రచారానికి వచ్చారని, ఈ రోజు వారు లేకపోవడం భాదగా ఉందని అన్నారు. ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి ఎన్ని ప్రయత్నాలు చేసినా ముఖ్యమంత్రి కాలేడని అన్నారు. జగన్ ముఖ్యమంత్రి స్ధాయిలో ఉన్న వ్యక్తిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సరికాదని అన్నారు. జగన్ హుందాగా మాట్లాడడం నేర్చుకోవాలని సూచించారు. జగన్ డ్వాక్రా రుణమాఫీ చేయలేదంటూ మాట్లాడుతున్నారని, ఇది జగన్ అవగాహనా లేమికి నిదర్శనమని, 88 లక్షల మంది డ్వాక్రా మహిళలకు ప్రతి ఒక్కరికీ రూ.10 వేలు మూడు విడతలుగా అందజేశామని సునీత చెప్పారు.

English summary
TDP MPJC Diwakar Reddy, ministers Paritala Sunitha, somireddy Chandramohan Reddy and others lashed out at YSR Congress party prsident YS Jagan in Nandyal bypoll
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X