వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్‌కు ‘జేఎఫ్‌సీ’ నివేదిక! కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను తప్పుబట్టిన కమిటీ!?

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌‌కు గురువారం సాయంత్రం సంయుక్త నిజనిర్ధారణ కమిటీ 'జేఎఫ్‌సీ' ప్రాథమిక నివేదిక అందజేసినట్లు తెలుస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే ఏపీని ముంచినట్లు ఆ నివేదికలో కమిటీ నిగ్గుతేలినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

ఇటు కేంద్రం, అటు రాష్ట్ర ప్రభుత్వం ఒక్కటంటే ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేకపోయాయని 'జేఎఫ్‌సీ' తన నివేదికలో స్పష్టం చేసినట్లు తెలిసింది. శుక్రవారం మరోసారి జేఎఫ్‌‌సీ భేటీ అయి, ఈ నివేదికపై నిశితంగా చర్చించనుందని సమాచారం.

pawan-kalyan

గురువారం సాయంత్రం జనసేనాని పవన్‌ కళ్యాణ్‌తో జేఎఫ్‌సీ త్రిసభ్య కమిటీ సభ్యులు సమావేశమై కమిటీ నివేదికపై చర్చించినట్లు తెలుస్తోంది. రెండు రోజుల్లో పూర్తిస్థాయి నివేదిక ఇస్తామని వారు పవన్‌కు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

శుక్రవారం మరోసారి సమావేశమై జేఎఫ్‌సీ నివేదికపై పూర్తి స్థాయిలో చర్చించాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించినట్లు చెబుతున్నారు. ఆ తర్వాత ఆ నివేదికను ప్రజల ఎదుటికి తెచ్చేందుకు జనసేనాని సిద్ధమైనట్లు సమాచారం.

English summary
The Jana Sena Chief Pawan Kalyan forming a Joint Fact-Finding Committee members have presented their submission to Pawan Kalyan. It is learned that both the central and state governments have failed miserably to implement their promises. Basing on the facts available, there will be another meeting conducted by Joint Fact-Finding Committee members and a final report is likely to be submitted tomorrow after proper discussion. There is also a report that both State and Central governments have cheated the Andhra Pradesh State.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X