అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైడ్రామా.. అనంత జైల్లో ఉండేందుకు జేసీ నిరాకరణ.. కరోనా భయం..

|
Google Oneindia TeluguNews

దివాకర్ ట్రావెల్స్ అక్రమాల కేసులో అరెస్టయిన జేసీ ప్రభాకర్‌ రెడ్డి, ఆయన తనయుడు అస్మిత్‌ రెడ్డికి అనంతపురం న్యాయస్థానం 14 రోజుల పాటు రిమాండ్‌ విధించింది. దీంతో పోలీసులు ఆ ఇద్దరిని అనంతపురంలోని రెడ్డిపల్లి జైలుకు తరలించారు.

జైలు వద్దకు చేరుకున్న సమయంలో అక్కడ కాస్త హైడ్రామా నడిచింది. జైల్లో ఓ ఖైదీకి కరోనా లక్షణాలు ఉన్నట్టు తేలడంతో.. అక్కడ ఉండేందుకు జేసీ ప్రభాకర్ రెడ్డి,అస్మిత్ రెడ్డి అభ్యంతరం తెలిపారు. తమను మరో జైలుకు మార్చాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కడప,గుత్తి,తాడిపత్రి జైళ్లలో ఏదో ఒక జైలుకు తరలించాలని విన్నవించుకున్నారు.

jc prabhakar reddy and asmith reddy high drama at anantapuram jail

Recommended Video

టిడిపి MP Ram Mohan Naidu కి వైసిపి MP Vijaya Sai Reddy Counter

శనివారం(జూన్ 13) తెల్లవారుజామున హైదరాబాద్‌లోని శంషాబాద్‌‌ నివాసంలో జేసీ ప్రభాకర్ రెడ్డి,అస్మిత్ రెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేశారు. అశోక్ లే లాండ్ నుంచి తుక్కు కింద కొనుగోలు చేసిన బస్సులకు
ఫోర్జరీ సంతకాలతో నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి, అవి ఫిట్‌గా ఉన్నట్టు నకిలీ రికార్డులు సృష్టించి,నాగాలండ్‌లో రిజిస్ట్రేషన్లు చేయించారు.ఎన్‌ఓసీ కూడా సంపాదించి అనంతపురం జిల్లాలోనూ రిజిస్ట్రేషన్లు పొందారు. ఇలా అనేక అక్రమాలతో బస్సులకు రిజిస్ట్రేషన్లు పొంది యథేచ్చగా బస్సులను తిప్పారు. విచారణలో ఈ అక్రమాలన్నీ బయటపడటంతో పోలీసులు జేసీతో పాటు ఆయన కుమారుడిని అరెస్ట్ చేశారు.

English summary
Anantapuram court here has ordered 14 days remand for TDP leaders JC Prabhakar Reddy and Asmith Reddy.After that police sent them to Anantapuram jail,but they were objected to stay there because a coronavirus suspected is there.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X