• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

జేఎఫ్‌సి: కేంద్రం నుంచి ఏపీకి రావాల్సింది రూ.74,542 కోట్లు, లోటులో బాబుకు మద్దతుగా

|

హైదరాబాద్: రాజధాని నిర్మాణానికి సాయం చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షులు జయప్రకాశ్ నారాయణ అన్నారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రం నుంచి ఏపీకి ఎంత వచ్చింది, ఇంకా ఎంత రావాలనే విషయాలను చెప్పారు.

  Pawan Kalyan's JFC Final Report On Centre's Aid To AP

  జేఎఫ్‌సీ నివేదిక, జేపీ చెప్పిన వివరాల ప్రకారం... కేంద్రం నుంచి ఏపీకి రూ.74.542 కోట్లు రావాల్సి ఉంది. ఇది రెవెన్యూ లోటు, కేంద్ర ప్రాయోజిత పథకాలు, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ది వంటి గణించదగిన లెక్కల్లోని భాగం.

  రూ.74,542 కోట్లు కేంద్రం నుంచి రావాలి

  రూ.74,542 కోట్లు కేంద్రం నుంచి రావాలి

  రాష్ట్రానికింకా రావల్సిన రూ.74,542 కోట్ల నిధులను వచ్చే బడ్జెట్లలో కేంద్రం కేటాయించాలని కోరారు. ప్రత్యేక హోదాకు ప్రత్యామ్నాయం లేదని స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టును కేంద్రమే నిర్మించి ఇవ్వాలని, పదో షెడ్యూల్‌లో ఉన్న సంస్థలను ఏపీలో ఏర్పాటు చేసేందుకు కేంద్రప్రభుత్వం ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాలని కోరారు. 11 అంశాలపై జేఎఫ్‌సీ రూపొందించిన నివేదికను ప్రధాని మోడీకి కూడా పంపించనున్నట్లు చెప్పారు.

  విభజన వల్లే జనసేన, ఏం మాటలవి, సత్తా లేదా, డ్రామాలు: బాబును దులిపేసిన పవన్

  ఎన్డీయే చెప్పినట్లు ఆర్థిక సంఘం నివేదికలో లేదు

  ఎన్డీయే చెప్పినట్లు ఆర్థిక సంఘం నివేదికలో లేదు

  నివేదికలో పొందుపర్చిన అంశాలు ఇవీ.. ఏపీకి హోదా ఇస్తామని నాటి ప్రధాని మన్మోహన్ సింగ్‌ రాజ్యసభలో ప్రకటించారు. నాటి కేంద్ర మంత్రివర్గం కూడా ఆమోదించింది. కానీ 14వ ఆర్థిక సంఘం ప్రత్యేకహోదా అనేది రద్దు చేయాలని సిఫార్సు చేసినట్లు ఎన్డీయే ప్రభుత్వం తెలిపింది. కానీ ఆర్థిక సంఘం నివేదికలో ఎక్కడా లేదు. ప్రత్యేక హోదాకిక కాలం చెల్లిందని కేంద్రం చెపుతోంది కానీ ఇప్పటికీ 11 రాష్ట్రాలు ప్రత్యేక హోదాను కలిగి ఉన్నాయి.

  ఆ లడ్డూలు కూడా లేవు, పుండు మీద కారం, పాలించే హక్కులేదు: మోడీపై పవన్ సంచలనం

  ఏపీ అంగీకరించింది, కాని ఇప్పటి వరకు ఇవ్వలేదు

  ఏపీ అంగీకరించింది, కాని ఇప్పటి వరకు ఇవ్వలేదు

  రానున్న అయిదేళ్ల పాటు ఏపీ ఆదాయ లోటుతో కొనసాగనుంది. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలోని 95 శాతం ఆస్తులన్నీ హైదరాబాద్‌లో ఉన్నందున తెలంగాణకు వెళ్లాయి. పంపకానికి చాలాకాలం పడుతుంది. ఏపీకి నష్టం జరిగినందున హోదా హామీని అమలు చేయాలి. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సూచన మేరకు ప్యాకేజీ కింద సాయం తీసుకోవడానికి ఏపీ అంగీకరించింది. ఈ మేరకు కేంద్ర ప్రాయోజిత పథకాల కింద రూ.16,447 కోట్లను ఇస్తామని తెలిపారు. కానీ ఇప్పటి వరకూ ఏమీ చెల్లించలేదు.

  రెవెన్యూ లోటుపై జేఎఫ్‌సీ నివేదిక బాబుకు అనుకూలంగా

  రెవెన్యూ లోటుపై జేఎఫ్‌సీ నివేదిక బాబుకు అనుకూలంగా

  అకౌంటెంట్‌ జనరల్‌ అంచనాల ప్రకారం ఏపీకి 2014-15లో ఆదాయ లోటు రూ.16,078 కోట్లు ఉంది. కేంద్రం ఈ లోటు కొత్త పథకాల వల్ల వచ్చిందని, నికరంగా రూ.4117.89 కోట్లు లోటు మాత్రమే ఉందని, అందులో రూ.3,979.50 కోట్లు మాత్రమే ఇచ్చింది. మొత్తం 11 జాతీయస్థాయి సంస్థలు ఇస్తామని చెప్పిన కేంద్రం తొమ్మిది మంజూరుచేసింది. విశాఖ, విజయవాడలకు మెట్రో ప్రాజెక్టులు ఇవ్వాలి. రెవెన్యూ లోటు విషయంలో పవన్ జేఎఫ్‌సీ నివేదిక చంద్రబాబుకు అనుకూలంగా ఉందని అంటున్నారు.

  కచ్చితంగా ఖండించాల్సిన అంశాలు

  కచ్చితంగా ఖండించాల్సిన అంశాలు

  శనివారం జేపీ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్న విషయాల్లో కచ్చితంగా ఖండించాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయని చెప్పారు. ప్రభుత్వాల్లా సుదీర్ఘ సమయం తీసుకొని పరిశోధనలు తీసుకొని తాము వివరించలేమని చెప్పారు. పది రోజుల్లో జేఎఫ్‌సీ చేసిన కృషి ఫలితంగా ఈ సమాచారం లభించిందన్నారు. ఏపీకి బుందేల్ ఖండ్ తరహా ప్యాకేజీ ఇవ్వాలన్నారు. రాజధానికి కేంద్రం నిధులివ్వాలని ఇలా ఆలస్యం చేస్తే 50 ఏళ్లయినా రాజధాని పూర్తి కాదన్నారు. విశాఖ-చెన్నై కారిడార్‌కు రూ.6వేల కోట్లు రావాలన్నారు.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Lok Satta chief Jayaprakash Narayana said Centre is yet to pay Rs 74,542 crore when analyzed 7 major aspects of the AP Reorganisation Act 2014.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more