వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాజీ జేడి పోటీ చేసేది ఇక్క‌డి నుండే: ప‌వ‌న్ కు వ‌చ్చే మెజార్టీ కోస‌మేనా : ఆ సీటే ఎందుకంటే..!

|
Google Oneindia TeluguNews

సిబిఐ మాజీ జేడి ల‌క్ష్మీ నారాయ‌ణ జ‌న‌సేన నుండి ఎక్క‌డ పోటీ చేసేది ఖ‌రారైంది. ఆయ‌న లోక్‌స‌భ స్థానం నుండి బ‌రి లోకి దిగాల‌ని ఆకాంక్షించారు. దీనికి త‌గిన‌ట్లుగానే ప‌వ‌న్ ఆయ‌న‌కు ఎంపీగా అవ‌కాశం క‌ల్పిస్తూ పోటీ చేసే స్థానం ఖ‌రా రు చేసారు. అయితే, జెడి అక్క‌డి నుండి పోటీ చేస్తే..అదే లోక్‌స‌భ ప‌రిధిలో ప‌వ‌న్ ఎమ్మెల్యేగా బ‌రిలో నిలుస్తున్నారు. దీంతో..ఇప్పుడు తాను గెల‌వ‌టం తో పాటుగా జేడికి మెజార్టీ వ‌చ్చేలా చూడాల్సిన బాధ్య‌త ప‌వ‌న్ పై ప‌డింది...

JD Lakshmi Narayana to contest as MP form Vizag: pawan form Gajuwaka

ఎంపీగా బరిలోకి ల‌క్ష్మీనారాయ‌ణ‌..

సిబిఐ మాజీ జేడి లక్ష్మీ నారాయ‌ణ జ‌న‌సేన నుండి విశాఖ ఎంపీగా పోటీ చేయనున్నారు. ఆయ‌న తొలి నుండి విశాఖ నుండి పోటీ చేయ‌టానికి ఆస‌క్తి చూపిస్తున్నారు. అయితే, ప‌వ‌న్ మాత్రం జేడిని రాయ‌ల‌సీమ నుండి బ‌రిలోకి దింపాల ని భావించారు. కానీ, లక్ష్మీనారాయ‌ణ సుముఖంగా లేక‌పోవ‌టంతో ఇక ఆయ‌న కోరుకున్న విధంగా విశాఖ ఎంపీగా ఖ‌రా రు చేస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. అదే విధంగా..విశాఖ ఉత్తరం నుంచి పసుపులేటి ఉషాకిరణ్‌, విశాఖ దక్షిణం నుంచి గంపల గిరిధర్‌, విశాఖ తూర్పు నుంచి కోన తాతారావు, భీమిలి నుంచి పంచకర్ల సందీప్‌ అమలాపురం నుంచి శెట్టిబత్తుల రాజాబాబు, పెద్దాపురం నుంచి తుమ్మల రామస్వామి, పోలవరం నుంచి చిర్రి బాలరాజు, అనంతపురం నుంచి టీసీ వరుణ్‌ పోటీ చేయనున్నట్లు జాబితాను విడుదల చేసింది.

ప‌వ‌న్ కు వ‌చ్చే మెజార్టీ కోస‌మే...

ల‌క్ష్మీనారాయ‌ణ తొలి సారి గా ఎన్నిక‌ల్లో పోటీ చేస్తున్నారు. ఆయ‌న విశాఖ న‌గ‌రం ఎంచుకోవ‌టం వెనుక పెద్ద వ్యూహ‌మే క‌నిపిస్తోంది. ఎందుకంటే జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాన్ గాజువాక నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. గాజువాక నియోజ‌క‌వ‌ర్గం విశాఖ ప‌రిధిలోకి వ‌స్తుంది. గాజువాక లో ప‌వ‌న్‌కు వ‌చ్చే ఓట్లు ..స‌హ‌జంగా ఎంపీ అభ్య‌ర్దిగా ల‌క్ష్మీనారాయ ణ కు వ‌చ్చే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయి. ఇక‌, విశాఖ లో విద్యాధికులు ఎక్కువ‌. అదే విధంగా సామాజిక వ‌ర్గాల ప‌రంగా జ‌న‌సేన‌కు మ‌ద్ద‌తు ఎక్కువ ల‌భించే అవ‌కాశం ఉంది. ఇక ఇదే విశాఖ లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గం నుండి టిడిపి అభ్య‌ర్దిగా భ‌ర‌త్‌, వైసిపి నుండి ఎవివి స‌త్య‌నారాయ‌ణ బ‌రిలో ఉన్నారు. ఇక‌, ఇప్పుడు విశాఖ న‌గ‌రం నుండి టిడిపి.. వైసిపి..జ‌న‌సేన నుండి తొలి సారిగా ఎంపీ అభ్య‌ర్దులు పోటీ ప‌డుతున్నారు. ఇప్పుడు ఇక్క‌డ మాజీ జేడి ల‌క్ష్మీనారాయ ణ బ‌రిలోకి దిగ‌టంతో..ఇక్క‌డి ఎన్నిక పై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొని ఉంది.

English summary
CBI ex Jd contesting from Visakha loksabha representing janasena. Pawan Kalyan announced this selection. Pawan also contesting form Gajuwaka which under visakha loksabha constituency. Janasena released 4th list.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X