నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అక్రమంగా బదిలీ చేశారంటూ జెఈ అర్తనగ్న ప్రదర్శన

By Pratap
|
Google Oneindia TeluguNews

విజయవాడ: తనను అక్రమంగా బదిలీ చేశారంటూ జేఈ స్థాయి అధికారి ఒకరు వినూత్న శైలిలో నిరసన తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని నీటిపారుదల శాఖ కార్యాలయం వద్ద ఆయన నిరసనకు దిగారు. నిబంధనలకు విరుద్ధంగా తనను బదిలీ చేశారని ఆరోపిస్తూ జేఈ సతీష్‌ కార్యాలయం ఎదుట అర్థనగ్న ప్రదర్శన చేశారు.

విద్యుత్తు ఉద్యోగుల సమ్మె

ఏపీఎస్‌పీడీసీఎల్‌ పరిధిలో పనిచేస్తున్న 660 మంది సబ్‌ ఇంజినీర్లు సోమవారంనాడు నెల్లూరులో నిరవధిక సమ్మె చేపట్టారు. ఉద్యోగుల పదోన్నతుల్లో అక్రమాలు జరిగాయని వారు ఆరోపిస్తున్నారు. దీనివల్ల విద్యుత్‌శాఖలో జరగాల్సిన పనులు పూర్తిగా స్తంభించాయి. తమ సమస్యను పరిష్కరించే వరకూ సమ్మెను విరమించబోమని అంటున్నారు.

JE protests alleging illegal transfer in West Godavari districtc

కెమికల్ ఫ్యాక్టరీని ధ్వంసం చేసేందుకు యత్నం

నెల్లూరు జిల్లా వింజమూరు మండలం చందరపడియలో ఓ కెమికల్‌ ఫ్యాక్టరీని ధ్వంసం చేసేందుకు గ్రామ ప్రజలు ప్రయత్నించారు. ఫ్యాక్టరీ నుంచి విషవాయువులు వెలువడుతున్నాయని ఆరోపిస్తూ దాని వల్ల ఫ్యాక్టరీ చుట్టుప్రక్కల గ్రామస్థులు వ్యాధుల భారిన పడుతున్నారని వారు ఈ చర్యకు ప్రయత్నించారు. గ్రామస్తులందరు కలిసి ఫ్యాక్టరీలోని మెటీరియల్‌, ఫర్నీచర్‌ను పెట్రోల్‌పోసి తగులబెట్టేందుకు ప్రయత్నించారు. అయితే సమాచారం అందుకున్న పోలీసులు వారిని అడ్డుకున్నారు.

జీవో రద్దు చేయాలి..

తెలుగు మీడియం ఉన్న పాఠశాలలను మూసివేసే జీవోను రద్ధుచేయాలని ఎస్టీయూ నేతలు డిమాండ్‌ చేశారు. తెలుగు మీడియం, ఇంగ్లీషు మీడియం సమాంతరంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కడప జిల్లాలో కోరారు. తెలుగు మాధ్యమాన్ని పూర్తిగా రద్ధుచేయకుండా సమాంతరంగా నిర్వహించాలని, ప్రాథమిక స్థాయి నుంచి ఆంగ్లమాధ్యమం ఏర్పాటుచేయాలని కోరారు. ఉపాధ్యాయులకు పూర్తిస్థాయిలో శిక్షణ ఇచ్చిన తర్వాత ఆంగ్లమాధ్యమాన్ని ప్రవేశపెట్టాలని కోరారు.

English summary
A JE Satish toop up protest alleging he has been illegally transferred in West Godavari district of Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X