వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెసిఆర్‌తో భేటీ: జీవిత, రాజశేఖర్ హ్యాపీ (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుతో భేటీ తర్వాత తెలుగు సినీ దంపతులు జీవిత, రాజశేఖర్ ఆనందంగా కనిపించారు. తెలుగు సినిమాలో కొంత మంది ఆధిపత్యంపై రాజశేఖర్ ప్రశ్నించగా, ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలు వేరైనా అందరూ తెలుగువారేనని కెసిఆర్ అన్నట్లు జీవిత చెప్పారు. అందుకు ఆమె హర్షం కూడా వ్యక్తం చేశారు.

సినిమా ఇండస్ట్రీ కొంత మంది గప్పెట్లో ఉందని వారు ఆరోపించారు. చిన్న సినిమాలను బతికించాలని ముఖ్యమంత్రిని కోరినట్లు తెలిపారు. రెండు రాష్ట్రాలు అభివృద్ధిలో పోటీపడతాయని జీవిత,రాజశేఖర్ ఆకాంక్షించారు.

తెలంగాణ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్(టీయూజేడబ్ల్యూ) ప్రతినిధులు గురువారం సచివాలయంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావును కలిశారు. తెలంగాణలోని జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలివ్వాలని, గ్రామీణ విలేకరులు, డెస్కుల్లో పని చేసేవారికి అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలని, ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో హెల్త్ కార్డులు జారీ చేయాలని కోరారు.

ఖమ్మంలో జర్నలిస్టులకు కేటాయించిన స్థలాలను ఇతరులకు బదిలీ చేశారని, ఆ స్థలాలను తిరిగి జర్నలిస్టులకు ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. వీటికి కేసీఆర్ సానుకూలంగా స్పందించారని జర్నలిస్టు ప్రతినిధులు తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం పైన తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసన సభ్యుడు రేవంత్ రెడ్డి గురువారం మండిపడ్డారు. హామీల అమలులో తెరాస ప్రభుత్వం వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి వారసత్వంలా కనిపిస్తోందని ఎద్దేవా చేశారు.

తెలంగాణ సచివాలయంలో రేవంత్

తెలంగాణ సచివాలయంలో రేవంత్

తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి గురువారంనాడు తెలంగాణ సచివాలయానికి వచ్చారు. ఆయన కెసిఆర్‌పై విమర్శలు గుప్పించారు.

జీవిత, రాజశేఖర్ ఇలా...

జీవిత, రాజశేఖర్ ఇలా...

సినీ దంపతులు జీవిత, రాజశేఖర్ గురువారంనాడు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావును కలిశారు. కెసిఆర్ ఇచ్చిన హామీల పట్ల వారు ఆనందం వ్యక్తం చేశారు.

తెలుగువారు ఒక్కటే..

తెలుగువారు ఒక్కటే..

రాష్ట్రాలు వేరైనా తెలుగువారంతా ఒక్కటేనని కెసిఆర్ చెప్పారని అంటూ జీవితా రాజశేఖర్ ఆ మాటకు ఆనందం వ్యక్తం చేశారు.

రాజశేఖర్ ఆవేదన

రాజశేఖర్ ఆవేదన

సినీరంగం కొంత మంది గుప్పిట్లో పాతికేళ్ల నుంచి నలుగుతోందని, దాన్ని పరిష్కరించాలని హీరో రాజశేఖర్ అన్నారు.

మీడియాతో జీవిత, రాజశేఖర్

మీడియాతో జీవిత, రాజశేఖర్

తెలుగు సినీ దంపతులు జీవిత, రాజశేఖర్ కెసిఆర్‌ను కలిసిన తర్వాత చాలా ఉత్సాహంగా కనిపించారు. వారు ప్రస్తుతం బిజెపిలో ఉన్నారు.

గిరీష్ సంఘీ ఇలా..

గిరీష్ సంఘీ ఇలా..

మాజీ పార్లమెంటు సభ్యుడు, వార్త దినపత్రిక అధినేత గిరీష్ సంఘీ తెలంగాణ సచివాలయానికి వచ్చారు.

జర్నలిస్టుల కోర్కెల చిట్టా...

జర్నలిస్టుల కోర్కెల చిట్టా...

టియుజెడబ్ల్యూ ప్రతినిధులు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు వద్ద తమ కోర్కెల చిట్టా విప్పారు.

English summary
Telugu cine couple Jeevitha and Rajasekhar expressed happy after meeting Telangana CM K Chandrasekhar Rao.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X