వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేంద్రం పైనే పవన్ జేఎఫ్‌సీ అభ్యంతరం, ముగ్గురితో అసలు లెక్క, లెక్కచెప్పనున్న ఏపీ

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో జరిగిన జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ భేటీలో ప్రతినిధులు ముఖ్యంగా కేంద్రం తీరు పైనే అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. ఏపీ విభజన చట్టం అమలుకు ఉమ్మడి పోరాటం చేయాలని నిర్ణయించారు.

మోడీ నటిస్తే కనుక, కేవలం మంత్రమే: పవన్ కళ్యాణ్ హోదా డిమాండ్‌కు జేపీ షాక్మోడీ నటిస్తే కనుక, కేవలం మంత్రమే: పవన్ కళ్యాణ్ హోదా డిమాండ్‌కు జేపీ షాక్

వివిధ అంశాలపై సబ్ కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీకి సమాచారం అందించేందుకు ముగ్గురు మాజీ ఐఏఎస్‌లతో ఓ టీంను ఏర్పాటు చేయనున్నారు. విభజన హామీలు ఏ మేరకు అమలయ్యాయో నిర్ధారణ చేసి ప్రజలకు చెప్పనున్నారు.

లెక్కలపై టీడీపీ లేఖ

లెక్కలపై టీడీపీ లేఖ

నిజనిర్ధారణ కమిటీ లెక్కలను తేల్చి ప్రజల ముందు ఉంచితే టీడీపీ ఇరకాటంలో పడుతుందా, బీజేపీ పడుతుందా తెలియనుంది. విభజన హామీల వివరాలను గందరగోళానికి తెరదించాలని నిర్ణయించారు. ఈ రాత్రి (శుక్రవారం) లోగా టీడీపీ లెక్కలపై లైఖ ఇచ్చే అవకాశముంది.

తెలుగుదేశం పార్టీ

తెలుగుదేశం పార్టీ

తెలుగుదేశం పార్టీ లేఖ ఇస్తే కనుక శనివారం ఫ్యాక్ట్ ఫైండింగ్ చర్చలో దీనిని చర్చిస్తారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో ప్రజల సమస్యలపై పోరాడాలని జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ నిర్ణయించింది.

రాష్ట్రం లెక్కలివ్వాలని కేంద్రం అనడం సరికాదు

రాష్ట్రం లెక్కలివ్వాలని కేంద్రం అనడం సరికాదు

తాము ఇచ్చిన దాంతో ఏం చేశారని రాష్ట్రాన్ని కేంద్రం ప్రశ్నించడం సరికాదని జేపీ అన్నారు. ఆ భాషను కమిటీ తిరస్కరిస్తుందని చెప్పారు. ప్రజా ధనాన్ని ఇవ్వడానికి కేంద్రం ఎవరని ప్రశ్నించారు. బీజేపీ పరంగా లెక్కలపై పత్రాలు విడుదల చేస్తే తాము నమ్మమని, కేంద్రం నుంచి అధికారికంగా లెక్కలు విడుదల కావాలన్నారు.

 రెండు రాష్ట్రాల కోసం

రెండు రాష్ట్రాల కోసం

తెలంగాణ, ఏపీ హక్కులను సాధించుకునేందుకు ఉమ్మడిగా పని చేస్తామని చెప్పారు. ఇది రెండు రాష్ట్రాల కోసమని చెప్పారు. పద్మనాభయ్య ఆధ్వర్యంలో ముఖ్యంగా ఆర్థిక లోటు, వెనుకబడిన ప్రాంతాలు, పోలవరం, పన్ను రాయితీలు, సంస్థలు, మౌలిగ సదుపాయాలు, మెట్రోలు, పోర్టుల ఏర్పాటు, రైల్వే జోన్, ప్రత్యేక ప్రతిపత్తి, ప్యాకేజీ, అమరావతి నిర్మాణం కోసం నిధుల అంశాలపై నివేదిక రూపొందిస్తారని చెప్పారు.

English summary
Jana Sena chief Pawan Kalyan's Joint Fact Finding Committee set up three member committee.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X