వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కిరణ్, జగన్ మోసగాళ్లు: జెడి, కెసిఆర్‌ను జైల్లో పెట్టైనా..

|
Google Oneindia TeluguNews

JD Sheelam fires at Kiran Kumar Reddy and YS Jagan
హైదరాబాద్: రాష్ట్ర విభజన వల్ల ఎవరికీ నష్టం లేదని కేంద్రమంత్రి జెడి శీలం అన్నారు. ఆయన ఇందిరాభన్ నుంచి కాంగ్రెస్ దళిత గిరిజన చైతన్య యాత్ర ప్రారంభ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

విభజన సమయంలో కాంగ్రెస్ అధిష్టానానికి సీమాంధ్ర ప్రజలు సమస్యలు చెబుతామని ఢిల్లీకి పిలిస్తే కిరణ్ కుమార్ రెడ్డి రాలేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీతోనే దళితులకు, గిరిజనులకు మేలు జరుగుతందని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ఏదో విధంగా భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోవాలని చూస్తున్నారని అన్నారు. జగన్ లాంటి వారు ఎంతమంది వచ్చినా కాంగ్రెస్ నుంచి దళితులను వేరు చేయలేరు అని అన్నారు.

పోలవరం ప్రాజెక్టును వ్యతిరేకిస్తే తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖర్ రావును జైల్లో పెట్టయినా ప్రాజెక్టును పూర్తి చేస్తామని జెడి శీలం అన్నారు. దోచుకుంటున్నారన్న మారీచున్ని విభజనతో వదిలించుకున్నామని అన్నారు. బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ నరరూప రాక్షసుడని ఆరోపించారు. అధికారం కోసం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అర్రులు చాస్తున్నారని జెడి శీలం ఆరోపించారు.

రాష్ట్ర విభజన వల్ల ఎవరికీ నష్టం జరగలేదని, నిజాలు చెప్పేందుకే చైతన్య యాత్ర చేపట్టినట్లు ఆయన తెలిపారు. జెడి శీలంతోపాటు కొప్పుల రాజు ఈ యాత్రకు నేతృత్వం వహించారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నతమైన పదవులు అనుభవించిన కావూరి సాంబశివరావు పార్టీని వీడటం బాధాకరమని ఆంధ్రప్రదేశ్ పిసిసి చీఫ్ రఘువీరా రెడ్డి అన్నారు. పార్టీని వీడిన వారు తిరిగి పార్టీలోకి వస్తామంటే ఆహ్వానిస్తామని ఆయన తెలిపారు.

English summary
Union Minister JD Sheelam on Friday fired at Jai Samaikyandhra Party president Kiran Kumar Reddy and YSR Congress Party president YS Jaganmohan Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X