• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

లక్ష్మీ పార్వతికి బాసటగా జీవితారాజశేఖర్.. మరీ ఇంత దిగజారుడా అంటూ ఫైర్

|

ఓడిపోతామన్న భయంతో ఓటమి భరించలేక తెలుగుదేశం పార్టీ లక్ష్మి పార్వతిపై లేనిపోని అభాండాలు వేస్తున్నదని సినిమా నటుడు..వైసీపీ నేత రాజశేఖర్ మండిపడుతున్నారు . లక్ష్మీపార్వతి లైంగిక వేధింపుల వివాదం చిలికి చిలికి గాలివానగా మారుతోంది. వైసిపి నాయకురాలు లక్ష్మి పార్వతి ఎన్నికల ప్రచారంలో జోరుగా ముందుకు సాగుతున్న తరుణంలో లక్ష్మీపార్వతి దగ్గర పనిచేసిన కోటి అనే అనుచరుడు ఆమె తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ, ఆమె వేధింపులు భరించలేక పోతున్నాను అంటూ పోలీసులను ఆశ్రయించాడు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన ఈ వ్యవహారంపై జీవితా రాజశేఖర్ ఫైర్ అయ్యారు. ఏ ఛానల్ చూసిన దీని గురించే చర్చ చేస్తున్నారంటూ వాస్తవాలు తెలీకుండా ఎలాపడితే అలా మహిళల మీద ఎలా వార్తలు వేస్తారంటూ జీవితా రాజశేఖర్ ఈ వార్తలపై ఘాటుగా స్పందించారు.

లక్ష్మీపార్వతికి బాసటగా నిలిచిన జీవితా రాజశేఖర్

లక్ష్మీపార్వతికి బాసటగా నిలిచిన జీవితా రాజశేఖర్

లక్ష్మీపార్వతిపై అనవసరంగా నిందలు మోపుతున్నారని .. దీనివెనుక పెద్ద కుట్ర ఉందని జీవితారాజశేఖర్ మండిపడ్డారు. రాజకీయ దురుద్దేశంతోనే ఇదంతా చేయిస్తున్నారని జీవితా రాజశేఖర్ అన్నారు. ఎన్టీఆర్ ను చేసుకున్న లక్ష్మీ పార్వతి.. జయప్రద , జయసుధ లాగా అందంగా ఉంటే ఆమె ఎప్పుడో తర్వాత సీఎం అయ్యుండేవారన్నారు. లక్ష్మీపార్వతిలో హీరోయిన్ల లాంటి అందం లేదు కాబట్టే ఇలా అయిపోందన్నారు. ఇక లక్ష్మీ పార్వతి పట్ల విపరీతమైన అభిమానాన్ని ప్రదర్శించిన జీవితా రాజశేఖర్ ఎన్టీఆర్ ను అందరూ వదిలేసి పట్టించుకోకపోవడంతోనే లక్ష్మీపార్వతి ఆయనకు సేవ చేసిందని, ఆమె ఎలాంటి ప్రయోజనం ఆశించకుండా సేవ చేసిందని తెలిపారు.

వయసుకు కూడా గొరవం లేకుండా .. రాజకీయాల కోసం ఇంత దిగజారుడా .. జీవిత ఫైర్

వయసుకు కూడా గొరవం లేకుండా .. రాజకీయాల కోసం ఇంత దిగజారుడా .. జీవిత ఫైర్

లక్ష్మీ పార్వతి వయసు చాలా పెద్దదని, కనీసం వయసుకు కూడా గౌరవం ఇవ్వకుండా వాడెవడో వచ్చి ఆరోపణలు చేయడం ఏంటని జీవిత నిలదీశారు. ఇన్ని సంవత్సరాలుగా ఉన్న వెధవకు ఈరోజు ఎన్నికల ముందు వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఏముందని జీవిత ప్రశ్నించారు.మీకు అమ్మలు అక్కలు చెల్లెళ్ళు లేరా అంటూ నిలదీసిన జీవిత వాడు ఫిర్యాదు చేశాక అది ఫ్రూవ్ అయ్యిందా లేదా తెలుసుకోకుండా ఛానళ్లలో పెట్టి పరువు తీస్తారా అని మీడియాపై నిప్పులు చెరిగారు జీవిత .

లక్ష్మీపార్వతిపై మరో ఆరోపణ చేసిన కోటి..! చెప్పింది తప్పైతే నడిరోడ్ మీద ఉరి తియ్యండి

 ఎన్నికల సమయంలో ఫిర్యాదు ఆంతర్యం ఏంటి ?

ఎన్నికల సమయంలో ఫిర్యాదు ఆంతర్యం ఏంటి ?

అంతేకాదు ఆమె చాట్ చేసింది అని చెప్తున్న వాట్సాప్ చాట్ ను, ఆమె గొంతుతో మాట్లాడింది అని చెప్తున్న ఆడియో రికార్డులను పోలీసులకు ఇచ్చి తనకు రక్షణ కావాలని వాడు కోరటం , దానికి పెద్ద సినిమా చెయ్యటం చండాలంగా ఉందని జీవితా రాజశేఖర్ మండిపాటుకు గురయ్యారు. లక్ష్మీపార్వతికి బాసటగా నిలిచిన జీవితా రాజశేఖర్ లు ప్రశ్నిస్తున్న దానిలో కూడా వాస్తవం లేకపోలేదు. ఇంతకాలం బయట పడని కోటి ఎన్నికల సమయంలో ఇప్పుడే ఎందుకు లక్ష్మీ పార్వతి పై ఫిర్యాదు చేశాడు . ఎన్నికలు జరిగే సమయంలో ఈ తరహా ఫిర్యాదు ఆంతర్యం రాజకీయ దురుద్దేశం అని ఒక భావన ఉన్నప్పటికీ పోలీసులు దర్యాప్తులో ఏమి తేలుస్తారో వేచి చూడాలి .

English summary
Sexual harassment case has been filed on YCP leader Lakshmi Parvathi. A man identified as Koti registered a case on Lakshmi Parvathi alleging that she has been harassing him and has been approaching him inappropriately. He alligated that he has threat with YCP leaders and Lakshmi parvathi. On this issue Jeevitha rajasekhar reacted as a support of Lakshmiparvathi . Jeevitha fired on media and also TDP about the fake complaint given by an idiot in the election time. this is wantedly given by the person as a political grudge .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X